India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల నిబంధనల మేరకు సామాజిక పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్‌లు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సచివాలయాల్లో అందజేస్తారన్నారు. పింఛనుదారులు ఆధార్ కార్డు తీసుకొని సచివాలయానికి రావాలన్నారు. 7వ తేదీ వరకు ఉదయం 7.30 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ జరుగుతుందన్నారు.
విశాఖలో బుధవారం జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.
నక్కపల్లి మండలం వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ సమీపంలో కబేళాకు గోవులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ మోహన్, నక్కపల్లి సీఐ విజయ్ కుమార్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక కంటైనర్ తనిఖీ చేయగా.. అందులో 65 గోవులున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కంటైనర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
కొమ్మాదిలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 28న విద్యార్థిని మృతి కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్.శంకర్రావు, మేనేజ్మెంట్ సిబ్బంది శంకర్ వర్మ, కళాశాల ప్రిన్సిపల్ జి.భాను ప్రకాష్, హాస్టల్ వార్డెన్ వి.ఉషారాణి, ఆమె భర్త ప్రదీప్ కుమార్ ఉన్నారని పేర్కొన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి తొలి విడతలో ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా విశాఖ, అనకాపల్లి, అరకు ఎంపీ అభ్యర్థులతో పాటు మరో 9 నియోజకవర్గల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
✒ విశాఖ ఈస్ట్- గుత్తుల శ్రీనివాసరావు
✒ మాడుగుల- బీబీఎస్ శ్రీనివాసరావు
✒ పాడేరు(ST)- శటక బుల్లిబాబు
✒ అనకాపల్లి- ఇల్లా రామ గంగాధరరావు
✒ పెందుర్తి- పిరిడి భగత్
✒ పాయకరావుపేట(SC)- బోని తాతారావు
విశాఖ లోక్‌సభ స్థానం 1952లో ఏర్పడింది. ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 ఎన్నికల్లో ద్విసభ విధానంతో ఇద్దరు ఇండిపెండెంట్‌లు గెలుపోందారు. 1984 ఎన్నికల్లో TDP నుంచి భాట్టం శ్రీరామమూర్తి అత్యధిక మెజారిటీ 1,40,431 నమోదుకాగా, 2019లో YCP నుంచి MVV సత్యనారాయణ అత్యల్ప మెజారిటీ 4,414 నమోదయ్యింది. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
సామాజిక పింఛన్లను ఈనెల మూడవ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సామాజిక పింఛన్లు గ్రామ వార్డు సచివాలయాలు సిబ్బంది పంపిణీ చేస్తారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వలంటీర్ల వద్ద ఉన్న ఫోన్లు బయోమెట్రిక్ పరికరాలను పంచాయతీ కార్యదర్శిలకు వెంటనే అందజేయాలన్నారు.
ప్రశాంతంగా ఉండే విశాఖను ఫ్యాక్షన్ అడ్డాగా మార్చారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో రెల్లి వీధిలో కత్తులు పట్టుకుని తిరుగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని ధ్వజమెత్తారు. భూ దందాల్లో రౌడీ షీటర్లదే రాజ్యంగా మారిందని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. విశాఖలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు.
విశాఖ నగరం రుషికొండ బీచ్ సమీపంలో గల సముద్ర తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు వివిధ ఆకారాల్లో ఉన్న రెండు బవిరి చేపలు చిక్కాయి. వీటి వెన్నుపై ఒక ముల్లు ముందు భాగంలో రెండు ముళ్లు ఉన్నాయి. సముద్రం లోపల సంచరించే ఈ చేపలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు ముందుకు వస్తుంటాయని మత్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే విశాఖలోని పెదజాలరిపేటలో జీవీఎంసీ కల్యాణ మండపాన్ని ప్రారంభించిన విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు నమోదు చేశామని తూర్పు రిటర్నింగ్ అధికారి, జేసీ మయూర్ అశోక్ తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 10 కేసులు నమోదు చేశామన్నారు. రూ.1.20 లక్షలు, 42 చీరలు, బీఎస్పీకి చెందిన ఒక ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.