Visakhapatnam

News April 1, 2024

విశాఖపట్నం పోర్టు సరికొత్త రికార్డు

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు సరుకు రవాణాలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 81. 09 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిందని పోస్ట్ చైర్మన్ అంగముత్తు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతి ఏడాది నమోదు చేసిన 73.75 మిలియన్ మెట్రిక్ టన్నుల రికార్డును తిరగరాసిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సృష్టించాలని ఆయన సిబ్బందిని కోరారు.

News April 1, 2024

భీమిలిలో వైసీపీ నేతలు సస్పెండ్

image

వైసీపీలో పదవులు అనుభవిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న భీమిలి జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, శింగనబంద సర్పంచ్ గాడు వెంకటనారాయణను సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. వైసీపీకి వ్యతిరేకంగా ఆదివారం వారు మాట్లాడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మరికొందరిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

News March 31, 2024

పొల్లూరు జలపాతంలో పడి వ్యక్తి మృతి

image

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ మోతుగూడెం పొల్లూరు జలపాతంలో ఓ పర్యాటకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సెలవు కావడంతో తూగో జిల్లా రంగంపేట మండలం సింగంపల్లికి చెందిన కొందరు మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతానికి వచ్చారు. వారిలో కొండయ్య(33) అనే పర్యాటకుడు ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడ్డాడు. స్నేహితులు హుటాహుటీన మోతుగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 31, 2024

విశాఖ దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ రాజకీయ ప్రస్థానం ఇదే 

image

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ను ప్రకటించారు. 2009లో ప్రజారాజ్యం తరుఫున పోటీచేసి ఆయన ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరి 2014లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో 2021లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్‌లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

News March 31, 2024

నేడు విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఢిల్లీ చెన్నై జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం సామర్థ్యం 28,000 కాగా వాహనాల్లో భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు మధురవాడ స్టేడియం వైపు ప్రయాణించకుండా వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News March 31, 2024

అనకాపల్లి ఎంపీకి కీలక బాధ్యతలు

image

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ అబ్జర్వర్‌గా స్థానిక ఎంపీ బి.వి సత్యవతి నియమితులయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ సూచించింది. కాగా.. ఈసారి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడికి అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 

News March 31, 2024

విశాఖ: ‘బాలుడు కరోనాతో చనిపోలేదు’

image

కేజీహెచ్‌లో కరోనాతో బాలుడు చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదని డీఎంహెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. రెండు వారాలుగా మలేరియా పచ్చకామెర్లతో బాలుడు బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. తూ.గో జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడిని ఈనెల 28న కేజీహెచ్‌‌లో చేర్పించినట్లు తెలిపారు. అప్పటికే బాలుడు కీళ్ల వ్యాధికి స్టెరాయిడ్ థెరపి తీసుకుంటున్నట్లు చెప్పారు. పైవ్యాధులతో బాలుడు చికిత్స పొందుతూ 29న మృతి చెందాడన్నారు.

News March 31, 2024

విశాఖలో కొరియర్ పేరుతో రూ.20 లక్షలు కొట్టేశారు

image

ఫెడెక్స్ కొరియర్ పేరుతో నగరానికి చెందిన వ్యక్తికి రూ.20 లక్షలకు టోకరా వేసిన ఐదుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముంబై నుంచి తైవాన్‌కు చేసిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఒక వ్యక్తికి నేరగాళ్లు ఫోన్ చేశారు. తాను కొరియర్ చేయలేదంటూ చెప్పగా.. సదరు వ్యక్తి అడ్రస్, ఇతర వివరాలు కరెక్ట్‌గా చెప్పడంతో భయపడ్డాడు. బ్యాంక్ ఖాతా తనిఖీ చేయాలని చెప్పి రూ.20 లక్షలు కాజేశారు.

News March 31, 2024

విశాఖ: ప్రవేశాల గడువు పొడిగింపు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రభుత్వ గురుకుల సొసైటీకి చెందిన గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువును పొడిగించారు. రానున్న విద్యాసంవత్సరంలో భీమిలి, అచ్యుతాపురం బాలికలు, నర్సీపట్నం బాలుర గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 25న జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయని పరీక్షల ఉమ్మడి విశాఖ జిల్లా కో-ఆర్డినేటర్ రాంబాబు పేర్కొన్నారు.

News March 31, 2024

నేడే చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌

image

చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఆదివారం జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కు పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఊపుమీదున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ప్రవేశ ద్వారాల వద్ద వైఫైతో కూడా స్కానర్‌ బోర్డులను ఏర్పాటుచేశారు. మ్యాచ్‌ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.