Visakhapatnam

News April 25, 2024

సీఎం రమేశ్ సంపద రూ.497.59 కోట్లు

image

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, భార్య శ్రీదేవికి కలిపి రూ.497.59 కోట్ల ఆస్తులున్నాయి. రమేశ్ చర, స్థిరాస్తులు రూ.292 కోట్లు, భార్య స్థిర, చరాస్తులు రూ.205.53 కోట్లు. రమేశ్ పేరుతో వివిధ కంపెనీల్లో 10.49 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. బంగారం ఆయన పేరిట 6.92 కిలోలు శ్రీదేవి పేరిట 8.19 కిలోల ఉంది. వీరికి 3 కార్లు ఉన్నాయి. వీరికి అప్పులు రూ.101.61 కోట్లు ఉన్నాయి. రమేశ్‌పై 7 కేసులు ఉన్నాయి.

News April 25, 2024

అన్ని వర్గాలకు వైసీపీ అనుకూలం: బొత్స

image

వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ద్వారక నగర్‌లో విశాఖ హోటల్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ ప్రతినిధులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థులు వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, ఎంవీవీ పాల్గొన్నారు.

News April 25, 2024

విశాఖ: తీవ్ర వడగాలులు.. మీ ఊరిలో ఎండ తీవ్రత ఎలా ఉంది?

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అనకాపల్లి జిల్లా రావికమతంలో బుధవారం 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేడు కూడా ఉమ్మడి జిల్లాలోని విశాఖ-1, అల్లూరి సీతారామరాజు-2, అనకాపల్లి-3 మండలాల్లోని తీవ్ర వడగాలులు, మరో 27 మండలాల్లో వడగాలులు వీచే అవకాసం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మరి మీ ఊరిలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.

News April 25, 2024

ఈసీకి లేఖ రాసిన లోకసత్తా

image

మే 1న ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈసీకి,csకి లేఖ రాసినట్లు లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 66లక్షల మంది ఫించనుదారులు ఉన్నారని, 15వేల సచివాలాయలు, 1. 35 లక్షల సిబ్బంది ఉన్నారని వారి చేత రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేసేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

News April 25, 2024

అల్లూరి: గ్యాస్ పొయ్యి లేని గ్రామం 

image

కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయితీ కొత్త బొర్రంపేటలో నేటికీ గ్యాస్ సిలిండర్లు వాడరు. 35 కుటుంబాలు నివాసముంటున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్యాస్ ఎలా వినియోగించాలో తెలియదని, కట్టెలు పొయ్యిలోనే ఆహారం తయారు చేసుకుంటామని వారు చెబుతున్నారు. తరచూ అడవి నుంచి కట్టెలు కొట్టుకుని తెచ్చుకుంటామని అంటున్నారు.

News April 25, 2024

విశాఖలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు మార్పు

image

మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పెందుర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. అక్కడ టీడీపీ ఇన్‌ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పార్టీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్‌కు విశాఖ దక్షిణ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్‌ను ఉత్తర ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా నియమించారు.

News April 25, 2024

గాజువాక వైసీపీ అభ్యర్థి ఆస్తి రూ.10.54 కోట్లు

image

➤అభ్యర్థి పేరు: గుడివాడ అమర్ నాథ్
➤ ఆస్తుల మొత్తం : రూ.10.54 కోట్లు
➤ చరాస్తులు మొత్తం: రూ.3.40కోట్లు
➤స్థిరాస్తుల విలువ: రూ.6.91 కోట్లు
➤ కేసులు: 3
➤ అప్పులు: రూ.93.16 లక్షలు
➤➤2019లో ఆయన కుటుంబం ఆస్తి విలువ రూ.5.10 కోట్లు ఉండేది.

News April 25, 2024

గాజువాక టీడీపీ అభ్యర్థిపై మూడు కేసులు

image

గాజువాక TDP అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. పల్లా కుటుంబ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.34.32 కోట్లు. వాటిలో శ్రీనివాసరావు పేరిట స్థిరాస్తులు రూ.7.13కోట్లు,చరాస్తులు రూ.14.91 లక్షలు. ఆయన భార్య లావణ్యదేవి పేరిట స్థిరాస్తులు రూ.6.59 కోట్లు, చరాస్తులు రూ.61,34 లక్షలు. అవిభక్త కుటుంబానికి రూ.20.26 కోట్లున్నాయి. అప్పులు రూ.2.33 కోట్లు. ఆయనపై మూడు కేసులున్నాయి.

News April 25, 2024

బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘చిట్టి’ కార్యక్రమం

image

గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘చిట్టి’ సమగ్ర మిషన్ కార్యక్రమం ప్రారంభించినట్టు పాడేరు సబ్ కలెక్టర్ పీ.ధాత్రిరెడ్డి తెలిపారు. బుధవారం చింతపల్లిలో అదనపు ఎస్పీ కే.ప్రతాప్ శివకిశోర్ తో కలిసి చిట్టి కార్యక్రమం ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలు జరగడం వల్ల చిన్న వయస్సులో గర్భం దాల్చి మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు.

News April 25, 2024

కైలాసగిరిపై మరో రెండు రోజుల్లో రైలు సిద్ధం

image

ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖ నగరం కైలాసగిరిపై సర్కులర్ రైలు మరో రెండు రోజుల్లో సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు విఎంఆర్డిఏ అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్ నెల నుంచి సర్కులర్ రైలు బాధ్యతలు విఎంఆర్డిఏ తీసుకుని నిర్వహిస్తుందన్నారు. అయితే సాంకేతిక సమస్యలు రావడంతో వార్షిక నిర్వహణకు వేరే ఏజెన్సీకి అప్పగించామన్నారు. మరమ్మతులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు.