India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షకు విశాఖ జిల్లాలో 79.25% హాజరు నమోదైనట్లు మెంబర్ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు తెలిపారు. పరీక్షకు 9311 మంది దరఖాస్తు చేసుకోగా 7379 మంది హాజరయ్యారు. 1932 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. విశాఖ నగరంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.
కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. విశాఖ నగరం అక్కయ్యపాలెం, మహారాణి పార్లర్ వద్ద రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీగా సత్యారెడ్డిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తారని చెప్పారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. విశాఖ అభివృద్ధికి ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు.
విశాఖ జిల్లాలో ఎన్నికలకు 15 వేలమంది ఉద్యోగులను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. జిల్లాలో 502 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ పటిష్ఠ చర్యలు చేపడుతున్నామన్నారు. ఏడు విభాగాల్లో 110 బృందాలను నియమించామని చెప్పారు. మైక్రో అబ్జర్వర్, వీడియో గ్రాఫర్స్ అందుబాటులో ఉన్నారన్నారు. కంట్రోల్ రూములను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
వచ్చేనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన 5K రన్‌లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైజాగ్ వాలంటీర్లు, స్వీప్ అధికారులు, సాధారణ పౌరులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
అల్లూరి జిల్లా పెదబయలు మండల కేంద్రంలో శోభ హిమరాజు(33)ని అప్పారావు అనే నిందితుడు కత్తితో హత్య చేశాడు. శనివారం అర్ధరాత్రి శోభ హిమరాజు ఓ పెళ్లికి వచ్చి పెదబయలులో ఓ డాబాపై నిద్రిస్తున్నాడు. అదును చూసుకుని అప్పారావు కత్తితో మెడపై గాయపరిచాడు. క్షతగాత్రుడిని పాడేరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితుడు పరారీలో ఉన్నాడు.
సార్వత్రిక ఎన్నికల పోటీలో నిలిచే వారి సంఖ్య రేపు స్పష్టం కానుంది. శనివారం నాడు ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువుంది. ఈరోజు సెలవు కావడంతో సోమవారం పలువురు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. లోక్ సభకు 33 మంది, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది నామ పత్రాలు దాఖలు చేశారు. వీరిలో ఎంతమంది ఉంటారనేది సోమవారం తేలనుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గడుగుపల్లి వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. శనివారం రాత్రి గడుగుపల్లిలోని కుమార్తె ఇంటికి వచ్చిన వృద్ధుడిని జాతీయ రహదారిపై బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ సెట్ 2024 నేడు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరగనుంది. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించరని మెంబర్ సెక్రటరీ ఆచార్య జీఎంజే రాజు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 79 కేంద్రాల్లో జరిగే పరీక్షకు 38,078 మంది హాజరుకానున్నారు.
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్.కె. బీచ్ లో సుమారు ఐదు వేల మందిని భాగస్వామ్యం చేస్తూ 5కె రన్ ఫర్ ఓట్ అనే పేరుతో ఓటరు చైతన్య ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
టీవీ, సినీ నటుడు సాగర్ నేడు (ఆదివారం) అనకాపల్లిలో జనసేన తరఫున ప్రచారం చేయడానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు పట్టణంలోని రింగ్ రోడ్‌లో గల జనసేన పార్టీ కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం జనసేన తరుఫున ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.