Visakhapatnam

News May 3, 2024

సికింద్రాబాద్- బ్రహ్మపూర్ – సికింద్రాబాద్ మధ్య వేసవి ప్రత్యేక రైలు

image

సికింద్రాబాద్ – బ్రహ్మపుర్ మధ్య వేసవి ప్రత్యేక రైలు మే 10న తేదీన నడుపుతున్నట్లు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. 11 న ఉదయం 9: 33 గంటలకు దువ్వాడ చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 2:45 గంటలకు బ్రహ్మ పూర్ చేరుకుంటుంది. మే 11న బ్రహ్మపూర్‌లో సాయంత్రం 4: 45 కు బయలుదేరి దువ్వాడకు రాత్రి 9: 55కు చేరుకుంటుంది. 12న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

News May 3, 2024

వైసీపీ విశాఖను దోచుకుంది: బాలకృష్ణ

image

విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్‌ను గెలిపించాలని సినీ నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ శుక్రవారం సాయంత్రం పిలుపునిచ్చారు. విశాఖ తూర్పులో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం విశాఖను దోచుకుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎన్నికలలో ఎండగడతారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

News May 3, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

image

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో HSL కాంప్లెక్స్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి దుర్మరణం చెందాడు. వీరు ముగ్గురు కొమ్మాదిలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ దాశరథి తెలిపారు.

News May 3, 2024

అల్లూరి జిల్లాలో 130 ఏళ్ల ఉద్యమరాలు మృతి..! 

image

అల్లూరి మన్యంలో పితూరి ఉద్యమంలో పాల్గొన్న మహిళ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం ఈతరొబ్బలు గ్రామానికి చెందిన పలాస సోములమ్మ గురువారం ఉదయం 8 గంటలకు మృతి చెందిందని తెలిపారు. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఎన్నో గ్రామాలు తిరిగిందని.. 1924లో పిండి కుండల పితూరిలో పాల్గొన్నట్లు చెప్పారు. సోములమ్మ వయసు సుమారు 130 ఏళ్లు ఉంటుదని వారు తెలిపారు.

News May 3, 2024

జూన్ 1 విశాఖ-హతియా రైలు రద్దు

image

విశాఖపట్నం-హతియా నగరాల మధ్య నడుస్తున్న వారాంతపు వేసవి ప్రత్యేక రైలును జూన్ 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 30 వరకు విశాఖ నుంచి హతియా(08559) వెళ్లే రైలు, అదేవిధంగా హతియా నుంచి విశాఖకు(08560) వచ్చే రైళ్ళను మే 6 నుంచి జూన్ 1 రద్దు చేశారు. ప్రయాణికులు దీనిని గమనించాలని తెలిపారు.

News May 3, 2024

శనివారం నాటికి విశాఖకు చేరనున్న బ్యాలెట్ పత్రాలు

image

ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ శరవేగంగా జరుగుతోంది. జిల్లాలోని 6 అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం కోసం 45,350 బ్యాలెట్ పత్రాల ముద్రణ కర్నూలు జిల్లా ప్రభుత్వ ప్రింటింగ్ కార్యాలయంలో జరుగుతోంది. శనివారం నాటికి బ్యాలెట్ పత్రాలు విశాఖకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ అంతా కర్నూల్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లోనే జరుగుతుంది.

News May 3, 2024

విశాఖ ప్రధాన కూడళ్ళలో గ్రీన్ రూఫ్ ఏర్పాటు

image

విశాఖలోని పలు ప్రధాన జంక్షన్లో వేసవి తాపానికి గాను గ్రీన్ రూఫ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయడంతో వాహనచోదకులకు కొంత ఉపశమనం లభిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇలాంటి గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

News May 3, 2024

సింహాచలం: నేటి నుంచి చందనోత్సవ టిక్కెట్లు విక్రయాలు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఈనెల 10న జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దర్శన టిక్కెట్లువిక్రయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి తెలిపారు.ఈనెల 7వ తేదీ సాయంత్రం వరకు విక్రయాలు సింహాచలం మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్రాంచ్ లలో టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు.కొండపై కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

News May 3, 2024

భీమిలి కొట్లాట కేసులో పదిమంది అరెస్ట్

image

భీమిలి మండలం గొల్లల తాళ్లవలసలో ఈనెల 1వ తేదీన టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కొట్లాట సమాచారం మేరకు మధురవాడ జోన్ ఏసీపీ సునీల్, భీమిలి సీఐ డి.రమేష్ తదితరులు ఈనెల 1వ తేదీ రాత్రి నుంచి గ్రామంలో భద్రత ఏర్పాట్లు చేశారు. విచారణ అనంతరం ఇరు వర్గాలకు చెందిన పదిమందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

News May 2, 2024

విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

image

విశాఖ ఆనందపురంలో చెక్ పోస్టు వద్ద భారీగా నకీలి కరెన్సీని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో చేపట్టిన దాడులలో 3 వాహనాలు, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 22 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 6 కత్తులు, రూ.10 లక్షల నకిలీ కరెన్సీ, ఒక రైస్ పూలింగ్ బౌల్, గోల్డ్ కోటెడ్ కాయిన్స్, బిస్కెట్‌లు పోలీసులు సీజ్ చేశారు.