Visakhapatnam

News May 17, 2024

చల్లబడ్డ అల్లూరి మన్యం

image

నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం మన్య ప్రాంతం చల్లబడింది. ఉదయం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. ఏజెన్సీలో గురువారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అనంతగిరిలో 27.2, అరకులో 27.2, చింతపల్లిలో 29.2, డుంబ్రిగుడలో 28.1, గూడెం కొత్తవీధిలో 31.9, జీ.మాడుగులలో 31.2, హుకుంపేటలో 30.0, కొయ్యూరులో 31.3, ముంచంగిపుట్టులో 29.3, పాడేరులో 30.0, పెదబయలులో 28.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 17, 2024

విశాఖ: స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా రూ.2.8 కోట్ల ఆదాయం

image

వాల్తేరు రైల్వే డివిజన్ కమర్షియల్ విభాగం సిబ్బంది ఏప్రిల్ నెలలో అత్యుత్తమ పనితీరు కనబరిచి రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చారు. 47,837 స్పెషల్ డ్రైవ్ ద్వారా గత రికార్డులన్నింటినీ అధిగమించి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఒక్క నెలలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన డివిజన్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరబ్ ప్రసాద్ డివిజన్ కమర్షియల్ సిబ్బందిని అభినందించారు.

News May 17, 2024

అల్లూరి: కొంకోడి కూరకు మంచి గిరాకీ

image

అడవుల్లో లభ్యమయ్యే కొంకోడి కూరకు ప్రస్తుతం మంచి గిరాకీ ఏర్పడింది. తొలకరి జల్లులకు అడవుల్లో బండరాళ్ల సందుల్లో ఈ కూర మొలకలు వస్తాయి. ఇది లేత చిగురు ఉన్న సమయంలో మాత్రమే గిరిజనులు సేకరించి వండుకుంటారు. సహజసిద్ధంగా లభ్యమయ్యే కొంకోడి కూర అరుదుగా దొరుకుతుంది. దీంతో గిరిజనులు సంతలు, వివిధ వ్యాపార సముదాయాల్లో అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి జిల్లాలో వాటాను రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు.

News May 17, 2024

ఊపిరి పీల్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ కొంతమేరకు ఊపిరి పీల్చుకుంది. గంగవరం పోర్ట్ లో కార్మికుల ఉద్యోగ బాట పట్టడంతో దిగుమతి చేసుకున్న బొగ్గు స్టీల్ ప్లాంట్ కు తరలించడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం పోర్ట్ అధికారులకు, కార్మికులకు మధ్య వన్ టైం సెటిల్మెంట్ జరిగింది. శుక్రవారం నుంచి ఉత్పత్తి దిశగా విశాఖ ఉక్కు సాగనుంది. మరోపక్క గంగవరం పోర్ట్ కార్మికులు గురువారం విధుల్లోకి చేరారు. ఉద్యమ బాట వీడారు.

News May 17, 2024

గుడివాడ కలలు కంటున్నారు: బీజేపీ

image

ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని కోల్పోతామని తెలుసుకున్న వైసీపీ నేత అమర్నాథ్ అసహనంతో ఉన్నట్లు బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీందర్ అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ దాటలేమని, మా అవసరం వస్తుందని మంత్రి కలలు కంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు విడతల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటిన విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు.

News May 17, 2024

విశాఖ: రోజుకు మూడుసార్లు పరిశీలన

image

ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమును రోజుకు మూడుసార్లు పరిశీలించే విధంగా అధికారులు అనుమతిస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థులకు వారి ఏజెంట్లు గానీ ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, రాత్రి 10 గంటల సమయంలో పోలీస్ సిబ్బంది, అధికారుల సమక్షంలో పరిశీలించే అవకాశం కల్పిస్తున్నారు. కానీ వీరు రూముకు వేసిన సీలును తాకడం, సంతకం చేసిన వాటిని తాకడం వంటివి చేయకూడదు.

News May 17, 2024

విశాఖ: ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం-2024 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ కేంద్రం సంచాలకులు జి.ధర్మారావు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. కేంద్రం పరిధిలోని 11 జిల్లాల విద్యార్థులు జూన్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు ఇగ్నో కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News May 17, 2024

రవాణాలో విశాఖ పోర్ట్ సరికొత్త రికార్డు

image

సరుకు రవాణాలో విశాఖ పోర్ట్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 45 రోజుల్లో 10 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా గత ఏడాది రికార్డును అధికమించిందని పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. గత ఏడాది 2023-24లో 47 రోజుల్లో 10 మిలియన్ల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు తెలిపారు. అదే ఇంతవరకు రికార్డుగా ఉండేదని, ఆ రికార్డును తిరిగి రాసిందని అన్నారు.

News May 17, 2024

పోలీసుల కృషితో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు: విశాఖ రేంజ్ డీఐజీ

image

పోలీసు అధికారులు, సిబ్బంది కృషితో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని అన్నారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల ఎస్పీలతో ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 17, 2024

విశాఖ: ‘కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి’

image

జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు, ఇతర అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున సూచించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశం నిర్వహించారు. పోలింగ్ అనంతరం ఆయా స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎంల తరలింపు, ఇతర సాంకేతిక ప్రక్రియల పూర్తి, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సమర్థవంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు.