India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూ.21 కోట్లు విడుదలయ్యాయి. 2019లో జరిగిన ఉమ్మడి విశాఖ ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, అనకాపల్లి, విశాఖ, అరకు పార్లమెంట్ స్థానాల ఉండటంతో ఎన్నికల నిర్వహణకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత విశాఖ పరిధి తగ్గింది. దీంతో విశాఖలో ఎన్నికల నిర్వహణకు నిధులు విడుదల కూడా తగ్గింది.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగిసింది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సి ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు డ్రై పీరియడ్‌గా పరిగణిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. ఈ సమయంలో అభ్యర్థులు ఎటువంటి ప్రచారాలు నిర్వహించకూడదని, మద్యం దుకాణాల సైతం మూసివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల జరగడానికి ముందు చివర 48 గంటల సమయాన్ని డ్రై పీరియడ్‌గా వ్యవహరిస్తామని తెలిపారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం దుకాణాలను మూసివేయాలన్న నిబంధన ఉంది. శనివారం సాయంత్రం తర్వాత మద్యం దుకాణాలకు సీల్ వేసి మూసి వేస్తారు. రెండు రోజుల తర్వాత వీటిని తిరిగి తెరుస్తారు. దీంతో మద్యం దుకాణాల ముందు మందు బాబులు క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి మందుబాబులు భారీగా మద్యం కొనుగోలు చేసి భద్రపరుచుకున్నారు.
విశాఖ జిల్లాలో మొత్తం 1,991 పోలింగ్ కేంద్రాలున్నాయి. విశాఖ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,962గా ఉంది. అయితే ఈ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఉంది. ఆ నియోజకవర్గ ఓటర్లు విశాఖ ఎంపీకి తమ ఓటు వేస్తారు. పెందుర్తి నియోజకవర్గంలోని కొంత భాగం విశాఖ జిల్లాలో ఉండగా.. ఆ నియోజకవర్గ ఓటర్లు అనకాపల్లి ఎంపీ స్థానానికి తమ ఓటును వినియోగించాల్సి ఉంటుంది.
మరో 48 గంటల్లో ఈవీఎంలపై బటన్ నొక్కేందుకు ఓటరు సిద్ధమవుతుండగా..వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి రూ.1000 నుంచి 1500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారికి ఆన్‌లైన్ పేమెంట్ చెయ్యగా.. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారు. పట్టణాల్లో టోకెన్ సిస్టం పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తుండంతో అధికారులు నిఘా పెంచారు.
ఎన్నికల విధుల్లో పాల్గొని ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందిస్తారు. దీనికి చాలా తక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు విశాఖలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో అనూహ్య స్పందన లభించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో 6,651 మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోగా 2024లో జరుగుతున్న ఎన్నికలకు ఏకంగా 15,993 మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా నేటి సాయంత్రం 6 గంటలకు తమ ప్రచారాన్ని ముగించాలి. ఓటింగ్ జరగడానికి 48 గంటలు ముందుగా అభ్యర్థులు తమ ప్రచారాలను ముగించాలి. దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థులు ఎటువంటి ప్రచారాలు సభలు నిర్వహించకూడదు. రేపు, ఎల్లుండి పత్రికల్లో ఇచ్చే ప్రకటనలపై కూడా ఎన్నికల సంఘం అనుమతితో మాత్రమే ప్రచురించాల్సిన అవసరం ఉందని జిల్లా అధికారులు సూచించారు.
చందనోత్సవం సందర్భంగా సింహాచలం వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం రాత్రి వైభవంగా సహస్త్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర నుంచి పవిత్ర జనాలు తీసుకువచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. సుమారు 500 మంది రుత్వికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ కేవీ మురళీకృష్ణలతో కలిసి పోలీసు అధికారులతో శాంతిభద్రతల నిర్వహణపై చేపడుతున్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి డిఎస్పీ స్థాయి అధికారిని నియమించామన్నారు.
Sorry, no posts matched your criteria.