India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ- గుణుపూర్ పాసింజర్ రైలును ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు రద్దు చేశారు. అదే విధంగా, గుణుపూరు నుంచి విశాఖకు వచ్చే పాసింజర్ ట్రైన్ ఈ నెల 24 నుంచి 27 వరకు రద్దు చేశారు. పలాస-విశాఖ, విశాఖ-పలాస మధ్య నడిచే పాసింజర్ ట్రైన్‌ను ఈ నెల 27న రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ ఏర్పాటయింది. జాయింట్ సీపీ, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుల్స్ దీనిలో ఉంటారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని కమిషనర్ ఆదేశించారు. కాగా ఆపరేషన్ కంబోడియా విజయవంతమైందని అధికారులు తెలిపారు. 360 మంది భారతీయులను ఎంబసీ ఆఫ్ ఇండియా కాపాడింది.
వైశాఖ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందన సమర్పణను వైభవంగా నిర్వహించారు. మొదటి విడత మే 10వ తేదీన 120 కిలోల చందనాన్ని స్వామికి సమర్పించగా, రెండో విడత గురువారం మరో 120 కిలోల చందనాన్ని స్వామికి సమర్పించారు. పలువురు భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై శిరీష బుధవారం తెలిపారు. విశాఖలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన కె.శివాజీ కుమార్ (60)తో పాటు మరో నలుగురు చినకాద శివారు రాజుల పేటలో జరుగుతున్న పండగకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వాష్ రూమ్‌కి వెళ్లిన కుమార్ ఎంతకీ రాలేదు. దీంతో పరిసర ప్రాంతాలు వెతకగా నేలబావిలో మృతదేహం లభించిందని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు వాల్తేరు డివిజన్ పరిధిలో పలు రైళ్లకు అత్యాధునిక LHB కోచ్‌లను జత చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. ఈనెల 24 నుంచి విశాఖ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, 25 నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్, 26 నుంచి విశాఖ పారాదీప్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కి ఈ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం సింహాచలం ఆలయంలో అప్పన్న బాబుకు రెండవ విడత చందనం సమర్పించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా అంతరాలయ దర్శనం రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూ.300 టికెట్ తీసుకుని భక్తులకు నీలాద్రి గుమ్ము వద్ద నుంచి లఘు దర్శనం ఉంటుందని ఆయన తెలిపారు. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. బైక్‌లను గణపతి సత్రం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతంలో నిలపాలన్నారు.
లక్కవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు. నక్కపల్లి మండలం దోసలపాడుకి చెందిన లక్ష్మణరావు మరో ముగ్గురుతో కలిసి బైక్‌లపై గాజువాక బయలుదేరారు. లక్కవరం సమీపంలో వెనుక వస్తున్న బైక్ లారీని తప్పించబోయి ముందున్న బైక్‌ని ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మణరావుకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం విశాఖ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించటానికి ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ ఈ సెంటర్ ఏర్పాటు చేసే భవనాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సంబంధిత ఏర్పాటు చేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి సూచించారు. కలెక్టర్ వెంట జేసీ మయూర్ అశోక్, తదితరులు ఉన్నారు.
వేతనాల విషయమై స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ అఖిలపక్ష కార్మిక నేతలతో బుధవారం చర్చించారు. ఈ నెల 21న 50% జీతాలు చెల్లించడంతో మిగిలిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అడ్మిన్ భవనాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సీఎండీ వారిని చర్చలకు ఆహ్వానించారు. ఈ నెల 23న మిగిలిన 50% వేతనాలు చెల్లిస్తామని సీఎండీ హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు.
ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టరేట్లో సమీక్షించారు. విశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక ఎంపీ నియోజకవర్గం ఓట్లను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కించడానికి అవసరమైన టేబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.