Visakhapatnam

News May 21, 2024

పెందుర్తి: 24న ఎంఎస్ఎంఈ వర్క్‌షాప్

image

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 24న ఎంఎస్ఎంఈ మేక్‌ఇన్ ఇండియా సపోర్ట్ స్టార్టప్ అండ్ అగ్రిటెక్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డాక్టర్ దాసరి దేవ రాజ్, డీజీఎస్ సంతోష్ కుమార్‌లు ఈ విషయం తెలిపారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం టీటీడీసీలో వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపారు.

News May 21, 2024

విశాఖ: సామాన్యులకు అందని మామిడి పండ్లు

image

మామిడి పండ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విశాఖ నగరంలో కిలో మామిడి పండ్లను రూ.150- రూ.200కు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు వాటి దగ్గరికి వెళ్లడానికి భయపడుతున్నారు.

News May 21, 2024

విశాఖ: డిసెంబర్ 15న నేవీ మారథాన్

image

భారత నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో ఈ ఏడాది డిసెంబర్ 15న నేవీ మారథాన్ నిర్వహించనున్నట్లు సోమవారం నేవీ అధికారులు తెలిపారు. ఆ రోజు 42.2 కి.మీ.తో మారథాన్, 21.1 కి.మీ.తో హాఫ్ మారథాన్, 10 కి.మీ.తో ఆరోగ్య పరుగు, 5 కి.మీ.తో రన్ ఫర్ ఫన్ ఉంటుందని పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని, ఆసక్తి కలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

News May 21, 2024

విశాఖ జిల్లాలో 38,933 మంది హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు

image

విశాఖ జిల్లాలో 38, 933 మంది హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టుగా గుర్తించామని వీరిలో 18, 541 మంది ఏఆర్టి మందులు ఉపయోగిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 20 సంవత్సరాల్లో జిల్లాలో 11, 566 మంది మరణించారని జిల్లావ్యాప్తంగా 7 ఈఆర్టి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం మే నెలలో 3 వ ఆదివారాన్ని అంతర్జాతీయ ఎయిడ్స్ స్మృత్యంజలి దినముగా జరుపుతుంటారు.

News May 21, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు. మచిలీపట్నం – విశాఖ రైలు ఏప్రిల్ 27 నుంచి మే 22 వరకు, విశాఖ – మచిలీపట్నం రైలును ఈనెల 28 నుంచి వచ్చే నెల 23 వరకు, గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ 27 నుంచి వచ్చే నెల 22 వరకు.. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈనెల 28 నుంచి వచ్చే నెల 23 వరకు రద్దు చేశారు.

News May 20, 2024

అనకాపల్లి: ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన డీఐజీ

image

విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ అనకాపల్లి కలెక్టరేట్ సమీపంలో ఫ్యూచర్ వరల్డ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ను ఎస్పీ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు అంచెల భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌‌ల వద్ద భద్రత సిబ్బంది నిరంతరం ఉండాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు.

News May 20, 2024

జర్మనీ అథ్లెటిక్స్‌లో మెరిసిన విశాఖ అమ్మాయి

image

జర్మనీలో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌లో విశాఖపట్నం అమ్మాయి జ్యోతి యర్రాజి సత్తాచాటింది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌లో పసిడి సాధించింది. కేవలం13.06 సెకన్లలో రేసును ముగించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. గతేడాది కూడా జ్యోతినే విజేతగా నిలిచింది. దీంతో విశాఖ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News May 20, 2024

విశాఖలో సందడి చేసిన ‘బిగ్ బ్రదర్’ చిత్ర యూనిట్

image

బిగ్ బ్రదర్ చిత్ర యూనిట్ సోమవారం విశాఖ నగరంలో సందడి చేసింది. ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం భారీ విజయ సాధించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు మురళీమోహన్ ఆకాంక్షించారు. జి. సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News May 20, 2024

విశాఖ: మంచం పైనుంచి పడి మృతి

image

నిద్రలో ఉండగా మంచం పైనుంచి కిందపడిన ఘటనలో గిరిజనుడు మృతి చెందాడు. చింతపల్లి మండలం బౌడ గ్రామానికి చెందిన వి.శ్రీను ఆదివారం రాత్రి తన ఇంట్లోనే నిద్రిస్తుండగా మంచం నుంచి కిందపడి తలకు తీవ్ర గాయం అయింది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో అతన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 20, 2024

విశాఖలో కొండెక్కిన చికెన్ ధర

image

వేసవికాలం కావడంతో కోళ్ల పెంపకం తగ్గింది, దీంతో బ్రాయిలర్ కోళ్ల లభ్యత తగ్గడంతో విశాఖలో ధరలు పెరిగాయి. గడచిన రెండు నెలల్లో చికెన్ ధర రూ.230 నుంచి రూ.260 వరకు ఉండేది. సోమవారం దీని ధర రూ.296కు పెరిగింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 20 రోజుల్లో కిలోపై రూ.40 వరకు పెరిగింది. గుడ్లు ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చి నెలలో 100 గుడ్ల ధర రూ.425 ఉండగా నేడు రూ.550గా ఉంది.