India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు, జూలాజికల్ గార్డెన్ అలీపూర్, కోల్‌కతా నుంచి కొత్త జంతువులను తీసుకువచ్చినట్లు ‘జూ’ క్యూరేటర్ డాక్టర్ నందిని సలారియా తెలిపారు. జంతు మార్పిడి విధానంలో 2 జిరాఫీలు, ఏషియన్ వాటర్ మోనిటర్ లిజార్డ్, మక్కావును తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. విశాఖ జూ నుంచి తెల్ల పులి, తోడేలు, ఇండియన్ వైల్డ్ డాగ్స్, బ్లాక్ స్పాన్ హాగ్ డీర్, హైనా, లేమర్‌ను ఆలీపూర్ జూకి అందజేశారు.
అల్లూరి జిల్లాలో విషాదం నెలకొంది. పచ్చ కామెర్లు ముదిరి ఓ గిరిజన బాలిక ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం, బొర్రా పంచాయతీ జీరుగెడ్డకు చెందిన సోమేశ్- సుజాత దంపతుల కుమార్తె దేవిశ్రీ(6) మూడు రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. పచ్చకామెర్లు ముదిరి శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. సకాలంలో వైద్యం అందకే బాలిక మృతి చెందిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాయకరావుపేటలో ఈరోజు ఆమె రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు అమరావతిని భ్రమరావతి చేశారని ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మోదీకి తొత్తులుగా మారిపోయారని ఆమె ఆరోపించారు. జగన్ కారణంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గొంప గోవిందరాజు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని ఆయన అధ్యక్షురాలు షర్మిలకు పంపించారు. కాంగ్రెస్ పార్టీతో ఏ సంబంధం లేని వారికి టిక్కెట్లు ఇవ్వడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశానన్నారు. ఆయన భవిష్యత్తు నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి జారీ చేసిన కూపన్లకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసిన ఎన్ఏడి జంక్షన్‌లో గల పెట్రోల్ బంక్ లైసెన్స్‌ను తాత్కాలింగా రద్దు చేసినట్లు విశాఖ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ తీసుకున్న 860 మంది వాహనదారులపై కూడా కేసులు నమోదు చేయాలని జేసీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీకాకుళం రోడ్డు తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. మే 5, 12 తేదీల్లో రాత్రి 8.05 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.05కి దువ్వాడ చేరుకుని మధ్యాహ్నం12.15కి శ్రీకాకుళం చేరుకుంటుంది. మే 6, 13వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి దువ్వాడ మీదగా తర్వాత రోజు ఉదయం 8.20కి తిరుపతికి చేరుకుంటుంది.
సింహాచలం శ్రీ వరహ లక్ష్మి నృసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు సందర్భాన్ని పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను కూడా పునః ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.
ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాలాక్షి నగర్ సీత కొండ వైఎస్‌ఆర్ వ్యూ పాయింట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ మృతదేహం తీరానికి కొట్టుకు వచ్చింది. కమ్యూనిటీ గార్డులు గుర్తించి పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బుచ్చియ్యపేట మండలం పొట్టి దొరపాలెంలో రామాల అన్నపూర్ణ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి సోదరుడు బి.రమణ ఫిర్యాదు మేరకు ఎస్సై డి ఈశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టానికి తరలించారు. అన్నపూర్ణకి తన భర్త సత్తిబాబుతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని ఎస్ఐ తెలిపారు. భర్తను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
విశాఖ ఎంపీ స్థానానికి 39 నామినేషన్ పత్రాలు దాఖలు కాగా 33 పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున ఆమోదం తెలిపారు. అర్హత లేని ఐదు నామినేషన్ పత్రాలు తిరస్కరించారు. ఒకదానిపై విచారణకు ఆదేశించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు అమిత్ శర్మ, అమిత్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ పరిశీలన ప్రక్రియ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.