India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెందుర్తి సెంటిమెంట్ పంచకర్ల రమేశ్‌బాబు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ నియోజకవర్గ నుంచి ఒకసారి గెలిచిన వ్యక్తి రెండో పర్యాయం గెలిచిన దాఖలాలు లేవు. దీనికి భిన్నంగా మంగళవారం వెలువడిన ఫలితాల్లో పంచకర్ల 81,870 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్‌పై విజయం సాధించారు. దీనితో పెందుర్తి నియోజకవర్గంలో పాత సెంటిమెంట్‌కి చెక్ పెడుతూ కొత్త చరిత్రను పంచకర్ల రచించారు.
అరకు పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన గుమ్మ తనూజ రాణి రిటర్నింగ్ అధికారి నిషాంత్ కుమార్ నుంచి మంగళవారం రాత్రి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు భారీ ఓటమి చవిచూశారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తొలి రెండు స్థానాల్లో ఓడిన అభ్యర్థులు వీరే కావడం గమనార్హం. గాజువాకలో అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాస్‌రావు 95,235 ఓట్ల మెజారిటీతో గెలిపొందగా, అవంతిపై గంటా శ్రీనివాస్ రావు 92,401 ఓట్ల తేడాతో గెలిపొందారు.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసకాండతో ఓట్ల లెక్కింపు నిర్వహణపై విశాఖ నగర పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీపీ రవిశంకర్ అయ్యర్ ప్రత్యేక వ్యూహంతో నగరమంతటా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందు తర్వాత నగరంలో ప్రశాంత వాతావరణ నెలకొనడంలో పోలీసులు కీలకపాత్ర పోషించారు.
అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సీఎం రమేశ్ జిల్లా కలెక్టర్ రవి సుభాష్ నుంచి మంగళవారం రాత్రి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు.
విశాఖ ఎంపీగా ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిన శ్రీభరత్‌ను చంద్రబాబుతో పాటు బాలకృష్ణ అభినందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీభరత్ సతీమణితో చంద్రబాబును, బాలకృష్ణుడు మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యధిక మెజార్టీ సాధించిన శ్రీభరత్‌కు చంద్రబాబు, బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
విశాఖ సీతకొండ దగ్గర YSR వ్యూ పాయింట్ పేరును అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా గుర్తు తెలియని వ్యక్తులు మార్చారు. జీ-20 సమయంలో విశాఖ నగరాన్ని సుందరీకరించి సీతకొండ దగ్గర వ్యూ పాయింట్‌ను వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా నామకరణ చేసి ఇక్కడ నేమ్ బోర్డు సైతం పెట్టారు. తాజాగా వైఎస్సార్ అక్షరాలపై అబ్దుల్ కలాం స్టిక్కర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతికించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. భీమిలిలో గెలిచిన గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమలో పీవీజీఆర్ నాయుడు (గణబాబు) విజయం సాధించారు.
అనకాపల్లి ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ 2,96,530 పైచిలుకు మెజార్టీలో ఉన్నారు. సీఎం రమేశ్‌కు 7,62,069 ఓట్లు పోలవ్వగా.. తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుకి 4,65,539 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్తి వేగి వెంకటేశ్‌కు 25,651 ఓట్లు పోలవ్వగా.. నోటాకు 26,235 మంది ఓటేశారు.
విశాఖ ఎంపీగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీభరత్‌కి 9,07,467 ఓట్లు పోలవ్వగా.. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి 4,03,220 ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి పి.సత్యారెడ్డి 30,267 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
Sorry, no posts matched your criteria.