Visakhapatnam

News May 19, 2024

కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారు: కొణతాల

image

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, కూటమి జనసేన అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జనసేన నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ సరళిపై ఆరా తీశారు. జిల్లాలో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులందరూ భారీ మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అడపా నర్సింహ మూర్తి పాల్గొన్నారు.

News May 19, 2024

విశాఖ: ఒక్క నెలలో రూ.76 లక్షల ఆదాయం..!

image

రావికమతం మండలం కళ్యాణపులోవలో 4 గ్రామాలకు చెందిన ఆదివాసీలు ప్రభుత్వంపై ఆధారపడకుండా సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి లక్షల రూపాయలు సంపాదించారు. 94 కుటుంబీకులు 110 ఎకరాల్లో జీడిమామిడి పంట ద్వారా ఈ ఏడాది ఒక్క నెలలోనే రూ.76,46,960లు సంపాదించుకున్నారు. ఆదివాసీల నాయకులు వీరిని చైతన్యవంతుల్ని చేసి వారి స్వశక్తి పైనే వ్యవసాయం చేసుకునేలా సహాయపడ్డారు.

News May 19, 2024

విశాఖ: 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఈనెల 24 నుంచి జరగనున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ఐఓ మురళీధర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు ఉన్న 172 జూనియర్ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులకు 31,152 మంది ఒకేషనల్ కోర్సులకు 636 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సులకు 7,774 మంది ఒకేషనల్ కోర్సులకు 455 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

News May 19, 2024

అనకాపల్లి: వివాహిత ఆత్మహత్య

image

అత్తింటి వేధింపులు తాళలేక ఉరి వేసుకుని వివాహిత మృతి చెందిన సంఘటన బుచ్చయ్యపేట మండలం ఎల్బిపి అగ్రహారంలో చోటుచేసుకుంది. ఎస్ఐ డి.ఈశ్వరరావు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కిల్లి శ్రావణికి తమరాన రేణుకృష్ణతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. రేణుకృష్ణ ఆర్మీలో దిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రావణి అత్తింట్లోనే ఉంటుంది. అత్తింటి వేధింపులతో శ్రావణి మనస్థాపానికి గురై ఉరి వేసుకుంది.

News May 19, 2024

విశాఖ: చంద్రబాబును కలిసిన అనిత

image

సార్వత్రిక ఎన్నికలు అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు పాయకరావుపేట పార్టీ అభ్యర్థి వంగలపూడి అనిత శనివారం హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పోలైన ఓట్లు గురించి వివరించారు. పోలింగ్ సరళిని బట్టి విజయం సాధిస్తానని ఆమె చంద్రబాబుకు వివరించారు. ఎన్నికల అనంతరం పరిస్థితులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

News May 19, 2024

సింహాచలం: నేటి నుంచి రాత్రి 7 గంటల వరకే దర్శనాలు

image

సింహాచలం అప్పన్న ఆలయంలో ఆదివారం నుంచి నమ్మాళ్వార్ తిరునక్షత్రం పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని అన్నారు.ఈనెల 22న నృసింహ జయంతిని పురస్కరించుకొని సాయంత్రం ఐదు గంటల తర్వాత దర్శనాలు నిలిపివేస్తామన్నారు. తిరిగి 23 ఉదయం 7 గంటల తర్వాత దర్శనాలు లభిస్తాయన్నారు.

News May 19, 2024

గ్రూప్-2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

image

ఎంవీపీ కాలనీలోని సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్-2 మెయిన్స్ ఉచిత శిక్షణ అందించనున్నారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 60 మందిని ఎంపిక చేసి నెలరోజులు శిక్షణ అందిస్తరు.

News May 19, 2024

విశాఖ: ఫెడెక్స్ కొరియర్ మోసంపై 12 కేసులు నమోదు

image

సైబర్ మోసగాళ్లు ఫెడెక్స్ కొరియర్ పేరు మీద పలు మోసాలకు పాల్పడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ నగరంలో 12 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో బాధితులు రూ.5.93 కోట్ల మేర నష్టపోయినట్లు తెలిపారు. బాధితులు సకాలంలో స్పందించి 1930 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో రూ.1.04కోట్ల నగదును వేరే ఖాతాలకు మళ్లించకుండా అడ్డుకున్నామన్నారు.

News May 19, 2024

విశాఖ: తాగునీటికి అంతరాయం.. జీవీఎంసీ కమిషనర్

image

జీవీఎంసీ పరిధిలోని జోన్ -2 మే నెల 20న తాగునీటి సరఫరాకి అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు మెరుగైన తాగనీటి సరఫరా చేసే పనిలో భాగంగా, బోణి గ్రామం వద్ద ఉన్న కోస్తానని హేట్ వాటర్ వర్క్స్ నుంచి తగరపువలస వరకు నూతనంగా 400 మీ.మీ మందం గల పైప్ లైన్లను వేస్తున్నట్లు వివరించారు. నగర వాశుల సహకరించాలని కోరారు.

News May 18, 2024

అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం: గోపీనాథ్ రెడ్డి

image

ఆంధ్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీ‌ఎల్ సీజన్‌పై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 30 నుంచి జూలై 13 వరకు ఈ సీజన్ కొనసాగుతుందని వివరించారు. మొత్తం 19 మ్యాచులు జరగనున్నట్లు వివరించారు. కడపలో 7, విశాఖలో 12 మ్యాచులు నిర్వహిస్తామన్నారు.