Vizianagaram

News May 18, 2024

విజయనగరం విద్యార్థికి 2వ ర్యాంక్

image

తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. వీటిలో విజయనగరం జిల్లా విద్యార్థి సత్తా చాటాడు. చిలకలపల్లికి చెందిన ఎన్. రాధాకృష్ణ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 2వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ విడుదలైన ఫలితాల్లో తొలి అయిదు ర్యాంకుల్లో ముగ్గురు ఏపీ విద్యార్థులు ఉండటం విశేషం.

News May 18, 2024

సాలూరు: రెండు రాష్ట్రాల్లో ఓటు వేసిన ఆ గ్రామాల ప్రజలు

image

ఆంధ్ర- ఒడిశా సరిహద్దు కోటియ గ్రూప్ గ్రామాలు ఓటర్లు ఆంధ్ర- ఒడిశా రాష్ట్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గంజయబద్రా, పగులుచెన్నూరు, పట్టుచెన్నూరు, సారిక, కురుకుట్టి పంచాయతీలో 21 గ్రామాలలో సుమారు 3,600 మంది ఓటర్లు ఉన్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో వ్యవహరించడంతో ఆయా గ్రామాలు ప్రజలు ఇరు రాష్ట్రాలలో ఓటుహక్కు వినియోగించారు.

News May 18, 2024

విజయనగరం జిల్లాలో జోరుగా బెట్టింగులు.!

image

జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఫలితాలకు 2 వారాలు సమయం ఉండటంతో బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో ఓ పార్టీ గెలుస్తుందని రూ. 10 లక్షలకు రూ.8 లక్షలు, మరో పార్టీ తరఫున రూ.10 లక్షలకు రూ. 6 లక్షలు చెల్లించుకునేలా పందేలు కాస్తున్నారని సమాచారం. పోలింగ్ శాతం భారీగా నమోదు కావడంతో ఇరు పార్టీల తమ అంచనాల మేరకు గెలుపుపై ధీమాగా ఉన్నారు.

News May 18, 2024

దత్తిరాజేరు: విద్యుదాఘాతంతో తమిళనాడు వ్యక్తి మృతి

image

విద్యుదాఘాతంతో ఓ యువకుడుప్రాణాలు కోల్పోయిన ఘటన దత్తిరాజేరు మండలంలో జరిగింది. ఎస్సై శిరీష వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన కార్తికేయన్(43) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు.తమిళనాడు నుంచి డ్రైవర్ చంద్రకుమార్ తోకలిసి శ్రీకాకుళం జిల్లా పలాసకు టైర్ల లోడుతో వెళ్లాడు.అక్కడ టైర్లను దింపి పెదమానాపురం సంతకు వచ్చారు. వర్షం వస్తుందని టార్పాలిన్ కప్పేందుకు లారీ పైకి ఎక్కగా విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు.

News May 18, 2024

భోగాపురం మండలంలో పులి సంచారం?

image

భోగాపురం మండలంలో పులి సంచారం స్థానికులను కలవరపెడుతోంది. మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి తన కూనలతో పాటు సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించామని అక్కడి వారు చెబుతున్నారు. విమానాశ్రయ ప్రాంతంలో జనసంచారం ఉంటుందని, అక్కడ పులి సంచరించే అవకాశం లేదని కొందరు అంటున్నారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలిస్తామన్నారు.

News May 18, 2024

ఆగి ఉన్న గూడ్స్ రైలు బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు

image

గజపతినగరం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు బొగ్గు వ్యాగన్ నుంచి శుక్రవారం సాయంత్రం పొగలు రావడంతో విజయనగరం అగ్నిమాపక కేంద్రం లీడింగ్ ఫైర్ మేన్ పి.మహేష్ సిబ్బంది పొగలను నివారించారు. రాయగడ నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు గురువారం రాత్రి వచ్చింది. లోకో పైలట్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వ్యాగన్ నుంచి పొగలు రావడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ మేరకు పొగలను నివారించారు.

News May 17, 2024

నిమ్మలపాలెం కటింగ్ వద్ద గుర్తుతెలియని యువకుడి మృతదేహం

image

కొత్తవలస మండలంలో నిమ్మలపాలెం బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న విజయనగరం జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు తెలియలేదన్నారు. బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు, నీలం తెలుపు రంగులతో కూడిన చెక్స్ గల ఫుల్ హ్యాండ్ షర్ట్, రెడ్ కలర్ బెల్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 9490617089 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News May 17, 2024

VZM: రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గురువారం రాత్రి సమయంలో నెల్లిమర్ల – విజయనగరం రైల్వే స్టేషన్‌ల మధ్య ఎగువ రైలు బండి ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుని వయస్సు సుమారు 35 ఏళ్లు ఉండవచ్చని రైల్వే పోలీసులు తెలిపారు. ఇతని ఎడమ మోచేతి పైన తెలుగులో అమ్మ అనే పచ్చబొట్టు ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం శ్రీకాకుళం రైల్వే పోలీసు స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ M. మధుసూదన్‌‌‌‌‌‌‌ని సంప్రదించాలన్నారు.

News May 17, 2024

బొండపల్లిలో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుపల్లి గ్రామం జీపీ అగ్రహారం వద్ద పొలంలో ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందాడు. గంటా గురుమూర్తి (44) శుక్రవారం పొలానికి వెళ్లాడు. పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ కింద ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

News May 17, 2024

VZM: రవాణా శాఖలో సాంకేతిక సమస్యలు..!

image

జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో పలు రకాల సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. వివిధ పనుల కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి చేరుకుంటున్న వాహనదారులు సర్వర్ డౌన్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్‌కి సంబంధించిన సమాచారాన్ని నోటీసు బోర్డులో పెట్టడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు.