Vizianagaram

News November 25, 2024

IPL వేలంలో యశ్వంత్‌కు నిరాశ

image

రెండో రోజు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్‌కు నిరాశ ఎదురైంది. త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్‌కు రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో యశ్వం‌త్ తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. తీసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజ్‌లు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

News November 25, 2024

VZM: 40 మందికి ఎస్ఐ అర్హత పరీక్షలు

image

కైలాసగిరి ఆర్మడ్ రిజర్వు కార్యాలయంలో విశాఖ రేంజ్ పరిధిలో 40 మంది ఏఎస్ఐలకు ఎస్ఐ అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఈ పరీక్షలు జరగుతున్నాయి. సోమవారం రాత పరీక్షలు నిర్వహించగా మంగళవారం అవుట్ డోర్, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్లైన వారు డిసెంబర్ 2 నుంచి తిరుపతిలో జరిగే ఎస్ఐ ట్రైనింగ్‌కు వెళతారు.

News November 25, 2024

గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం: మంత్రి

image

గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు సాలూరు మండలం కారాడవలస గ్రామంలో కంటైనర్ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం వైద్యాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కంటైనర్ ఆసుపత్రుల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

News November 24, 2024

VZM: పిక్నిక్ స్పాట్స్ వద్ద నిఘా

image

పార్వతీపురం, విజయనగరం ఎస్పీల ఆదేశాలతో పర్యాటక ప్రాంతాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద పోలీసులు ఆదివారం బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తోటపల్లి, అడ్డాపుశీల, సీతంపేట, అడలి, పుణ్యగిరి, తాటిపూడి, రామతీర్థం, సారిపల్లి, రామనారాయణం, గోవిందపురం తదితర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకున్నారు. మరి మీరు ఈరోజు ఎక్కడికి పిక్నిక్‌కు వెళ్లారో కామెంట్ చెయ్యండి.

News November 24, 2024

IPL వేలంలో మన విజయనగరం కుర్రాడు

image

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. మన జిల్లా వాసిగా యశ్వంత్ ఐపీఎల్‌కు ఎంపిక కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

News November 24, 2024

VZM: ఒంటరితనం భరించలేక మహిళ సూసైడ్

image

బాడంగి మండలం కోడూరు పంచాయతీకి చెందిన గౌరమ్మ(55) శనివారం మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గౌరమ్మ భర్త కొంతకాలం క్రితం మృతిచెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరితనంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఈనెల 14న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. మృతురాలి అన్నయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News November 24, 2024

విజయనగరంలో టుడే టాప్ న్యూస్

image

➤విజయనగరం-కోరుకొండ మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి ➤విజయనగరంలో భారీగా పట్టుబడ్డ నిషేధిత ప్లాస్టిక్ ➤జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ ➤తహసీల్దార్ కార్యాలయాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ప్రచురణ ➤అదానీ అరెస్ట్ చేయాలని ఉమ్మడి జిల్లాలో సీపీఐ, సీపీఎం నేతల నిరసన ➤విజయనగరంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు➤జిల్లాలో 3,425 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు

News November 23, 2024

డిసెంబర్ 9లోగా క్లెయిమ్ చేసుకోవాలి: కలెక్టర్ అంబేడ్కర్

image

ఉత్తరాంధ్రా ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాలో క్లెయిమ్స్, అభ్యంతరాలను డిసెంబర్ నెల 9 లోగా సమర్పించవలసి ఉంటుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి డ్రాఫ్ట్ రోల్ ప్రచురణ నవంబర్ 23న జరుగుతుందని, డిసెంబర్ 9 లోగా క్లెయిమ్స్ , అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

News November 23, 2024

VZM: సంక్రాంతి నాటికి జిల్లాలో గుంతలు లేని రోడ్లు

image

విజయనగరం జిల్లాకు 176 రోడ్ల ప‌నులు మంజూరయ్యాయి. రూ.23.51 కోట్ల‌తో ఈ ప‌నులను R&B శాఖ చేప‌డుతుంది. ఇందులో భాగంగా 750 కిలోమీట‌ర్ల రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు జరగనున్నాయి. తొలివిడ‌త‌లో 68 ప‌నులకు రూ.10.54 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిలో ఇప్పటికే 61 ప‌నుల‌కు టెండ‌ర్లు ఖ‌రారయ్యాయి. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 23, 2024

విజయనగరం: మొదట ప్రేమ.. ఆపై చీటింగ్

image

మహిళను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం DSP శుక్రవారం తెలిపారు. గంట్యాడలోని కిర్తిబర్తికి చెందిన వెంకట సత్యం ఓ కళాశాలలో ఫ్యాకల్టీగా చేసేవాడు. అదే కళాశాలలో ఫ్యాకల్టీగా ఉన్న దళిత మహిళకు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.