Visakhapatnam

News March 20, 2026

విశాఖ: ‘సోషల్ మీడియాలో జాబ్స్ ప్రకటనలు నమ్మవద్దు’

image

హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన కేంద్రం పేరుతో నర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులపై సోషల్ మీడియాలో నకిలీ నియామక ప్రకటనలు వెలుగు చూశాయి. పోస్టుల సంఖ్య, జీతం, అర్హతలు, చివరి తేదీ వివరాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆసుపత్రి నుంచి విడుదల కాలేదని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే సమాచారం ధ్రువీకరించుకోవాలని సూచించారు.

News March 20, 2026

23న విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటనకు తగ్గట్టు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 20, 2026

విశాఖ: 26న పనికిరాని పాత 104 వాహనాల వేలం

image

విశాఖ జిల్లాకు సంబంధించిన పనిచేయని 104 సేవల పనికిరాని పాత వాహనాలను ఈ-వేలం వేయనున్నట్టు DMHO జగదీశ్వర రావు శుక్రవారం తెలిపారు. మొత్తం 20 పనికిరాని వాహనాలను మార్చి 26న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం వేయనున్నట్టు చెప్పారు. వేలం నియమనిబందనలు https://konugolu.ap.gov.in పోర్టల్‌లో పొందుపరిచారు. పూర్తి వివరాలకు పోర్టల్‌లో చెక్ చేయాలన్నారు.

News March 20, 2026

నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్: గణబాబు

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధి నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు మార్చి 23న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీనివల్ల దాదాపు 55,000 మందికి ఉపాధి లభిస్తుందని విప్ గణబాబు వెల్లడించారు. 2029 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా, 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్‌గా మారనుందని ఆయన తెలిపారు.

News March 20, 2026

ఏప్రిల్ 2న టెన్త్ ఇంగ్లిష్ పరీక్ష: విశాఖ డీఈవో

image

మార్చి 21న ప్రభుత్వం రంజాన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఆరోజు జరగాల్సిన టెన్త్ పరీక్షను వాయిదా వేసినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన కోరారు.

News March 20, 2026

ఈరోజు స్కూళ్లు యధాతథం: విశాఖ డీఈవో

image

రంజాన్ పండుగ సెలవులో మార్పు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఉన్న సెలవును రద్దు చేసి, దానిని రేపటికి (శనివారం) మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధాతథంగా పనిచేస్తాయని, రేపు మాత్రం సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.

News March 20, 2026

వైజాగ్ బే సిటీకి గ్లోబల్ బిడ్స్ ఆహ్వానం

image

VMRDA ప్రతిష్ఠాత్మక ‘వైజాగ్ బే సిటీ’ ప్రాజెక్టును గ్లోబల్ కన్సల్టెంట్ ఎంపికకు బిడ్స్ ఆహ్వానించింది. కైలాసగిరి-భీమిలి వరకు తీరాన్ని అంతర్జాతీయ స్థాయి వాటర్‌ఫ్రంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుకు 2026-ఏప్రిల్ 2 లోపు ప్రతిపాదనలు సమర్పించాలి. పర్యాటకం, వ్యాపారం, ప్రీమియం నివాసాలపై దృష్టి సారించి బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు, థీమ్ పార్కులు, కార్పొరేట్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.