India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింహాచల దేవస్థానం పంచ గ్రామాల భూముల క్రమబద్దీకరణపై అశోక్ తో చర్చించారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్, తదితరులు అశోక్ ను కలిసిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
డెంకాడ మండలం చింతలవలస ACA క్రికెట్ అకాడమి స్టేడియంలో విదర్భ, పాండిచ్చేరి మధ్య జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీను మాజీ మంత్రి, ఏపీ అటవీ అభివృద్ది కార్పొరేషన్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు బుధవారం తిలకించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు వాళ్లతో ముచ్చటించారు. కార్యక్రమంలో ACA కార్యదర్శి సానా సతీష్ పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లాలో విజయనగరం స్వాముల బస్సుకు ప్రమాదం జరిగిన <<14721893>>విషయం తెలిసిందే<<>>. లారీ డ్రైవర్ మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశాడని క్షతగాత్రులు తెలిపారు. సోమవారం విజయనగరం నుంచి బస్సు బయలుదేరింది. క్షతగాత్రులు సత్యారావు, రామారావు, సత్యనారాయణ, శ్రీధర్, ఉమా మహేశ్వర్, ధనుంజయ్ విజయనగరం వాసులుగా తెలిపారు.
విజయనగరం జిల్లా నుంచి బయలు దేరిన అయ్యప్ప స్వాముల బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో వీరి బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురిని కడప రిమ్స్‌కు తరలించారు. స్వల్ప గాయాలైన 19 మందిని డిశ్చార్జ్ చేసినట్టు డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మూగజీవాలను హింసించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సబ్ DFO సంజయ్ తెలిపారు. పార్వతీపురం మండలం బండి ధర వలస గ్రామానికి చెందిన ఎస్.నరసింహరావు, ఏ.నానిబాబు ఉడుమును చంపారని తెలిపారు. చంపి వాటిని తింటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. అటువీ శాఖ ఆధ్వర్యంలో మూగజీవాలను హింసించే చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కోమటిపల్లి, రాయగడ, విజయనగరం మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-కోరాపుట్(08546) ప్యాసింజర్‌ను అధికారులు రద్దు చేశారు. ఈనెల 29 నుంచి వచ్చే నెల 4వతేదీ వరకు ప్యాసింజర్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కోరాపుట్- విశాఖపట్నం ఈనెల 29 నుంచి డిసెంబర్ 5 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. భోగాపురం మండలం గూడెపువలసకి చెందిన రమేశ్ (25) విజయనగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ముందున్న బొలేరోని ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై డెంకాడ ఎస్.ఐ ఏ. సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు.
ఐపీఎల్ మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అయితే వేలంలో అతనికి చుక్కెదురయ్యింది. ఏ ఫ్రాంఛైజీ తనను తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీంతో విజయనగరం వాసులు, అభిమానులు నిరాశ చెందారు.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం జీసిసిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని దీని బలోపేతానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆ సంస్థ రాష్ట్ర ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. విజయనగరంలో సబ్బుల తయారీ యూనిట్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రైవేటు సరుకులు మాదిరిగా డిసిసి సరుకులు జనాలను ఆకర్షించే విధంగా నాణ్యతతో తయారు చేస్తామని చెప్పారు.
విజయనగరం నుంచి అరకు మీదుగా పాడేరుకు త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర చెప్పారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి పర్యాటకులు, ఉద్యోగులు అరకు, పాడేరు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని వారికి ఈ బస్సు వల్ల ప్రయాణం సులభతరమవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.