India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి విశాఖలో నేడు జనసేన, వైసీపీ అధినేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. సీఎం జగన్ పాయకరావుపేటలోని సూర్యా మహాల్ సెంటర్‌లో సాయంత్రం 3 గంటలకు జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ నేపథ్యంలో జనసమీకరణపై ఆయా పార్టీల నాయకులు దృష్టి పెట్టారు.
విశాఖ లోక్‌సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. 39 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురివి తిరస్కరణకు గురయ్యాయి. 33 మంది మిగలగా, ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. నోటాతో కలిపితే 34 మందితో బ్యాలెట్ పేపరు రానుంది. ఒక బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)లో 16 పేర్లకు మాత్రమే అవకాశం ఉంది. ఈ లెక్కన 34 పేర్లకు 3 ఈవీఎంలు వినియోగించాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తున్న మహిళల శాతం విశాఖ జిల్లాలో తక్కువగా ఉంది. విశాఖ లోక్ సభ స్థానానికి 33 మంది, ఏడు అసెంబ్లీ స్థానాలకు 101 మంది మొత్తం 134 మంది ఎన్నికల బరిలో ఉండగా, వీరిలో 20 మంది మహిళలు ఉన్నారని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. వీరి శాతం పరిశీలిస్తే కేవలం 14 % ఉంది. ఎన్నికల బరిలో నిలిచే వారి సంఖ్య తక్కువగా ఉంటే విజయం సాధించి చట్టసభల్లో అడుగిడే మహిళల సంఖ్య మరింత తక్కువ.
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. సంబల్ పూర్- ఎస్ఎంవీ బెంగళూరు (08321) ప్రత్యేక రైలు మే 9, 16 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు సంబల్పూర్లో బయలుదేరి మర్నాడు తెల్లవా రుజామున 4.55 గంటలకు దువ్వాడ వచ్చి.. అక్కడి నుండి 5 గంటలకు బెంగళూరుకు వెళుతుందన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విశాఖ పోలీస్ సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ నెల 10న జరిగే చందనోత్సవంపై ప్రత్యేకంగా చర్చించారు. ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్ లకు వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో ఆయన ఆయా విభాగాల పనితీరుపై ఆరా తీశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం పాయకరావుపేట రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట సూర్య మహల్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడిని ఓడించాలంటూ ఆయన కుమారుడు రవికుమార్ ప్రచారం చేస్తున్నాడు. ఈ మేరకు రవికుమార్ సోషల్ మీడియాలో ఓ ప్రచార పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. ‘కన్న కొడుకుకు న్యాయం చేయలేనివాడు.. ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చెయ్యగలడు!’ అని రవికుమార్ ప్రశ్నించాడు. ఆలోచించి ఓటు వేయండి.. మా నాన్న బూడి ముత్యాల నాయుడిని ఓడించండి అంటూ పేర్కొన్నాడు.
వాల్తేర్ డివిజన్ పరిధిలో తూర్పు కోస్తా రైల్వేలో 210 అదనపు కోచ్‌లను ఏప్రిల్ నెలలో రైళ్లకు జత చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. వేసవి రద్దీని పరిశీలిస్తూ మార్చిలో 124 కోచ్‌లు జత చేశామని, వీటి ఫలితంగా 23, 500 అదనపు వసతి అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. దీంతోపాటు జన ఆహార్, ప్రాథమిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
ఎన్నికల విధుల్లో భాగమయ్యే అధికారులు, సిబ్బందికి మే నెల 5 ,6, 7 తేదీల్లో ఏయూలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 7, 8 తేదీల్లో పోలీసు, రవాణా ఇతర అత్యవసర సేవల విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు. మొత్తం 11,221 మంది దరఖాస్తు చేసుకున్నారని సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
బుధవారం విశాఖ నుంచి వారణాసికి వెళ్లనున్న రైలు 2గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
విశాఖపట్నంలో బుధవారం ఉదయం 4.20 గంటలకు బయలుదేరవలసిన విశాఖ- బనారస్ రైలు లింక్ రైలు ఆలస్యం కారణంగా ఉదయం 6.20 గంటలకు విశాఖలో బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. దీనిని గమనించి ప్రయాణికులు తమ ప్రయాణంలో మార్పులు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Sorry, no posts matched your criteria.