India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా నుంచి విశాఖ మీదగా గంజాయిని తరలిస్తున్న ఒక బాలుడుని ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.80 వేలు వరకు ఉంటుందని జీఆర్పీ సీఐ ధనుంజయ నాయుడు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బాలుడు దగ్గర గంజాయి లభ్యమయింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 82 ఘటనల్లో కేసులు నమోదు చేశామని, నిబంధనలు అతిక్రమించిన 71 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని, 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలో రాజకీయ పార్టీలపై 54 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని సాధారణ పౌరుల కేసుల్లో 61 కేసుల్లో 57 కేసులు పరిష్కరించామని తెలిపారు.
అనకాపల్లి పట్టణం విజయరామరాజు పేట అండర్ పాస్ వంతెన సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్సై కె.శాంతారావు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయసు 40-45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. లేత నారింజరంగు చొక్కా, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. సమాచారం తెలిస్తే 7673906010 నంబర్‌కి సంప్రదించాలన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇటీవల మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘దుర్మార్గ ముఖ్యమంత్రి’ అని సంబోధించారంటూ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ఆయనకు 41ఏ నోటీసు అందజేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించనున్నట్లు సీఈఓ ఎం.పోలినాయుడు తెలిపారు. ఈ సమావేశం తోపాటు ఒకటి నుంచి 7 వరకు స్థాయి సంఘాల సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాలకు లోబడి సమావేశాలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వివిధ అంశాలపై ఎలాంటి చర్చ జరగదన్నారు. కేవలం హాజరైన సభ్యుల నుంచి సంతకాలు తీసుకుని సమావేశం ముగిస్తామన్నారు.
అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహంను తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా.. అరకు సీటు ఆశించి భంగపడ్డ అబ్రహం ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టరేట్లో సమర్పించాలని ఆర్ఓ, జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున సూచించారు. ఫారం- 8 ద్వారా రెండు సెట్ల వివరాలు అందజేయాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల వివరాలు మే 8వ తేదీలోగా, కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు మే 25 లోగా అందజేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించామని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు హింసను ప్రోత్సహించరాదని పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ, పోలీసు పరిశీలకులు అమిత్ శర్మ, అమిత్ కుమార్ లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలని నైతిక విలువలు, నిజాయతీతో వ్యవహరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం చిహ్నాల కేటాయింపులో భాగంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీ నియమించిన 37 మందిలో ఉత్తరాంధ్ర వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, అనకాపల్లి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, అల్లూరి జిల్లాకు చెందిన కె.భాగ్యలక్ష్మి ఉన్నారు. వీరు రాష్ట్రమంతా పర్యటిస్తూ రాజకీయ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ వైసిపి అధిష్టానం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి పార్టీలు కట్టుబడి ఉన్నాయని విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో అంబేద్కర్ కళాక్షేత్రం ఎస్సీ, ఎస్టీ సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ముందుకు వెళ్లదని చెప్పారు.
Sorry, no posts matched your criteria.