Visakhapatnam

News May 7, 2024

నేడు, రేపు పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుకు అవకాశం

image

పోస్టల్ బ్యాలట్ పొందని ఉద్యోగులు ఈనెల 7,8 తేదీల్లో సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫారం-12ను అందజేసి బ్యాలట్ పొందాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున సూచించారు. సోమవారం పలువురు ఉద్యోగులు ఏయూ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. ఓటు లేదని తెలియడంతో కలవరం చెందారు. ఇటువంటి వారు 100 మంది వరకు ఉన్నారు. వీరిలో కొంత మంది నుంచి అక్కడే ఫారం 12లను తీసుకొని ఓటు హక్కు కల్పించారు.

News May 7, 2024

సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ రెండు ట్రిప్పులు మాత్రమే

image

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ మధ్య దువ్వాడ మీదుగా స్పెషల్ రైళ్లు జూన్ 24వ తేదీ వరకు 7ట్రిప్పులు నడుపుతున్నట్లు ఈనెల ఆరవ తేదీన వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డిసిఎం సందీప్ ప్రకటించారు. కానీ వీటిని కుదించి కేవలం రెండు ట్రిప్పులు మాత్రమే నడుపుతున్నట్లు సోమవారం మరో ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News May 7, 2024

సుగంధ ద్రవ్యాలతో అప్పన్న చందనం మిళితం

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మి నరసింహ స్వామి వారికి సమర్పించే చందనాన్ని సుగంధ ద్రవ్యాలతో మిళితం చేశారు. ఈనెల 10వ తేదీన స్వామి చందనోత్సవంనకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులుగా 135 కిలోల చందనం అరగదీశారు. చందనోత్సవం రోజున స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నేపథ్యంలో స్వామికి సహస్త్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తారు.

News May 7, 2024

నేడు అల్లూరి సీతారామరాజు శత వర్థంతి

image

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్థంతిని మంగళవారం అన్ని చోట్ల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్మారక ప్రాంతాలైన కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెం, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటతో పాటు అల్లూరి దాడులు జరిపిన రాజవొమ్మంగి, చింతపల్లి, అడ్డతీగల పోలీసు స్టేషన్ల వద్ద వర్థంతి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జాతీయ అల్లూరి యువజన సంఘం సభ్యులు తెలిపారు. 

News May 7, 2024

పాడేరు: 3వ రోజు ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటింగ్

image

పాడేరులోని తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా, మూడవ రోజైన సోమవారం 864 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిస్ట్ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది, అధికారులు, సిబ్బంది స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.

News May 6, 2024

విశాఖలో జానీ మాస్టర్ ఎన్నికల ప్రచారం

image

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తరపున కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజుతో కలిసి అల్లిపురం, నేరెళ్ల కోనేరు వంటి ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ.. అధికార మార్పుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

News May 6, 2024

అనకాపల్లి సభలో సీఎం రమేశ్ ఏమన్నారంటే!

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో జరిగిన సభలో సీఎం రమేశ్ కూటమి మేనిఫెస్టో గురించి వివరించారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలు చేసింది చంద్రబాబు కాదా అని గుర్తు చేశారు. ఒక్కో ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు. బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందిస్తామని వివరించారు.

News May 6, 2024

కాసేపట్లో అనకాపల్లి చేరుకోనున్న మోదీ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా కాశింపేట మండలం తాళ్లపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ప్రధాని మోదీ కాసేపట్లో రానున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సైతం హాజరు కానున్నారు. కాగా కూటమి నాయకులు ఇప్పటికే అనకాపల్లి సభాస్థలి వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.

News May 6, 2024

అనకాపల్లిలో పెరుగుతున్న పొలిటికల్ హీట్

image

అనకాపల్లిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కూటమి MPఅభ్యర్థి CM రమేశ్, YCP అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు..పరస్పర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ‘ఏ మండలంలో అయితే బూడి ముత్యాలనాయుడు రౌడీలు నన్ను అడ్డుకొని దాడి చేశారో అదే మాడుగుల నియోజకవర్గం,దేవరాపల్లి(M)లో 24 గంటలు గడవకముందే YCPని విడిచి కూటమికి మద్దతు తెలిపిన వేలాది మంది నాయకులు,కార్యకర్తలు’అంటూ CM రమేశ్ ట్వీట్ చేశారు.

News May 6, 2024

రాష్ట్రాన్ని దివాలా తీయించిన జగన్: లోక్ సత్తా

image

సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి విమర్శించారు. విశాఖ శ్రీనగర్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ ఎన్డీఏ కూటమికి అండగా ఉంటామని అంటున్నారని తెలిపారు. రాజధాని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును జగన్ పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.