Visakhapatnam

News June 4, 2024

విశాఖలో 5లక్షలు దాటిన శ్రీభరత్ మెజార్టీ

image

విశాఖ ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. భరత్‌కి 9,07,467 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కేవలం 4,03,220 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీగా నిలవనుంది. కూటమి అభ్యర్థిగా నిలిచిన శ్రీభరత్‌కు భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు.

News June 4, 2024

విశాఖపట్నంలో అభ్యర్థుల కంటే నోటా ఓట్లే అధికం

image

విశాఖ పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థుల కంటే నోటాకు అధికంగా ఓట్లు లభించడం విశేషం. విశాఖపట్నంలో 33 మంది పోటీ చేయగా కేవలం ఐదుగురు మాత్రం 5 వేల కంటే అధికంగా ఓట్లు సాధించారు. నోటాకు 5171 ఓట్లు లభించాయి. మిగిలిన 28 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగా ఓట్లు పోలవరం గమనార్హం. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి పార్టీ, బీఎస్పీ అభ్యర్థులకు మాత్రమే 5000 కంటే అధికంగా ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

ఉమ్మడి విశాఖలో గెలిచింది వీరే

image

⁍ విశాఖ(E): వెలగపూడి(TDP), విశాఖ(W):గణబాబు(TDP)
⁍ విశాఖ(N): విష్ణుకుమార్(BJP), విశాఖ(S): వంశీకృష్ణ(JSP)
⁍ భీమిలి: గంటా(TDP), గాజువాక: పల్లా శ్రీను(TDP)
⁍ పెందుర్తి: పంచకర్ల(JSP),యలమంచిలి:సుందరపు(JSP)
⁍ చోడవరం:KSNS రాజు(TDP), అనకాపల్లి: కొణతాల(JSP)
⁍ మాడుగుల: బండారు(TDP),నర్సీపట్నం: అయ్యన్నపాత్రుడు(TDP)
⁍ పాయకరావుపేట: అనిత(TDP)
⁍ అరకు: మత్స్యలింగం(YCP)
⁍ పాడేరు: విశ్వేశ్వరరాజు(YCP)

News June 4, 2024

విశాఖలో 5లక్షల మెజారిటీ‌కి చేరువలో శ్రీభరత్

image

విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5 లక్షల భారీ మెజారిటీకి చేరువులో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 8,93,613 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 3,97,555 ఓట్లు సాధించారు. దీనితో ప్రస్తుతం భరత్ మెజారిటీ 4,96,058కి చేరింది. మరి కొద్దిసేపట్లో ఐదు లక్షల మెజారిటీని శ్రీభరత్ చేరుకోనున్నారు.

News June 4, 2024

మొదట రౌండ్ నుంచి వెనుకంజలో గుడివాడ

image

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి వైసీపీ నుంచి మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్‌పై 94,058 ఓట్ల భారీ మెజారిటీని సాధించారు. 22 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి పల్లా శ్రీనివాసరావు తన ఆధిక్యతను కొనసాగించారు. చివరి రెండు రౌండ్లు ముగిసే సమయానికి పల్లా శ్రీనివాస్‌కు 1,55,587 ఓట్లు లభించాయి.

News June 4, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

ఈనెల 6 తేదీన పలాస-విశాఖపట్నం మధ్య నడిచే పాసింజర్ రైలు, విశాఖ- పలాస మధ్య నడిచే పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం- గుణుపూర్ మధ్య నడిచే పాసింజర్ రైలు, గుణుపూర్-విశాఖకు నడిచే పాసింజర్ రైలు రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.

News June 4, 2024

ఐదేళ్ళ నిరీక్షణ ఫలించింది: గంటా

image

కూటమి సునామీలో వైసిపి కొట్టుకుపోయిందని భీమిలి కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎంవీపీ కాలనీలోని గంటా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో 151 సీట్లతో అధికారం పొందిన వైసీపీ 2024లో తక్కువ స్థానాలకు పరిమితం అయిందన్నారు. కూటమి అభ్యర్థులపై ప్రజల విశ్వాసం ఉంచారని అన్నారు.

News June 4, 2024

మరపురాని గెలుపును సొంతం చేసుకోనున్న శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.శ్రీ భరత్ మరపురాని గెలుపును సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో శ్రీభరత్‌కు 8,20,427 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కేవలం 3,65,190 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో శ్రీభరత్ మెజారిటీ 4,55,231కి చేరింది. విశాఖ వేదికగా ఒక చారిత్రాత్మక విజయాన్ని శ్రీభరత్ సొంతం చేసుకోనున్నారు.

News June 4, 2024

విశాఖ: వంశీకృష్ణకు గుర్తింపు పత్రం 

image

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విజయాన్ని అధికారంగా ప్రకటించిన అధికారులు గుర్తింపు పత్రం అందజేశారు. గుర్తింపు పత్రం అందజేశారు. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఎన్నికల పరిశీలకులు అమిత్ శర్మ, ఆర్వో సీతారామ మూర్తి లాంఛనంగా అందజేశారు.

News June 4, 2024

నాలుగు లక్షలు దాటిన శ్రీభరత్ మెజార్టీ

image

విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ 4 లక్షల మెజారిటీ దాటింది. ఇప్పటివరకు భరత్‌కు 7,28,914 ఓట్లు లభించాయి. బొత్స ఝాన్సీకి 3,23,932 ఓట్లు లభించాయి. దీంతో శ్రీభరత్ 4,04,982 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరొక పది ఓట్లు కలిస్తే భరత్ నాలుగు లక్షల మార్కును చేరుకుంటారు. విశాఖ లోక్‌సభ స్థానంలో సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నారు.