India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పర్యాటక కేంద్రమైన అరకులోయలోని సందర్శింత ప్రాంతాలు పర్యాటకులు లేక వెలవెల బోతున్నాయి. ప్రతి ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షల అనంతరం పర్యాటకులు అధిక సంఖ్యలో అరకు ప్రాంతాన్ని సందర్శించేవారు. ఈ ఏడాది ఎన్నికల హడావుడి మొదలు కావడంతో పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. పర్యాటకులు మచ్చుకైనా కనిపించక పోవడంతో ఈ ప్రాంతంలోని సందర్శిత ప్రాంతాలన్నీ వెలవెలపోయాయి. దీంతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
గాజువాకకు చెందిన మూడున్నరేళ్ల సమ్మంగి వెంకట వేదాన్షిక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించింది. ‘రోప్ నిచ్చెనను అధిరోహించడానికి, దిగడానికి అత్యంత వేగవంతమైన చిన్నారి’ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని వరల్డ్ బుక్ రికార్డ్స్ నిర్ధారించింది. వేదాన్షిక స్థానిక ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీ ప్రైమరీ క్లాస్ చదువుతోంది. ఈ సందర్భంగా వేదాన్షికను పాఠశాల అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.
విశాఖ జూకి ఒకటి రెండు నెలల్లో కొత్త వన్యప్రాణులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు జూ క్యూరేటర్ నందిని సలారియ తెలిపారు. బెంగళూరు జూ నుంచి మీరు కాట్, రెడ్ నెట్ వాలబీ, స్వైరల్ మంకీస్, మర్మోసెట్స్,గ్రీన్ వింగ్డ్ మకావ్ తదితర జాతులను తీసుకురానున్నట్లు తెలిపారు. జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టోర్టోయిస్ లను తీసుకురావడానికి సిజెడ్ఏ అనుమతులు లభించినట్లు పేర్కొన్నారు.
విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2019లో పోల్చి చూస్తే 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. అయితే 5,56,819 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు. విశాఖ పార్లమెంట్ పరిధిలో మొత్తం 19,27,303 మంది ఓటర్లు ఉండగా 13,70,484 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా విశాఖ ఎంపీ స్థానంలో 71.11 శాతం మాత్రమే ఓటు వేశారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. విజయవాడ నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా. ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈవీఎంలు భద్రపరచడం, ఎలక్షన్ కౌంటింగ్ తదితర అంశాలపై చర్చించారు.
స్టీల్ ప్లాంట్‌లో జరిగిన స్వల్ప ప్రమాదంలో కార్మికునికి గాయాలయ్యాయి. గంట్యాడ మండలానికి చెందిన జె.సాంబయ్య(55) కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నారు. కోక్ ఒవెన్ వద్ద అదుపుతప్పి స్టీమ్ వాటర్‌లో పడపోయాడు. దీంతో శరీరంపై గాయాలయ్యాయి. వెంటనే రామ్‌నగర్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు తెలిపారు.
బెంగళూరు ఖరగ్పూర్ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే సందీప్ తెలిపారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ప్రత్యేక రైలు నడుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరులో బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఖరగ్పూర్ నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి తర్వాత రోజు 2:38 కి దువ్వాడ చేరుకుంటుందని తెలిపారు.
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భువనేశ్వర్ నుంచి సోలాపూర్‌కు ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు ఈనెల 20 తేదీ ఉదయం 4:30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుందన్నారు. విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌కు అదేరోజు రోజు ఉదయం 11.43 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 11:45 గంటలకు బయలుదేరి సోలాపూర్ చేరుకుంటుందని తెలిపారు.
రాష్ట్రంలో మళ్లీ YCP అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితుల్లో నెలకొన్నాయని అన్నారు. అధికారులను మార్పుచేసిన ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయన్నారు. రాష్ట్రంలో 175 సీట్లకు దగ్గరగా గెలుపొందుతామని, అనవసరంగా YCP నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 9, 10, 11 తేదీల్లో పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి నిర్ణయించారు. ఈనెల 19, 20, 21 తేదీల్లో మోదకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి ముందుగా నిర్ణయించి, ఏర్పాట్లు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండటంతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధికారులు అనుమతులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాలను జూన్ నెలకు మార్చారు.
Sorry, no posts matched your criteria.