Visakhapatnam

News April 24, 2024

భీమిలి: టెన్త్ విద్యార్థినికి 588 మార్కులు

image

భీమిలి ఏపీఆర్ఎస్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం కోడి రాంబాబు తెలిపారు. వారిలో నైమిష 588, ఎల్.దుర్గ 586, వి.జ్యోతి 583, ఎం.త్రిష 580 మార్కులు సాధించారన్నారు. కేజీబీవీ విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ గంగాకుమారి తెలిపారు. వారిలో ఏడుగురికి 500 మార్కులు దాటాయన్నారు. పండిట్ నెహ్రూ స్కూల్‌లో 72 మంది విద్యార్థులకు 55 మంది పాసయ్యారని హెచ్ఎం శ్రీదేవి తెలిపారు.

News April 24, 2024

అల్లూరి: లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

image

అల్లూరి జిల్లా పోలీసుల ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను డీఐజీ విశాల్ గున్ని వెల్లడించారు. సీపీఐ మావోయిస్టు యూజీ క్యాడర్‌కి చెందిన ఆరుగురు పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయారన్నారు. గతంలో వీరిపై రూ.19 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్ సిన్హా, తదితర అధికారులు పాల్గొన్నారు.

News April 24, 2024

10th RESULTS: ఉమ్మడి విశాఖలో అమ్మాయిలదే పైచేయి

image

➤ విశాఖలో 14,932 మంది బాలురుకు 90.07%తో 13,449 మంది పాసయ్యారు. 13,362 మంది బాలికలకు 92.35%తో 12,345 మంది ఉత్తీర్ణత సాధించారు.
➤ అనకాపల్లిలో 10,820 మంది బాలురుకు 86.73%తో 9,384 మంది పాసయ్యారు. 10,349 మంది బాలికలకు 91.45%తో 9,464 మంది ఉత్తీర్ణత సాధించారు.
➤ అల్లూరిలో 4,958 మంది బాలురుకు 88.77%తో 4,401 మంది పాసయ్యారు. 5,865 మంది బాలికలకు 92.79%తో 5,442మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 24, 2024

విశాఖ@8..అల్లూరి@9..అనకాపల్లి@12 స్థానం

image

➤ విశాఖ జిల్లాలో మొత్తం 28,299 మందికి 25,794 మంది పాసయ్యారు. 91.15 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. (గతేడాది 76.66% ఉత్తీర్ణత)
➤ అల్లూరి జిల్లాలో 10,823 మందికి 9,843 మంది పాసయ్యారు. 90.95 ఉత్తీర్ణత %తో 9వ స్థానంలో నిలిచింది. (గతేడాది 61.41% ఉత్తీర్ణత)
➤ అనకాపల్లి జిల్లాలో 21,169 మందికి 18,848 మంది పాసయ్యారు. 89.04 ఉత్తీర్ణత %తో 12వ స్థానంలో నిలిచింది. (గతేడాది 77.74% ఉత్తీర్ణత)

News April 22, 2024

విశాఖ: టీడీపీలో టికెట్లు మార్పు.. వారి నిర్ణయంపై ఉత్కంఠ..!

image

మాడుగుల, పాడేరు అభ్యర్థులను మార్చిన TDP.. వారికి B-ఫామ్‌లు సైతం ఇచ్చేసింది. మాడుగులలో పైలా ప్రసాద్‌‌కు బదులు బండారుకి, పాడేరులో రమేశ్ నాయుడును తప్పించి గిడ్డి ఈశ్వరికి టికెట్లు కేటాయించింది. కొత్త అభ్యర్థులు ఈరోజు నామినేషన్ వెయ్యనున్నారు. అయితే ఇప్పటికే ప్రసాద్, రమేశ్ నామినేషన్లు వేశారు. పాడేరులో రెబల్ అభ్యర్థిగా రమేశ్ నాయుడు పోటీలో ఉంటారని వార్తలు వస్తుండగా.. పైలా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

News April 22, 2024

ఉమ్మడి విశాఖలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

➤ ఎం.శ్రీభరత్(టీడీపీ): విశాఖ ఎంపీ
➤ వంగలపూడి అనిత(టీడీపీ), కంబాల జోగులు(వైసీపీ): పాయకరావుపేట ఎమ్మెల్యే
➤ బండారు సత్యనారయణ(టీడీపీ): మాడుగుల ఎమ్మెల్యే
➤ బూడి ముత్యాలనాయుడు: అనకాపల్లి ఎంపీ
➤ గిడ్డి ఈశ్వరి(టీడీపీ): పాడేరు ఎమ్మెల్యే
➤ కొత్తపల్లి గీత(బీజేపీ): అరకు ఎంపీ
➤ రేగం మత్స్యలింగం(వైసీపీ): అరకు ఎమ్మెల్యే
➤➤ వీరితో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

మే 10న సింహాచలం చందనోత్సం

image

ప్రతి ఏటా సింహాచలం ఆలయంలో నిర్వహించే చందనోత్సవం కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి అన్నారు. వచ్చే నెల 10న నిర్వహించే చందనోత్సవం కార్యక్రమానికి స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

News April 22, 2024

సింహాచలం అప్పన్న సన్నిధిలో పండిత సదస్సు

image

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆదివారం రాత్రి పండిత సదస్సును వైదిక వర్గాలు సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులు సింహాద్రి అప్పన్న శ్రీదేవి భూదేవిని కొనియాడుతూ కీర్తించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, అదనపు కమిషనర్ చంద్రకుమార్ పాల్గొన్నారు.

News April 21, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

అచ్చుతాపురం మండలంలో కరెంట్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. రామన్నపాలెంకి చెందిన ధర్మిరెడ్డి శ్రీను (42) తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌లో విద్యుత్ వైర్లు తగిలించే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బుచ్చిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 21, 2024

విశాఖ: ఏడుసార్లు పోటీ.. నాలుగుసార్లు గెలుపు

image

మాడుగుల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు బీ-ఫారమ్ అందజేసిన సంగతి తెలిసిందే. ఏడుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన.. నాలుగు సార్లు గెలిచారు. 1989, 1994 ,1999, 2004లో పరవాడ నుంచి పోటీ చేసి.. మూడుసార్లు గెలుపొందగా 2004లో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009, 2014, 2019లో పెందుర్తి నుంచి పోటీచేయగా.. 2014లో గెలిచారు. 1997-98లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.