India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓటర్లకు డబ్బులు పంచుతున్న నలుగురిని గురువారం మహారాణిపేట పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దండు బజారులో ఓ వ్యక్తి నుంచి రూ.50,000. సాలిపేటలో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.1,08,168లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విశాఖలో నిర్వహించిన ప్రజాగళం పాదయాత్రలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు గురువారం రాత్రి విశాఖ పార్టీ కార్యాలయం వద్ద బస్సులో బస చేశారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు పార్టీ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి తెలిపారు. ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానించామన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ డిసిఎం సందీప్ తెలిపారు. విశాఖ-చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ప్రతి సోమవారం విశాఖలో బయలుదేరి మరుసటి రోజు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుందన్నారు. ఈనెల13 నుంచి 24 వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం చెన్నై ఎగ్మోర్ లో బయలుదేరి విశాఖ చేరుకుంటుందన్నారు.
విశాఖ జిల్లాలో దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 16,821 మందికి పైగా దివ్యాంగ ఓటర్లు ఉంటే వీరిలో 547 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. మిగిలిన 16,274 మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వేయనున్నారు. వీరి కోసం 100 వీల్ ఛైర్లు సిద్ధం చేశారు. వీరిలో 8వేల మంది అంధులు ఉన్నారు. వీరి కోసం బ్యాలెట్ పేపర్లు బ్రెయిలీ లిపిలో సిద్ధం చేస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియపై నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి వచ్చిన తొమ్మిది మంది ట్రైనీ ఐపీఎస్‌లకు అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ఈనెల 13వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకుంటారని ఎస్పీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బందోబస్తు, భద్రత ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి తదితర అంశాలను పరిశీలిస్తారన్నారు.
ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. విశాఖ నగరం ద్వారక నగర్‌లో నిర్వహించిన సభలో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్, తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు, గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాస్, పశ్చిమ అభ్యర్థి గణబాబును పరిచయం చేశారు.
ఏఐసీసీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ నగరంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. శుక్రవారం ఆయన పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు విశాఖ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
చందనోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. వివిధ జిల్లాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. గురువారం సాయంత్రానికి భక్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ తెల్లవార్లు ఇక్కడే ఉండి ఉదయం అప్పన్న నిజరూప దర్శనం చేసుకుని తిరిగి వెళతారు.
సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి (నిజరూప దర్శనం) ఏర్పాట్లు పూర్తి చేశారు. సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని దర్శించుకునేందుకు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీనికి తగ్గట్టుగా క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు మజ్జిగ, తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
దేశ తలరాతను మార్చే ఓటు విలువను తెలియజేస్తూ కంచరపాలెంకు చెందిన ఓ సెలూన్ షాపు వినూత్న కార్యక్రమం చేపట్టింది. కంచరపాలెంకు చెందిన ఓ షాపు యజమాని ఓటేసే వారకి ఉచితంగా హెయిర్ కట్ చేస్తామని ప్రకటించారు. ఓటుకు ఉన్న ప్రాముఖ్యత తెలియచేయాలనే ఉద్దేశంతో తన బృందంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
Sorry, no posts matched your criteria.