India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఆఖరి నిమిషంలో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కిమిడి కళావెంకట్రావుకు ఏపీ కొత్త కేబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు.. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న కీలకనేతలకు స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కేబినెట్లో చోటుపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం కొలువుదీరనున్న నేపథ్యంలో విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టరేట్‌తో పాటు ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రత్యక్ష ప్రసారాల వీక్షణకు ఏర్పాట్లు చేశారు.
విజయనగరం జిల్లాలో 3,600 మద్యం షాపులు, 40 వేల కుటుంబాలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. దత్తిరాజేరు మండలం మానాపురం, మరడాం, రాజుల రామచంద్రపురం, మేడపల్లి, చల్లపేట వైన్‌షాపుల్లో చేస్తున్న సిబ్బంది రోడ్డెక్కారు. కొత్త ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన చెందారు. ఈ సమస్యని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మీడియాని కోరారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తొమ్మిదికి తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంది. మంగళవారం విజయవాడలోని ఎన్డీఏ శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఒకే ఫ్రేమ్‌లో ఫొటో దిగారు.
విజయవాడలోని ‘ఏ కన్వెన్షన్’ సెంటర్‌లో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మహిళ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అధితి గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి, ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి, సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ఉన్నారు.
రాష్ట్రంలో విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ శాసనసభ పక్ష నేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అత్యంత ఆదరణ ఇచ్చిన విశాఖ నగరం దేశంలోనే పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాం’. ఈ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
విజయనగరం జిల్లాలో పాలిథిన్ కవర్ల విచ్చలవిడి వినియోగం మొదటికి వచ్చింది. 2022లో 120 మైక్రాన్లలోపు పాలిథిన్ వినియోగాన్ని ఇక్కడ నిషేదించారు. అయినా పాలిథిన్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో ఉత్పత్తయ్యే 200 టన్నుల చెత్తలో 40% ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. 90% పైగా జీవాలు వీటిని తిని జీర్ణ వ్యవస్థ పనిచేయక మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్వగ్రామమైన చీపురుపల్లి మేజర్ పంచాయతీలో టీడీపీ ప్రభంజనం కనిపించింది. ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి 7,193 ఓట్లు పడగా… వైసీపీకి 4,988 ఓట్లు వచ్చాయి. చీపురుపల్లి మేజర్ పంచాయితీలో తెలుగుదేశం పార్టీకి 2,205 ఓట్ల భారీ ఆధిక్యత రావడం విశేషం. దాదాపు అన్ని వార్డుల్లోనూ టీడీపీ ఆధిక్యత కనబరిచింది.
జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను మంగళవారం తెలిపారు. MV నిబంధనలు అతిక్రమించిన 188 మందిపై రూ. 44,990 ఈ చలానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 17 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
బైక్ అదుపు తప్పి వంతెన డివైడర్‌ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన బొబ్బిలిలో చోటుచేసుకుంది. బొబ్బిలిలోని స్వామివారి వీధికి చెందిన జగదీశ్వరరావు (30) ఆదివారం రాత్రి ఇంటికి వస్తుండగా ఫ్లైఓవర్‌పై బైక్ అదుపుతప్పి వంతెన డివైడర్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగదీశ్‌కు ప్రథమచికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.