Visakhapatnam

News May 20, 2024

చట్టపరంగా ఎటువంటి తప్పు చేయలేదు: విష్ణుకుమార్ రాజు

image

చట్టపరంగా, న్యాయపరంగా తాను ఎటువంటి తప్పు చేయలేదని విశాఖ నార్త్ BJP MLA అభ్యర్థి <<13279687>>విష్ణుకుమార్ రాజు<<>> అన్నారు. నగరంలోని బర్మా కాలనీలో రెండు కుటుంబాల మధ్య దాడికి సంబంధించి కేసును తప్పుదోవ పట్టించారని పోలీసులు ఆయనకు 41-ఏ నోటీసులు అందజేశారు. దీనిపై ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ బెయిలు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

News May 20, 2024

విశాఖ: పోలింగ్‌లో రాష్ట్రంలోనే కొత్త రికార్డు

image

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మొత్తం 14 వార్డులు ఉన్నాయి. 90వ వార్డులోని 213 బూత్‌లో అత్యల్పంగా 7.74% పోలింగ్ నమోదు కాగా(620 మంది ఓటర్లుండగా కేవలం 48మంది ఓటేశారు).. 56వ వార్డులో 180 బూత్‌లో అత్యధికంగా 84.43% పోలింగ్ నమోదయింది. ఈ నియోజకవర్గంలో 69.78 శాతం పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోలిస్తే 11.59% అధికంగా పోలింగ్ జరిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒక కొత్త రికార్డు.

News May 20, 2024

భారీ మెజారిటీతో గెలుస్తా: గంటా

image

జగన్ దుర్మార్గపు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. సిరిపురం వాల్తేరు క్లబ్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి శ్రేణులు తన విజయం కోసం శ్రమించారని పేర్కొన్నారు.

News May 20, 2024

సింహాచలంలో 22న నృసింహ జయంతి

image

సింహాచలం శ్రీవరహలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఈనెల 22వ తేదీన స్వామి వారి నృసింహ జయంతితో పాటు స్వామి జన్మ నక్షత్రం ఒకే రోజున వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆ రోజున స్వామివారి నృసింహ జయంతి, స్వాతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.హోమంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని భక్తులకు ఆన్లైన్ లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

News May 20, 2024

లంబసింగి, చెరువులవేనంలో అద్భుత అందాలు

image

లంబసింగికి సమీపంలోని చెరువులవేనంలో మండు వేసవిలోనూ మంచు అందాలు సందర్శకులను అలరిస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో పది రోజులుగా తొలకరి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వారం రోజులుగా చెరువులవేనం, లంబసింగిలో మంచు అందాలు ఆవిష్కృతమవుతున్నాయి. దీంతో పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులు చెరువులవేనం చేరుకుని శ్వేత వర్ణంలో దట్టంగా పరుచుకున్న మంచు మేఘాలను వీక్షిస్తూ పరవశం చెందుతున్నారు.

News May 20, 2024

సింహాచలం: నేడు కూడా కొనసాగనున్న చందనం అరగదీత

image

సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో చందనం అరగదీత కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఈనెల 23న స్వామికి రెండవ విడత 120 కిలోల చందనాన్ని సమర్పించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 18న 40 కిలోలు, 19వ తేదీన37 కిలోల చందనాన్ని అరగదీసారు. సోమవారం కూడా చందనం అరగదీత కొనసాగుతుంది. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ ఏఈఓ ఆనంద్ కుమార్ చందనం అరగదీత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

News May 20, 2024

విశాఖ యువతి మోసం.. ఫినాయిల్ తాగిన యువకుడు

image

ప్రేమ పేరుతో డబ్బులు దండుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువతిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిమ్మాపూర్‌కు చెందిన నాగరాజు యోగా నేర్చుకునేందుకు ఈశా ఫౌండేషన్‌లో చేరాడు. అక్కడ వైజాగ్‌కు చెందిన సంధ్య ప్రియాంకతో ఏర్పడ్డ పరిచయం, ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువతి రూ.16లక్షలు తన బంధువుల ఖాతాలోకి వేయించింది. మోసాన్ని తట్టుకోలేక ఫినాయిల్ తాగిన యవకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

News May 20, 2024

అనకాపల్లి: సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ

image

వచ్చే నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ర్యాలీలు, ఊరేగింపులు పండగల్లో స్టేజ్ ప్రోగ్రాములకు అనుమతులు లేవన్నారు. పెట్రోల్ బంకులలో లూజ్ పెట్రోల్ అమ్మకాలు అనుమతించకూడదన్నారు.

News May 19, 2024

వెంకన్నపాలెంలో యువకుడి మృతదేహం లభ్యం

image

చోడవరం మండలం వెంకన్నపాలెం సమీపంలో ఆదివారం సాయంత్రం యువకుడి మృతదేహం లభ్యమయింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాదికి చెందిన గనిశెట్టి నానాజీగా కుటుంబ సభ్యులు గుర్తించారు. నానాజీ ఈనెల 14న మిస్ అయినట్లు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా ఉరి వేసుకుని మృతదేహంగా లభ్యమవడం కుటుంబ సభ్యులను విషాదంలో నింపింది. చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 19, 2024

పాడేరులో వెల్లువిరిసిన ఇంద్రధనస్సు

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఇంద్రధనస్సు వెల్లువిరిచినట్లు ఆకట్టుకుంది. ఆదివారం ఉదయం నుంచి పాడేరులో వర్షం కురిసింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారి ఓ పక్కన ఎండ మరో పక్కన పచ్చని కొండల మధ్య ఇంద్రధనస్సు మెరిసి చూసే వాళ్లకు కనువిందు చేసింది.