India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఇష్టం వచ్చినట్లు కథనాలు రాసిన ఈనాడు రామోజీరావుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘మా భూమి మాది కాకపోతే మరెవరిది’ అంటూ రామోజీరావును ప్రశ్నించారు. అన్నం తినే వాళ్ళు ఎవరూ ఇలాంటివి రాయరని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందడం కోసమే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని విమర్శించారు. ఈ చట్టం రాష్ట్రంలో అమల్లో లేదన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 6న అనకాపల్లికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కశింకోట మండలం తాళ్ళపాలెంలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సభ ఉంటుందని వెల్లడించారు. సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలిపారు.
ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా శనివారం విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, రెవెన్యూ, పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఆంధ్రా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద జరిగే ఈవీఎంల కమిషనింగ్, ఇతర ప్రక్రియలను పరిశీలించే నిమిత్తం ఆయన వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సరిగ్గా మరో నెల రోజుల్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ స్టార్ట్ అవ్వగా.. మే13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్లు లెక్కించి ఎమ్మెల్యే ఎవరో ప్రకటిస్తారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖలోని 15 నియోజకవర్గాల్లో నాలుగు మినహా మిగతా వాటిలో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్ చెయ్యండి.
70 ఏళ్ల క్రితమే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తిన సాలూరు మొదటి ఎమ్మెల్యే కూనిశెట్టి వెంకటనారాయణ దొర. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో గెలిచిన కూనిశెట్టి 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర అసెంబ్లీలో ఆనాడే ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తారు. ప్రతిపాదనపై ఓటింగ్ జరిగితే ఒకే ఒక్క ఓటుతో తీర్మానం వీగిపోయింది.
ప్రధాని మోదీ ఈనెల 6న అనకాపల్లి రానున్నారు. రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 5 గంటలకు అనకాపల్లి రాజుపాలెం వస్తారు. అక్కడ నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళతారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6.35 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి రాత్రి 7.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ బయలుదేరి వెళతారు.
సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి ఆలయంలో గంధం అరగదీతను ఆలయ అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం సంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించారు. తొలి విడత అప్పన్న బాబుకు సమర్పించడానికి అవసరమైన 120 కిలోల గంధాన్ని అరగదీసి దానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. చందనోత్సవ రోజున ఈ గంధాన్ని సింహాద్రిఅప్పన్నకు సమర్పిస్తారు.
పరవాడ రామ్‌కి ఎస్‌ఈ జెడ్‌లోని అజీనో మోటో బయో ఫార్మా కంపెనీలో రసాయన వాయువు లీకై ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి పరవాడ సీఐ ఎం.బాలసూర్యరావు తెలిపిన వివరాలు ఉన్నాయి. ఫార్మా పరిసర గ్రామాలకు చెందిన 5 వ్యక్తులు విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత గొంతులో నొప్పి ప్రారంభమైంది. దీంతో కుటుంబ సభ్యులు సంస్థ యాజమాన్యానికి సమాచారం అందించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవంలో సామాన్య భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఆలయంలో చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్, కమిషనర్, ఏసీపీ ఫకీరప్ప సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపాథ్యంలో ప్రోటోకాల్ దర్శనాలు ఉండవన్నారు.
విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానం పరిధిలో బరిలో 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో అదనంగా బ్యాలెట్ యూనిట్ వినియోగిస్తున్న క్రమంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, సాధారణ పరిశీలకుడు అమిత్ శర్మ, రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈవీఎంల అధికారి టీ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.