India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన మహిళను మోసం చేసిన కేసులో సీతయ్యపేట వాసి దివనాపు అఖిల్ అంబేత్కర్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందల్ గురువారం తెలిపారు. నిందితుడు పాచిపెంటకు చెందిన మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి,శారీరకంగా అనుభవించి మోసం చేశాడనే ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు. ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టగా నిందితుడికి శిక్ష ఖరారు అయిందన్నారు.
ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నిర్వహించిన జాతీయస్థాయి డెడ్ లిఫ్ట్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో వన్ టౌన్ ASI త్రినాథ్, విశ్రాంత HC శంకర్రావు పతకాలు సాధించారు. వారు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP వకుల్ జిందల్‌ను కలిశారు. ఎస్పీ వాళ్ల ప్రతిభను అభినందించి క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. 4 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు.
ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు. రెండుపూటలా కనీసం 6 గంటలు పనులు చేయించాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సింహాచలం, బి.జోగినాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో శనివారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీలు చేసి స్పోజ్ కేటగిరీలో ఎంటీఎస్ టీచర్లను పరిగణించాలన్నారు. 1998/2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీలు కూడా రెగ్యులర్ టీచర్లతో చేయాలన్నారు. సింగిల్ టీచర్ పాఠశాలలకు రెండో టీచర్‌ను నియమించాలన్నారు.
భోగాపురం మండలంలోని పోలిపల్లి, కౌలువాడ, లింగాలవలసలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డ్వామా పీడీ శారదా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఏపీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.
వేపాడ మండలం చామలాపల్లి నుంచి వెంకయ్యపాలెం వెళ్లే రహదారిలో అరిగివాని చెరువు కల్లాల వద్ద గిరినాగు శుక్రవారం రాత్రి కనిపించింది. స్థానిక రైతులు గుర్తించి వన్యప్రాణుల సంరక్షణ సమితి ప్రతినిధి వరపుల కృష్ణకు సమాచారం అందించారు. కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని 16 అడుగుల గిరినాగును గోనెసంచిలో బంధించాడు. ఉదయాన్నే అటవీ ప్రాంతంలో వదిలేస్తామని చెప్పటముతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
వైసీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గుర్ల, గజపతినగరం, గంట్యాడ, గరివిడి జడ్పీటీసీలు శీర అప్పల నాయుడు, గార తవుడు, వి.నరసింహమూర్తి, వాకాడ శ్రీనివాసరావు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గురువారం కలిశారు. వైసీపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారని జడ్పీటీసీలు తెలిపారు. మాజీ సీఎంను కలిసిన వారిలో రాజాం నియోజకర్గ ఇన్ ఛార్జ్ తలే రాజేశ్ కూడా ఉన్నారు.
రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన కర్రి దుర్గాప్రసాద్ (15) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అవుతానని భయంతో ముందే ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యులు సాలూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కాగా నిన్న వెలువడిన ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.
జిల్లా ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన శ్రీకాకుళంలో RIOగా DOEOగా, మన్యం జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇంటర్ విద్యలో RIO, DOEO పోస్టులను కలిపి జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారి పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.
విజయనగరం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు ఫిర్యాదు వచ్చింది. టూ టౌన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి 17 ఏళ్ల అమ్మాయిని రక్షించారు. దీంతో ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ని బుధవారం అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.
Sorry, no posts matched your criteria.