Visakhapatnam

News March 29, 2024

అనకాపల్లి: ‘మాదకద్రవ్యాల రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు’

image

అనకాపల్లి జిల్లాలో‌ మద్యం, మాదక ద్రవ్యాల రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి తెలిపారు. గురువారం తాడేపల్లి నుంచి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనకాపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీ మురళి కృష్ణ పాల్గొన్నారు.

News March 28, 2024

నక్కపల్లి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

నక్కపల్లి మండలం గుల్లిపాడు, నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్ల మధ్య మృతదేహం లభ్యమయ్యింది. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి గురువారం ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తుని రైల్వే ఎస్సై షేక్ అబ్దుల్ మరూఫ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలుంటాయని, అతని వివరాలు తెలియలేదన్నారు. తుని ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచామని చెప్పారు.

News March 28, 2024

విశాఖ: తమ్ముడి కోసం అక్క.. భర్తల కోసం భార్యలు

image

ఉమ్మడి విశాఖలోని అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. విశాఖ తూర్పు TDP అభ్యర్థి వెలగపూడి తరఫున ఆయన భార్య సుజన, పశ్చిమ YCP అభ్యర్థి ఆనంద్ కుమార్ తరఫున ఆయన సోదరి రమాకుమారి, అనకాపల్లి YCP అభ్యర్థి మలసాల భరత్ కుమార్‌కు మద్దతుగా ఆయన భార్య ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అటు బీజేపీ MP అభ్యర్థి సీఎం రమేశ్ సోదరుడు సురేశ్, తనయుడు రితీష్‌ అనకాపల్లిలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు.

News March 28, 2024

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థిగా హిజ్రా  

image

సామాజిక న్యాయం కోసం ఏపీలో పోటీ చేసేందుకు ముందుకు వచ్చామని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజ్ వాదీ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా హిజ్రా సూరాడ ఎల్లాజీని ప్రకటించామన్నారు. హిజ్రాకు టికెట్ ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని, సామాజిక న్యాయం కోసం అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

News March 28, 2024

విశాఖ ఎయిర్ పోర్ట్ సరికొత్త రికార్డు

image

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక మంది ప్రయాణికుల రాకపోకలను సాగించిన ఎయిర్‌పోర్టుగా రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాదిలో
ఇప్పటి వరకు 29 లక్షల మంది రాకపోకలతో ఈ రికార్డును సృష్టించింది. ఇంత వరకు 2018లో 28.54 లక్షల మంది ప్రయాణించడమే అత్యధికంమని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని 3.6 మిలియన్లకు పెంచారు.

News March 28, 2024

విశాఖ: అక్రమంగా తాబేళ్ల రవాణా

image

నిషేధిత తాబేళ్లను రవాణా చేస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. షాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో నక్షత్రపు తాబేళ్లు రవాణా చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందడంతో బుధవారం విశాఖ రైల్వేస్టేషన్‌లో నిఘా పెట్టారు. ఇద్దరు అనుమానితులను తనిఖీల్లో 396 నక్షత్రపు తాబేళ్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పశ్చిమ బెంగాల్‌ నుంచి తమిళనాడుకు రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు.

News March 28, 2024

విశాఖ: సముద్రంలో డీజిల్ కొట్టేసే ముఠా అరెస్ట్ 

image

సముద్రంలోని నౌకల నుంచి డీజిల్ స్మగ్లింగ్ చేసే ముఠా సభ్యులు వీర్రాజు, బడే రాజు, సూరాడ రాములును అరెస్టు చేసినట్లు డీసీపీ-2 ఎం.సత్తిబాబు తెలిపారు. సముద్రంలో ఉన్న నౌకల నుంచి డీజిల్ దొంగలించి బోట్లు ద్వారా తీరానికి తీసుకువచ్చి వారు విక్రయిస్తున్నట్లు తెలిపారు. సుమారు 13 మంది నౌకల నుంచి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. వీరిలో ముగ్గురు పట్టుబడుగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు.

News March 28, 2024

విశాఖ: డీసీఐ కేసు ఏప్రిల్‌ 11కు వాయిదా

image

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కేసును హైకోర్టు ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది. అన్యాయంగా తొలగించారని తన కేసు తేలాకే కొత్త ఎండీ, సీఈఓ నియామకం నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలనీ పాత ఎండీ జార్జి విక్టర్‌ కేసు వేశారు. ఆ మేరకు నియామకంపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని డీసీఐ వాదించింది. ఈ కేసులో తీర్పును ఏప్రిల్‌ 11న వెలువరిస్తామని విచారణను హైకోర్టు వాయిదా వేసినట్టు డీసీఐ వర్గాలు తెలిపాయి.

News March 28, 2024

విశాఖ నుంచి నాలుగు కొత్త విమాన సర్వీసులు

image

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి కొత్తగా నాలుగు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశీయ సర్వీసుల్లో ఈ నెల 31 నుంచి విశాఖపట్నం–ఢిల్లీ మధ్య ఎయిర్‌ ఇండియా, విశాఖపట్నం–హైదరాబాద్‌ మధ్య ఇండిగో విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ సర్వీసుల్లో విశాఖ–బ్యాంకాక్‌(థాయ్‌లాండ్‌) విమానం ఏప్రిల్‌ 9 నుంచి, విశాఖ–కౌలాలంపూర్‌ (మలేసియా) విమానం ఏప్రిల్‌ 26 నుంచి మొదలవుతుంది.

News March 28, 2024

విశాఖ: ‘ఆర్ఓలు బాధ్యతగా వ్యవహరించాలి’

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఆర్ఓ కూడా తమ విధులను బాధ్యతగా వ్యవహరించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ బృందాలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.