Visakhapatnam

News May 5, 2024

విశాఖ: ఇక్కడ నోటాకు అత్యధిక ఓట్లు.. దేశంలోనే 2nd

image

అరకు లోక్‌సభ 2019 ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, ఆ తర్వాతి స్థానంలో అరకులో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘జనరల్ ఎలక్షన్స్ 2019: యాన్ అట్లాస్’లో పేర్కొంది.

News May 5, 2024

గాజువాకలో క్రికెట్ ఆడిన గుడివాడ అమర్నాథ్

image

గాజువాకలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక జింక్ గ్రౌండ్లో వాకర్స్, క్రీడాకారులను ఆదివారం కలుసుకున్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆయన మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో క్రీడాకారులు అధికంగా ఉన్నారని, వీరిని ప్రోత్సహించేందుకు గాజువాకలోని ఓపెన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు.

News May 5, 2024

RK బీచ్‌లో వాలీబాల్ ఆడిన బాలయ్య కుమార్తె

image

విశాఖలోని RK బీచ్ నుంచి YMCA వరకు వాక్ చేస్తూ శ్రీభరత్, తేజస్విని, వెలగపూడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ MP అభ్యర్థిగా శ్రీభరత్ ను గెలిపించాలని కోరారు. అనంతరం వారు RK బీచ్‌లో వాలీ బాల్ ఆడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఏపీ భవిష్యత్ బాగుపడాలంటే కూటమిని గెలిపించాలని కోరారు.

News May 5, 2024

విశాఖ వాసులుకు చల్లటి కబురు.. వర్ష సూచన

image

భానుడి ప్రతాపానికి భగభగలాడిన విశాఖ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. విశాఖ , అనకాపల్లి జిల్లాలో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News May 5, 2024

విశాఖ: నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఆదివారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. 5వ తేదీ నుంచి 8 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆదివారం పీఓలు ఏపీఓలకు, 6న ఓపీఓలకు ఓటింగ్ ఉంటుందన్నారు.. ఈ మేరకు ఏయూ తెలుగు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల ఆవరణలో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News May 5, 2024

పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు జీపు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పాడేరు వస్తుండగా… మైదాన ప్రాంతం వెళ్తున్న ప్రైవేట్ జీపు డైమండ్ పార్క్ జంక్షన్ సమీప మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ముడువ సింహాచలం మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News May 5, 2024

విశాఖ: ఒకే వీధి.. తండ్రిది AP.. కుమారుడిది తెలంగాణ

image

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. ఉమ్మడి APలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. విజభన తర్వాత ఆయన ఇల్లు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చింది. మరోవైపు అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.

News May 5, 2024

చోడవరం: పోటీలో నిలిచింది ఆరుగురు మాత్రమే..!

image

రాష్ట్రంలో అతి తక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గంగా చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ రికార్డు సృష్టించింది. ఇక్కడ కేవలం 6 మాత్రమే బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, వైసీపీ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాసరావు, బీఎస్పీ అభ్యర్థిగా మహాలక్ష్మి నాయుడు, సీపీఐ ఎంఎల్ పార్టీ అభ్యర్థిగా గణేశ్, ఇండిపెండెంట్‌గా వివేక రాజు బరిలో ఉన్నారు.

News May 5, 2024

అనకాపల్లి: ‘స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలి’

image

స్వేచ్ఛగా ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. శనివారం ఆయన అనకాపల్లి కలెక్టరు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. వివిధ విభాగాల ద్వారా ఎన్నికల ప్రక్రియకు అనుసరిస్తున్న విధానాలపై ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి సుభాష్ వివరించారు.

News May 4, 2024

పరామర్శకు వెళితే దాడి చేశారు: సీఎం రమేశ్

image

తనపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయని అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేవరాపల్లి మండలంలోని తారువలో మా పార్టీ కార్యకర్తపై దాడి జరిగితే, పరామర్శించడానికి వెళ్లిన నాపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. అక్కడే చోద్యం చూస్తున్న పోలీసులు, వారి వాహనాలపై కూడా దాడికి దిగారు. ఈ దాడికి స్వయంగా YCP ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడే నేతృత్వం వహించడం దారుణం’ అని ట్వీట్ చేశారు.