India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయగడ నుంచి విశాఖ వచ్చిన రైలులో బుధవారం ఓ గర్భిణి ప్రసవించింది. మతిస్థిమితం లేని మహిళకు పురుటి నొప్పులు రాగా.. రైల్వే పోలీసులు 108కు సమాచారం అందించారు. స్పందించిన కంచరపాలెం 108 మెడికల్ టెక్నీషియన్ శైలజ, పైలెట్ అప్పారావు హుటాహుటిన రైలు వద్దకు వెళ్లి.. నొప్పులు ఎక్కువ కావడంతో రైలులోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లీ బిడ్డలను కేజీహెచ్‌కు తరలించారు. 108 జిల్లా కో-ఆర్డినేటర్ సురేష్ వారిని అభినందించారు.
భారత్–యూఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంప్–2024 విన్యాసాల్లో పాల్గొనేందుకు యూఎస్‌కు చెందిన యుద్ధ విమానాలు బుధవారం ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకున్నాయి. ఈ అధునాతన, బహుముఖ యుద్ధ విమానాలు భారత నావికాదళం, వైమానిక దళాలతో కలిసి విన్యాసాలు చేయనున్నాయి. భారత్, యూఎస్ రక్షణ రంగ సంబంధాలు మరింత పెంపొందించేందుకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు.
తనకు ఇవే చివరి ఎన్నికలని.. గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వాలంటూ నర్సీపట్నం నియోజకవర్గ TDP అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రజలను కోరారు. బుధవారం రామన్నపాలెం పంచాయతీ శివారు వెంకయ్యపాలెంలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని విధిగా పాటించాలని విశాఖ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి మల్లికార్జున సూచించారు. సిరిపురం చిల్డ్రన్ ఏరీనాలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులకు ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రచారంలో అరుదైన ఘటన నెలకొంది. విశాఖలోని జీవీఎంసీ 19వ వార్డు ఎంపీపీ కాలనీ సెక్టార్ 12లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంవీవీ జయభారత్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణను కలిసి తమకు మద్దతు తెలపాలని ఆయనకు పార్టీ కరపత్రాన్ని ఇచ్చి ఎంవీవీ అభ్యర్థించారు.
భారత్ అమెరికా దేశాల మధ్య భాగస్వామ్యానికి అనుగుణంగా విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో నౌకా దళం,వాయుసేన విన్యాసాలు ప్రారంభమైనట్లు అమెరికా రాయబారి ఎరిక్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ తెలిపారు. మంగళవారం లాంచనంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు విన్యాసాలు కొనసాగుతున్నారు. ఇది దేశాలకు చెందిన 3000 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలదని మంత్రి, గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక వడ్లపూడిలో ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజేపీ సిద్ధపడిందని, అలాంటి పార్టీతో టీడీపీ, జనసేన చేతులు కలిపాయన్నారు. వైసీపీకి ఓటు వేసి కూటమికి బుద్ధి చెప్పాలన్నారు.
యలమంచిలి మండలం పులపర్తి హైవే జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం వొమ్మవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షేక్ మీరా సాహెబ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు.
రాష్ట్ర ప్రజలు ఎవరి పక్కన ఉన్నారో త్వరలో తెలుస్తుందని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. అనకాపల్లి ఎంపీ సీటు ప్రకటించేందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఈనెల 27 నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నమ్మినవారు తమ పార్టీలోకి వస్తున్నట్లు తెలిపారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నగరంలో రూ.500కోట్ల విలువైన క్రైస్తవ భూములను ఆక్రమించినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. విశాఖ నగరం ప్రజాశాంతి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆయనపై కేసు వేసి జైలుకు పంపిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.