India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.
హోమ్ ఓటింగ్ కోసం ఈరోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని విశాఖ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లికార్జున కోరారు. 85 సంవత్సరాల పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం గల దివ్యాంగులలు హోమ్ ఓటింగ్‌కు అర్హులుగా సర్వే ద్వారా గుర్తించి వారికి ఫారం-12(డి) అందించినట్లు పేర్కొన్నారు. ఓటర్లు ఇంకా మిగిలి ఉంటే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేయాలన్నారు.
స్టీల్ ప్లాంట్‌కు గంగవరం అదానీ పోర్టు నుంచి బొగ్గు రవాణా నిలిచిపోవడంపై ఉక్కు అధికారుల సంఘం హైకోర్టులో కేసు వేసింది. గంగవరం పోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన కోకింగ్ కోల్, లైన్ స్టోన్ సుమారు మూడు లక్షల టన్నులు ఉందన్నారు. ఈనెల 12 నుంచి పోర్ట్ కార్మికుల ఆందోళన వల్ల వాటి రవాణా నిలిచిపోయిందన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సంఘం ప్రతినిధి ప్రసాద్ తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైన బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, దీని పరిష్కారానికి వాటాదారులందరూ సహకరించాలని ప్లాంట్ సిఎండి అతుల్ భట్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 12 నుంచి అదానీ గంగవరం పోర్ట్ నుంచి రవాణా నిలిచిపోవడం వల్ల స్టీల్ ప్లాంట్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ఉత్పత్తి ప్రక్రియకు అవసరమైన కోకింగ్ కోల్ సున్నపురాయి అందకపోవడంతో ప్లాంట్ ఇబ్బందుల్లో పడిందన్నారు.
ఎన్నికల అధికారులు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 26వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఫారం-12 దరఖాస్తుకు ఎన్నికల గుర్తింపు కార్డు ఎన్నికల విధుల నియామక పత్రం జతచేసి నోడల్ అధికారి ద్వారా వారు పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సూచించారు.
మాడుగుల అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తన చేతిలో రూ.50 వేల నగదు, బ్యాంకు డిపాజిట్లు రూ.7.69 లక్షలు, భూముల విలువ రూ.21.17 కోట్లు, భార్య పేరున రూ.5.81 కోట్ల ఆస్తులు, కారు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2023లో సీఎం జగన్‌ను దూషించినందుకు, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పినగాడిలో అధికారులను అడ్డుకున్నందుకు, 2009లో సబ్బవరం పీఎస్‌లో మరో కేసు ఉన్నట్లు పేర్కొన్నారు.
విభిన్న ప్రతిభావంతుల స్టేట్ ఇంటర్ జోన్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 29, 30 తేదీల్లో విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ్యాచ్ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
అల్లూరి జిల్లా కలెక్టర్ విజయ సునీతను అంధుల క్రికెటర్ వలసనేని రవని కలిశారు. ఆల్ ఇంగ్లాండ్ అంధుల క్రికెట్ ప్రపంచ పోటీలలో గెలిచిన టీంలో ఈమె సభ్యురాలిగా ఉన్నారు. ఆల్ రౌండ్ ప్రతిభతో 2023లో బంగారు పతకం సాధించారు. రవని కుటుంబ సభ్యులు పరిస్థితులు, మెరుగైన క్రికెట్ ఆడేందుకు అవసరమైన సాయం చేయాలని విన్నవించగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఓట్లు వేసేందుకు యువతను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆమెకు సూచించారు.
అనకాపల్లి జిల్లాలో 10 పరీక్షల్లో 89.04 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. జిల్లాలో మొత్తం 21,169 మంది పరీక్షకు హాజరు కాగా 18,848 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 14,725 ప్రథమ శ్రేణిలో, 2,867 మంది ద్వితీయ శ్రేణిలో, 1256 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు డీఈఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు. పాయకరావుపేట జడ్పీ బాలికల హైస్కూల్‌కు చెందిన కె. సత్య ధనస్వాతి 592 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఎండాడ బస కేంద్రం నుంచి మంగళవారం సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకొని అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. తర్వాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తర్వాత బొడ్డువలస మీదుగా సాయంత్రం చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకొని రాత్రి బస చేస్తారు.
Sorry, no posts matched your criteria.