India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్థానిక PVG రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు ACA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నుంచి ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రోజు అస్సాం–రైల్వేస్, 25న ఒడిస్సా–రైల్వేస్, 27న విదర్భ–పుదిచ్చేరి, 29న చండీగఢ్–ఛత్తీస్‌గఢ్, డిసెంబర్1న అస్సాం–పుదిచ్చేరి, 3న ఛత్తీస్‌గఢ్–విదర్భ, 5న చండీగఢ్–ఒడిశా జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగియడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు శుక్రవారం సందడి చేశారు. మహిళా ఎమ్మెల్యేలందరూ ఓ చోట చేరి సరదాగా గడిపారు. రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిత సెల్ఫీ తీయగా.. ఆమెతో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఫోటో దిగారు.
గంటాడ్య మండలంలోని మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ, దేవి దంపతుల చిన్న కుమార్తె పల్లవి(12) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. బ్రెయిన్ డెడ్ కావడంతో ఇక బతికే అవకాశాలు లేవని వైద్యులు తేల్చేశారు. పుట్టెడు బాధలో ఉన్న ఆ దంపతులు.. తమ చిట్టితల్లి మరొకరికి ప్రాణదాత అవుతుందని భావించారు. కుమార్తె అవయవాలు దానం చేసేందుకు అంగీకరించి, మానవత్వాన్ని చాటుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేల జాడ కనిపించడం లేదు. కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సొంతపార్టీ నుంచే వినిపిస్తున్నాయి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సైతం ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదని సమాచారం. పదవిలో ఉన్న ఎమ్మెల్సీ పెనుమత్స కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.
ఇకపై ప్రతి సోమవారం మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని JC సేతు మాధవన్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంపీడీవో, తహసిల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తదితరులతో కూడిన మండల స్థాయి సమన్వయ కమిటీ నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
జిల్లాలో ఉన్న రామతీర్థం దేవస్థానాన్ని తీర్థయాత్ర పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఇటీవల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రామతీర్థంలో మ్యూజియం, కేఫ్ టేరియా, వ్యూ పాయింట్లు, రోప్‌వే నిర్మాణం, లైటింగ్, బౌద్ధ ప్రదేశాల వద్ద వసతులు, కోనేరు రహదారి విస్తరణ వంటి పనులకు అధికారులు త్వరలో ప్రతిపాదనలు తయారు చేయనున్నారు.
జిల్లాలో ఏర్పాటవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును పెడుతున్నట్లు ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లూరి సేవలను గుర్తు చేసుకున్నారు.
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. విశాఖ ఐటీ హిల్స్‌పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్‌ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
విశాఖతో పాటు విజయనగరం విజ్జీ స్టేడియంలో ఈనెల 23 నుంచి సయ్యద్ ముక్తర్ అలీ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు. అస్సాం, ఒడిశా, పాండిచ్చేరి, చత్తీస్‌గఢ్, విదర్భ, రైల్వేస్ జట్లు పోటీ పడనున్నాయని అన్నారు. ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లలో పాల్గొంటారని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను చలి వణికిస్తోంది. శృంగవరపుకోట మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో చలి తీవ్రత పెరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరి శిఖర ప్రాంతాల్లో వాతావరణం కూల్‌గా ఉంటోంది. మైదాన ప్రాంతాల్లో గడిచిన ఐదు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గాయి. గతేడాది పోలిస్తే ఈ సమయానికి చలి తక్కువేనని ప్రజలు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.