India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ రైల్వే స్టేషన్లో ఎకానమీ మీల్స్, స్నాక్ మీల్స్‌ను రైల్వేశాఖ ఐఆర్‌సీటీసీతో కలిసి అందుబాటులోకి తీసుకువచ్చింది. వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేకంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారి కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు రెండు రకాల మీల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. ఎకానమీ మీల్స్ రూ.20, స్నాక్ మీల్స్ రూ. 50కు అందిస్తున్నారు.
ఈనెల 27న నిర్వహించనున్న పాలీసెట్‌కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పాలిసెట్ జిల్లా కో-ఆర్డినేటర్ కె.నారాయణరావు తెలిపారు. విశాఖ నగరంలో 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 9,511 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 11 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులు రూ.431.30 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎంవీవీ దంపతులకు చరాస్తులు రూ.340.44కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య పేరుతో 1.2 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరి పేరిట రూ.80.86 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ఆయనకు రూ.18.72 కోట్లు, భార్య పేరుతో రూ.6.6 కోట్లు అప్పు ఉందని అన్నారు. ఆయనపై ఒక కేసు ఉంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 3 బాలికలు, 5 బాలుర గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో.. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలని పీవో అభిషేక్ సూచించారు. 2024 సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.
సీఎం జగన్ పాలనలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియాతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో వెనుకబడిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బుధవారం రాత్రి అనకాపల్లిలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆధ్వర్యంలో రోడ్ షో ర్యాలీగా నిర్వహించారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రాలో 3,600 కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించారన్నారు. జగన్ వైఫల్యం వలన ఏపీ వెనుకబడి పోయిందన్నారు.
రక్షణ శాఖ మంత్రి విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోరాట కమిటీ సభ్యులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాజ్ నాథ్ సింగ్ పర్యటనకు వీరు అడ్డు పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్ బుధవారం మాడుగుల స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వైసీపీ తరఫున అక్క ఈర్లె అనురాధ నామినేషన్ వేసిన విషయం తెలిసిదే. నామినేషన్ అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించేందుకే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. తన నామినేషన్ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం వినోదాత్మక సన్నివేశం జరిగింది. సింహాద్రి అప్పన్న ఉంగరం పోయింది.. ఎవరు తీశారంటూ.. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంటల శ్రీనుబాబుతో పాటు పలువురు భక్తులను విచారించారు. కొందరు భక్తులు ఇది నిజమేననుకుని కంగారుపడ్డారు. చివరకు పట్టు వస్త్రాల్లో దొరికిందని ఆలయ అర్చకులు ప్రకటించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి భరత్ అనే పేరుతో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి మతుకుమిల్లి శ్రీ భరత్ పోటీ చేస్తుండగా.. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ బరిలో ఉన్నారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. మరి వీరిలో గెలిచి ‘భరత్ అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం చేసేదెవరని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
విశాఖ ఉత్తర నియోజకవర్గ BJP అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, భార్య సీతాసుజాత ఉమ్మడి ఆస్తులు రూ.106.22 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన పేరు మీద ఉన్న స్థిరాస్తులు రూ.91.69 కోట్లు, చరాస్తులు రూ.2.90 కోట్లు ఉన్నాయి. అప్పులు రూ.5.72 కోట్లు ఉన్నాయి. భార్య పేరుతో రూ.10.14 కోట్లు స్థిరాస్తులు, రూ.1.49 కోట్లు చరాస్తులు,అప్పులు రూ.1.67 కోట్లు ఉన్నాయి. వీరికి వాహనాలు లేవు. ఆయనపై ఒక పోలీస్ కేసు ఉంది.
Sorry, no posts matched your criteria.