Visakhapatnam

News May 6, 2024

నన్ను మట్టుపెట్టేందుకు వ్యూహం: బూడి

image

ప్రజాధారణ చూసి ఓర్వలేక సీఎం రమేశ్ తనను మట్టుపెట్టేందుకు చూస్తున్నారని బూడి ముత్యాలనాయుడు ఆరోపించారు. కడప నుంచి రౌడీ మూకలను తెచ్చి అరాచకం సృష్టించి గెలవాలని సీఎం రమేశ్ చూస్తున్నారని అన్నారు. తన ఇంటిపై డ్రోన్ ఎగరవెయ్యాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. దర్యాప్తు జరుగుతన్నట్లు వెల్లడించారు. తన కుటుంబ సభ్యులను డబ్బుతో లోబర్చుకుని రెక్కీ నిర్వహించినట్లు విమర్శించారు.

News May 6, 2024

విశాఖలో నమిత ప్రచారం

image

కూటమి అభ్యర్థులకు మద్దతుగా సినీనటి, బీజేపీ నేత నమిత ప్రచారం నిర్వహించారు. ఆదివారం గజరాజు ప్యాలెస్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News May 6, 2024

విశాఖ జిల్లాలో 502 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

image

విశాఖ జిల్లాలో 502 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తుండడంతో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే జిల్లా ఉద్యోగులతో పాటు ఇతర జిల్లాల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 7, 8 తేదీల్లో హోం ఓటింగ్ నిర్వహిస్తామన్నారు.

News May 6, 2024

సింహాచలం: రెండో రోజు 45 కిలోల చందనం అరగదీత

image

సింహాచలం ఆలయంలో చందనం అరగదీత కార్యక్రమం రెండవ రోజు ఆదివారం కొనసాగింది. ఈనెల 10వ తేదీన నిర్వహించే చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామికి సమర్పించేందుకు 120 కిలోల గంధం అవసరం అవుతుంది. దీనిలో భాగంగా మొదటి రోజు 36 కిలోల చందనాన్ని అరగదీయగా..  రెండవ రోజు ఆదివారం 45 కిలోల చందనాన్ని అరగదీసారు. అరగదీసిన గంధాన్ని తూకం వేసి భాండాగారంలో భద్రపరిచారు.

News May 6, 2024

సింహాచలం: 8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈనెల 8 నుంచి 13 వరకు భగవత్ రామానుజాచార్యులు తిరునక్షత్రం పూజలను నిర్వహించనున్నట్లు ఈఓ శ్రీనివాసమూర్తి తెలిపారు. పై తేదీల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 8, 11, 12 తేదీల్లో రాత్రి 7 గంటల వరకే స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు. అలాగే శ్రీ వైష్ణవ శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ నెల 13 సాయంత్రం ఐదు గంటలకు తిరువీధి ఉత్సవం జరుగుతుందన్నారు.

News May 6, 2024

నేడు అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోదీ

image

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఆయన కసింకోట మండలం తాళ్లపాలెం సమీపంలో జరిగే ప్రచార సభలో పాల్గొన్నారు. సాయంత్రం 5:30కు ఆయన సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. తిరిగి 7:10కి విశాఖ ఎయిర్పోర్ట్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే అధికారులు భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 6, 2024

EVMల వినియోగంపై సంపూర్ణ అవగాహన ఉండాలి: విశాఖ కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే పీఓలు, ఏపీవోలతో పాటు ఇతర అధికారులు ఈవీఎంల వినియోగంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలోని ఆదివారం జరిగిన పశ్చిమ నియోజకవర్గ ఈవీఎంల కమిషనర్ ప్రక్రియను ఆర్ఓ హుస్సేన్ సాబ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

News May 5, 2024

ప్రశాంతంగా నీట్ పరీక్ష.. సమన్వయకర్త ఈశ్వరి ప్రభాకర్

image

విశాఖలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు సమన్వయకర్త ఈశ్వరి ప్రభాకర్ తెలిపారు. ఈ పరీక్షకు 8,038 మంది దరఖాస్తు చేసుకోగా 7,861 మంది హాజరయ్యారని వివరించారు. ఇందులో 5,800 మంది బాలికలు కాగా 2,061 మంది బాలురు ఉన్నారని తెలిపారు. నగరంలో మొత్తం 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఆమె వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.

News May 5, 2024

విశాఖ: నివసించేది ఇక్కడ… ఓటు మాత్రం అక్కడ!

image

జీవీఎంసీ 77వ వార్డు పరిధిలో సగం విశాఖపట్నం జిల్లా, మరో సగం అనకాపల్లి జిల్లా పరిధిలో ఉంది. జిల్లాల పునర్విభజనలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించారు. అయితే విలీన పంచాయతీలు మాత్రం విశాఖ జిల్లాలోనే ఉంచారు. ఈ ప్రాంతంలో ఓటర్లు పెందుర్తి అసెంబ్లీకి, అనకాపల్లి పార్లమెంటుకు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ నివసించేది మాత్రం విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం. ఈ ప్రాంతం గాజువాక జోన్ పరిధిలో ఉంది.

News May 5, 2024

సంబల్పూర్-కాచిగూడ ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 13 నుంచి 24 వరకు ప్రతి సోమవారం రాత్రి 9 గంటలకు సంబల్పూర్‌లో బయలుదేరి దువ్వాడ మీదుగా కాచిగూడ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి 25 వరకు ప్రతి మంగళవారం కాచిగూడలో రాత్రి 11 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా సంబల్పూర్ చేరుకుంటుందన్నారు.