Visakhapatnam

News April 4, 2024

అల్లూరి జిల్లాలో 67 శాతం పింఛన్లు పంపిణీ

image

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 67 శాతం పింఛన్లు పంపిణి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

News April 4, 2024

భీమిలిలో దారుణం.. వ్యక్తికి నిప్పంటించిన దుండగులు

image

భీమిలి చిన్న ఉప్పాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చెప్పల నాగభూషణం అలియాస్ జాన్ (35) బీచ్ రోడ్ సమీపంలో సూపర్వైజర్‌గా పని చేస్తూ భార్యాపిల్లలతో చేపలుప్పాడలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు నాగభూషణంకు నిప్పంటించడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బందువులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2024

విశాఖ: ‘ఎన్నికల సిబ్బంది తరగతులకు హాజరు కావాలి’

image

ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ర్యాండమైజేషన్ ప్రక్రియను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాలకు అధికారులు సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ఎన్నికల అధికారులు సిబ్బంది ఈనెల 10, 12వ తేదీల్లో నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరుకావాలని అన్నారు.

News April 4, 2024

విశాఖ: 15 నుంచి సముద్ర జలాల్లో చేపలవేట నిషేధం

image

సముద్ర జలాల్లో ఈనెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపలవేటపై నిషేధం విధించామని మత్స్యశాఖ సహాయ సంచాలకులు విజయకృష్ణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మత్స్యవేట సాగిస్తే ఏపీఎంఎస్ఆర్ చట్టం ప్రకారం శిక్షార్హులన్నారు. మత్స్యసంపద సహా బోటును స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తామన్నారు. ఆయిల్ రాయితీని కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

News April 4, 2024

విశాఖ: జంతు పురావాస కేంద్రానికి ఎలుగుబంటి తరలింపు

image

శ్రీకాకుళం జిల్లా అడవుల్లో అటవీ శాఖ అధికారులకు చిక్కిన ఎలుగుబంటిని విశాఖ జూలో గల జంతు పునరావాస కేంద్రానికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా అడవుల నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ ఎలుగుబంటిని ఆ జిల్లా అటవీ డివిజన్ అధికారులు, విశాఖ జూ రెస్క్యూ టీం సభ్యులు దానిని పట్టుకుని విశాఖ ఏఆర్సీ కేంద్రానికి తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్ తెలిపారు. వైద్యులు దానికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారని అన్నారు.

News April 4, 2024

విశాఖ: దళితుని శిరోముండనం కేసులో వాదనలు పూర్తి

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళితుని శిరోముండనం కేసులో తుది వాదనలు బుధవారంతో పూర్తయ్యాయి. ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇతర నిందితులు విశాఖ జిల్లా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధిక న్యాయస్థానంలో హాజరయ్యారు. నిందితుల తరఫున కె.వి రామమూర్తి వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు ఇవ్వడానికి న్యాయమూర్తి శ్రీధర్ ఈ కేసును ఈనెల 12వ తేదీకి వాయిదా వేశారు.1996 డిసెంబర్ 29న ఈ సంఘటన జరిగింది.

News April 4, 2024

విశాఖ: నర్సింగ్ కాలేజీలో వేధింపులపై CMOకి ఫిర్యాదు

image

కింగ్‌జార్జి ఆస్పత్రిలోని నర్సింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌తో పాటు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఓ విద్యార్థిని CMOకి ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. కేజీహెచ్‌ నర్సింగ్‌ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న తనను కాలేజీలో ర్యాగింగ్‌ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిన్సిపాల్‌, ఇతర సిబ్బంది కూడా ర్యాగింగ్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.

News April 4, 2024

పెందుర్తి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ వ్యాన్‌ని లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 4, 2024

మునగపాక: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ములబంద గోడీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన దాడి వెంకట అప్పారావు (57) పొలంలోని చెరకు క్రషింగ్ పూర్తి కావడంతో క్రషర్, బెల్లం పెనాన్ని బుధవారం సాయంత్రం తన కుమారుడు చందు, మరో రైతు ఆడారి చిన అప్పారావు సహాయంతో శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలో విద్యుత్ తీగకు పెనం తగిలింది. దీంతో ముగ్గురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రమాదంలో వెంకట అప్పారావు అక్కడికక్కడే మృతిచెందారు.

News April 3, 2024

విశాఖ: షిప్ యార్డ్‌ను సందర్శించిన ఈఎన్‌‌సీ చీఫ్ 

image

తూర్పు నావికాదళపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ బుధవారం హిందుస్థాన్ షిప్ యార్డ్ ను సందర్శించారు. షిప్ యార్డ్ సిఎండి కమడోర్ హేమంత్ ఖాత్రి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో హెచ్ఎస్ఎల్ చేపట్టనున్న భవిష్యత్తు ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వివరించారు. అలాగే సంస్థ విస్తరణకు సంబంధించిన విశదీకరించారు.