India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చినముషిడివాడకు చెందిన తెరపల్లి రాజేష్(33) బ్యాంకాక్‌లో చైనీస్ కంపెనీ నిర్బంధంలో ఉన్నాడు. ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేసిన రాజేష్ థాయిలాండ్‌లో ఉద్యోగానికి గత నెల 25న బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈనెల 10న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఇండియా వెళ్లాలంటే రూ.8 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తండ్రి శివకి చెప్పాడు. ఈ మేరకు తండ్రి విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు.
మరో 8 రోజుల్లో APకి కాబోయే CM ఎవరో తేలిపోనుంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని YCP నాయకులు డేట్, టైం ఫిక్స్ చేశారు. అటు TDP నాయకులు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దీంతో జూన్ 8,9 తేదీల్లో విశాఖలోని హోటల్ రూములన్నీ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఏపీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని మీరు భావిస్తున్నారు.
విశాఖ నగరంలో శనివారం అర్ధరాత్రి వరకు పోలీసులు పలుచోట్ల విస్తృతంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్వయంగా పర్యవేక్షించారు. జోన్-1 పరిధిలో ఫోర్ వీలర్స్-17, టూ వీలర్స్-148, ఆటోలు-17, జోన్-2 పరిధిలో టూ వీలర్స్-175, ఆటోలు-10, ఫోర్ వీలర్స్-14, ఒక కమర్షియల్ వాహనంపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు చెందిన ఆరో సెమిస్టర్ ఫలితాలు వెలువడ్డాయి. 27,603 మంది విద్యార్థులు ఆరో సెమిస్టర్‌కు హాజరు కాగా 27,483 మంది ఉత్తీర్ణులైనట్లు ఏయూ డిగ్రీ కళాశాల ఎగ్జామినేషన్ డీన్ ఆచార్య డీవీఆర్ మూర్తి తెలిపారు. 99.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏయూ వెబ్ సైట్‌లో ఉన్నాయని వెల్లడించారు.
ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొయ్యూరు మండలంలోని బాలరేవుల గ్రామానికి చెందిన పిట్టల కామేశ్ ఉపాధి కోసం కత్తిపూడి ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కామేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్‌తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.
నౌపాడ- గుణుపూరు రైలు మార్గంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ నెల 27వ తేదీన విశాఖ నుంచి గుణుపూరు వెళ్లే స్పెషల్ (08522) రైలు, విశాఖ నుంచి పలాస బయలుదేరు MEMU (07470) రైలు, అదే విధంగా గుణుపూరు నుంచి విశాఖ వచ్చు స్పెషల్ (08521) రైలు, పలాస నుంచి విశాఖ వచ్చు MEMU (07471) రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సీలేరు కాంప్లెక్స్‌లోని జలవిద్యుత్ కేంద్రాలకు విద్యుత్ ఉత్పత్తి 2.286.14 మిలియన్ యూనిట్లుగా సెంట్రల్ విద్యుత్ అధారిటీ నిర్దేశించినట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. కాంప్లెక్స్ పరిధిలో పొల్లూరు(లోయర్ సీలేరు) 1084 మిలియన్ యూనిట్లు, డొంకరాయి 95.14 మిలియన్ యూనిట్లు నిర్దేశించారు. అలాగే ఎగువ సీలేరు 477 మిలియన్ యూనిట్లు, మాచ్ ఖండ్ 630 మిలియన్ యూనిట్లుగా లక్ష్యం నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నటేషన్ రంగస్వామిని తూర్పు నౌకదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ శనివారం కలిశారు. ఈ సమావేశంలో భారత నౌకాదళం సముద్ర కార్యకలాపాలు సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు , తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో అవుట్ రీచ్ కార్యకలాపాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ అధికారులు పాల్గొన్నారు.
అంపైర్లు, స్కోరర్లు, మ్యాచ్ అఫీషియల్స్‌కు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. పెంచిన వేతనాలు నేటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. జిల్లా, జోనల్ స్థాయి అంపైర్లకు రోజుకు రూ.1500 నుంచి రూ.2500, స్కోరర్లకు రూ.800 నుంచి రూ.1500 వేతనం పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా డైలీ అలవెన్సు కూడా పెంచామన్నారు.
Sorry, no posts matched your criteria.