Visakhapatnam

News May 8, 2024

పాలీసెట్‌లో విశాఖ విద్యార్థినికి 120/120

image

పాలీసెట్‌లో కొమ్మాది విద్యార్థిని పోతుల జ్ఞాన హర్షిత అద్భుత ప్రతిభ కనబరిచింది. బుధవారం పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హర్షిత 120 మార్కులకు గాను 120 మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ సాధించింది. చీడికాడ మండలం తూరువోలుకు చెందిన హర్షిత తండ్రి అప్పలనాయుడు టీచర్, తల్లి నీటిపారుదల శాఖలో అకౌంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు హర్షిత‌ను అభినందించారు.

News May 8, 2024

వ్యక్తిత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్: నందమూరి లక్ష్మీపార్వతి

image

వ్యక్తిత్వం, సొంత ఆలోచన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లోకేశ్ ఒకటో తరగతి కూడా చదువుకోలేదు అని, చంద్రబాబు మేనేజ్ చేసి సర్టిఫికెట్లు తెప్పించారన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ ఒక క్యాన్సర్ గడ్డగా మారి చంద్రబాబుకు అమ్ముడుపోయారని, కులం ముసుగులో మేధావిగా చెప్పుకుంటూ పేదల పథకాలు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.

News May 8, 2024

విశాఖ: అత్యధిక, అత్యల్ప మెజార్టీలు టీడీపీ ఖాతాలోనే

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని 1983లో విశాఖ-2 నియోజకవర్గ TDP అభ్యర్థిగా పోటీ చేసిన ఈ.వాసుదేవరావు తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పల్లా సింహాచలంపై 47,916 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత 47,883 ఓట్ల భారీ మెజారిటీని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు 2019లో గెలిచారు. 1985లో పాడేరు నుంచి TDP అభ్యర్థిగా పోటీ చేసిన కొట్టగుళ్లి చిట్టినాయుడు 113 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

News May 8, 2024

REWIND: విశాఖ ఎంపీ స్థానం ఏకగ్రీవం

image

విశాఖ ఎంపీ స్థానానికి 1952 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా.. 1960లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1991లో TDP అభ్యర్థి ఎంవీవీఎస్ మూర్తి 5,138 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యల్ప మెజార్టీ. 1984లో TDP అభ్యర్థి బాట్టం శ్రీరామమూర్తి.. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి అప్పలస్వామిపై 1,40,431 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.

News May 8, 2024

రేపు విశాఖలో చంద్రబాబు రోడ్ షో

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం విశాఖ రానున్నారు. ఆరోజు ఉత్తర దక్షిణ నియోజకవర్గాల్లో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన ఖరారు అయిందని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి తెలిపారు. 9వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జగదంబ జంక్షన్ నుంచి రోడ్ షో ప్రారంభం అవుతుందన్నారు.

News May 8, 2024

అప్పన్న పరోక్ష సేవకు ఆన్ లైన్‌లో టికెట్లు

image

చందనోత్సవం రోజున అప్పన్నస్వామి నిజరూపం ఎదుట పరోక్ష సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. రూ.1116 చెల్లించి టికెట్లు పొందిన భక్తుల గోత్రనామాలతో స్వామి సన్నిధిలో అష్టోత్తర శతనామార్చన చేస్తామన్నారు. టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు పోస్టు ద్వారా స్వామివారి నిర్మాల్య చందన పొట్లం ప్రసాదంగా పంపిస్తామని తెలిపారు. ఏపీ టెంపుల్స్ వెబ్సైట్‌లో టికెట్లు భక్తులు పొందవచ్చు.

News May 8, 2024

విశాఖ: ఆధునీకరణ కారణంగా పలు రైళ్లు రీషెడ్యూల్

image

ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 7వ తేదీ రాత్రి 7 గంటలకు చెన్నైలో బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్-హావ్ డా మెయిల్ ఎక్స్ప్రెస్ రాత్రి 8.30 గంటలకు బయలుదేరిందన్నారు. సా. 4:30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరాల్సిన సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్ప్రెస్ 5:50 గంటలకు బయలుదేరినట్లు మార్పులు చేసినట్లు తెలిపారు.

News May 8, 2024

సింహాచలం: నేడు కూడా అందుబాటులో చందనోత్సవ టికెట్లు

image

సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఈనెల పదవ తేదీన జరిగే చందనోత్సవానికి సంబంధించి రూ. 300 టిక్కెట్ల విక్రయాలు బుధవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆన్ లైన్‌తో పాటు సింహాచలం నగరంలోని మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లలో సింహాచలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో టిక్కెట్లు పొందవచ్చునని అన్నారు.

News May 8, 2024

సింగపూర్‌కి చేరిన భారత నేవీ నౌకలు

image

భారత నౌకాదళానికి చెందిన ఢిల్లీ శక్తి కిల్తాన్ నౌకలు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఫ్లీట్ నేతృత్వంలో సింగపూర్‌కి చేరుకున్నాయి. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ సిబ్బంది అక్కడే భారత హై కమిషనర్ స్వాగతం పలికారు. ఈ పర్యటన దక్షిణ చైనా సముద్రంలో భారత నావికాదళం, తూర్పు నావికాదళం కార్యాచరణ విస్తరణలో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య స్నేహ సహకారం మరింత పెరుగుతుందన్నారు.

News May 8, 2024

విశాఖ: మూడు రోజుల్లో 95.9% పోలింగ్

image

విశాఖ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ రికార్డు సృష్టిస్తోంది. జిల్లాకు చెందిన 13,076 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 12,541 మంది హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 95.9 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతర జిల్లాలకు సంబంధించి 5,389 మంది దరఖాస్తు చేయగా 4,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో వీరి శాతం 77.78గా నమోదయింది.