Visakhapatnam

News April 5, 2024

గోపాలపట్నం: ఎండ వేడి తాళలేక వృద్ధుడి మృతి

image

జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్‌కి చెందిన తీడ బాబూరావు (65) కాకినాడలోని తన సోదరుడి వద్ద ఉంటున్నాడు. విశాఖలోని వార్డు సచివాలయం(482) పరిధిలో ప్రతి నెలా పింఛను పొందుతున్నాడు. ఈనెల పింఛను కోసం గురువారం కాకినాడ నుంచి విశాఖ వచ్చి, గోపాలపట్నంలోని సచివాలయం వద్దకు వెళ్తున్నాడు. ఇంతలో బీఆర్టీఎస్ రోడ్డులో ఎండ తీవ్రతకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2024

మాధవధార: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

image

పాత ఐటీఐ హ్యాపీ హోమ్స్‌లో నివాసం ఉంటున్న వరాహ గిరి మురళీధర్ (19) ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్నాడు. కొద్దిరోజులుగా సక్రమంగా చదవలేక పోతున్నానని మనస్తాపం చెందాడు. గురువారం సాయంత్రం ఫోన్లో మాట్లాడతానని అపార్ట్మెంట్‌పై అంతస్తుకు వెళ్లి కిందకు దూకేశాడు. స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న అతడిని KGHకి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు కంచరపాలెం పోలీసులు తెలిపారు.

News April 5, 2024

విశాఖ: నేడు, రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో శుక్ర, శనివారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని 25 మండలాల్లో తీవ్రవడగాలులు, 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శనివారం 23 మండలాల్లో తీవ్ర, మరో 18 మండలాల్లో వడగాలులు వీయొచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 5, 2024

విశాఖ: రెండు పశువుల వాహనాలు పట్టివేత

image

పాయకరావుపేట మండలం సీతారాంపురం జంక్షన్ వద్ద గురువారం రాత్రి 9 గంటలకు అక్రమంగా 45 పశువులను రవాణా చేస్తున్న బొలెరో వాహనాన్ని, కంటైనర్‌ను ఎస్సై జోగారావు నేతృత్వంలో సిబ్బంది పట్టుకున్నారు. కంటైనర్‌లో 37 పశువులు, బొలెరో వాహనంలో 8 పశువులను బంధించి రవాణా చేస్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నామని చెప్పారు. గోవులను గోశాలకు తరలించి, రెండు వాహనాల డ్రైవర్లు, పశువులను విక్రయించిన యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.

News April 4, 2024

విశాఖ డీసీపీకి బదిలీ 

image

విశాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్-1 మణికంఠ చందోలును ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఇటీవలే ఆయన విశాఖ డీసీపీగా బదిలీపై వచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మణికంఠను చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ చేసింది. మణికంఠ చందోలు 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.

News April 4, 2024

అల్లూరి జిల్లాలో 67 శాతం పింఛన్లు పంపిణీ

image

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 67 శాతం పింఛన్లు పంపిణి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

News April 4, 2024

భీమిలిలో దారుణం.. వ్యక్తికి నిప్పంటించిన దుండగులు

image

భీమిలి చిన్న ఉప్పాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చెప్పల నాగభూషణం అలియాస్ జాన్ (35) బీచ్ రోడ్ సమీపంలో సూపర్వైజర్‌గా పని చేస్తూ భార్యాపిల్లలతో చేపలుప్పాడలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు నాగభూషణంకు నిప్పంటించడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బందువులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2024

విశాఖ: ‘ఎన్నికల సిబ్బంది తరగతులకు హాజరు కావాలి’

image

ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ర్యాండమైజేషన్ ప్రక్రియను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాలకు అధికారులు సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ఎన్నికల అధికారులు సిబ్బంది ఈనెల 10, 12వ తేదీల్లో నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరుకావాలని అన్నారు.

News April 4, 2024

విశాఖ: 15 నుంచి సముద్ర జలాల్లో చేపలవేట నిషేధం

image

సముద్ర జలాల్లో ఈనెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపలవేటపై నిషేధం విధించామని మత్స్యశాఖ సహాయ సంచాలకులు విజయకృష్ణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మత్స్యవేట సాగిస్తే ఏపీఎంఎస్ఆర్ చట్టం ప్రకారం శిక్షార్హులన్నారు. మత్స్యసంపద సహా బోటును స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తామన్నారు. ఆయిల్ రాయితీని కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

News April 4, 2024

విశాఖ: జంతు పురావాస కేంద్రానికి ఎలుగుబంటి తరలింపు

image

శ్రీకాకుళం జిల్లా అడవుల్లో అటవీ శాఖ అధికారులకు చిక్కిన ఎలుగుబంటిని విశాఖ జూలో గల జంతు పునరావాస కేంద్రానికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా అడవుల నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ ఎలుగుబంటిని ఆ జిల్లా అటవీ డివిజన్ అధికారులు, విశాఖ జూ రెస్క్యూ టీం సభ్యులు దానిని పట్టుకుని విశాఖ ఏఆర్సీ కేంద్రానికి తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్ తెలిపారు. వైద్యులు దానికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారని అన్నారు.