India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం ఆర్టీసీ జోన్ పరిధిలో ఉన్న తొమ్మిది ఆర్టీసి ఖాళీ స్థలాలను లీజ్‌పై ఔత్సాహిక వ్యాపారస్తులకు ఇవ్వనున్నామని డిప్యూటీ సిటీఎం బి.అప్పలనాయుడు తెలిపారు. జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఖాళీ స్థలాల లీజుకు ఆసక్తి చూపుతున్న శనివారం సమావేశమయ్యారు. ఈ నెల 26 మధ్యాహ్నం 2 గంటల లోపు జోనల్ వర్క్ షాప్ వద్ద దరఖాస్తులు స్వీకరించి, మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేరును ఆ పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, బుద్ధ ప్రసాద్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని పవన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో స్పష్టత రానున్నట్లు సమాచారం.
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం అసెంబ్లీ ఆవరణలో వారిని కలిసి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై వినతి అందించినట్లు ఆమె స్థానిక మీడియాకు తెలిపారు.
గరుగుబిల్లి మండలం తోటపల్లి పంప్ హౌస్ సమీపంలో ఏడు ఏనుగులు గుంపుగా సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. సమీప ప్రాంతం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో ఏనుగులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని కోరారు. వ్యవసాయ క్షేత్రాలలో పశువులను ఉంచరాదన్నారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి శనివారం బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగలక్ష్మి గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో జిల్లా కలెక్టర్ గా బి.ఆర్.అంబేడ్కర్ నియమితులయ్యారు.
శృంగవరపుకోట మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ధర్మవరం గ్రామానికి చెందిన పి.అజయ్ కుమార్(32) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ పెయింటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడికి భార్య, 4 సం. పాప ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. లక్కవరపుకోటలో అత్యధికంగా 57.2 మిల్లీమీటర్లు, నెల్లిమర్లలో 54.8 మిల్లీమీటర్లు, శృంగవరపుకోటలో 40.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
కూరగాయల ధరలు అమాంతంగా పెరగడంతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం ఉల్లి, టమాటా, బంగాళాదుంపల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి టోకు వర్తకులు, మార్కెటింగ్, పౌరసరఫరా అధికారులతో చర్చించారు. ఆర్ అండ్ బీ, దాసన్న పేట, ఎంఆర్ రైతు బజార్లలో టమాటా కిలో రూ.60, ఉల్లి రూ.35, బంగాళాదుంపలు కిలో రూ.30కు అమ్మాలని నిర్ణయించారు.
జిల్లాలో వర్షం కోసం అన్నదాతలు ఎదురుచూపులు చూస్తున్నారు. సాగు కోసం అన్ని సమకూర్చి సిద్ధంగా ఉన్నప్పటికీ అనుకూలమైన వర్షం పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్బీకేల ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్న తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. గడిచిన నాలుగు రోజుల నుంచి 35- 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వర్షం కురిసిన తడి ఆవిరవుతుందని రైతులు వాపోతున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మెంటాడ మం. కొంపంగికి చెందిన త్రినాథ్ కుటుంబంతో తాడేపల్లిగూడెంలో నివాసముంటున్నాడు. అక్కడే చెప్పుల షాప్‌లో పనిచేస్తూ భార్య అశ్విని(26), ఇద్దరు పిల్లలను పోషించేవాడు. గజపతినగరంలో సొంతంగా షాప్ పెడదామని కుటుంబంతో వ్యాన్‌లో బయలుదేరాడు. శుక్రవారం చెల్లూరు వద్ద వ్యాన్ బోల్తా పడగా అశ్విని తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందింది.
Sorry, no posts matched your criteria.