Vizianagaram

News June 22, 2024

VZM: కూరగాయల ధరలను నియంత్రించాలి..జేసీ

image

విజయనగరం కేంద్రంలో కూరగాయల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలను అదుపు చేయాలని రైతులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ కే.కార్తీక్ ప్రజలకు కూరగాయల ధరలు తగ్గించాలని కోరారు. హోల్సేల్ వ్యాపారులు, జిల్లా పౌరసరఫరాల అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెట్ వారితో చర్చించి రైతులతో మాట్లాడి ధరలు అదుపు చేయాలని సూచించారు. ఉల్లిపాయలు, టమోటా, బంగాళాదుంపల ధరల పట్టికను విడుదల చేశారు.

News June 21, 2024

VZM: జిల్లా వ్యాప్తంగా 293 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను శుక్రవారం వెల్లడించారు. MV నిబంధనలు అతిక్రమించిన 293 మందిపై రూ.54,705 ఈ చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 11 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 34 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.

News June 21, 2024

జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తాం: ఎస్పీ దీపిక

image

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 24 నుంచి ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎస్పీ ఎం.దీపిక గురువారం తెలిపారు. ఇకపై ప్రతీ సోమవారం యధావిధిగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.

News June 20, 2024

బొండపల్లిలో మృతదేహం కలకలం

image

బొండపల్లి మండలంలో ముచ్చర్ల గ్రామానికి చెందిన మజ్జి కృష్ణ (33) ఈనెల 17న తన భార్యను రూ.400 అడిగి బయటికి వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. గురువారం రవీంద్రం గ్రామంలో విగతజీవిగా పడిఉన్న కృష్ణను స్థానికులు గుర్తించారు. ఘటనపై మృతిని భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్నట్లు ఎస్సై కే.లక్ష్మణరావు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 20, 2024

గుర్ల: పాముకాటుతో మహిళ మృతి

image

గుర్ల మండలం నడుపూరు గ్రామానికి చెందిన కర్రోతు కళావతి పాము కాటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కళావతి పశువుల కోసం గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లింది. అక్కడ గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. దీంతో స్థానికులు ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మార్గంమధ్యలోనే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News June 20, 2024

డెంకాడ: హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

డెంకాడ పోలీసు స్టేషనులో 2020లో నమోదైన హత్య కేసులో నిందితుడు బొల్లు వెంకటరావుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయాధికారి తీర్పు చెప్పారని జిల్లా ఎస్పీ దీపిక జూన్ తెలిపారు. సింగవరం గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తిని బావ బొల్లు వెంకటరావు కుటుంబ తగాదాల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్‌తో కొట్టడంతో సురేశ్ మృతి చెందాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైంది.

News June 20, 2024

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్

image

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండపల్లి శ్రీనివాస్ గురువారం మంగళగిరిలో మధ్యతరహా పరిశ్రమ, SERP, NRI వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనవంతుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

News June 20, 2024

జగన్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం: MLC

image

జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో 117 తీసుకువచ్చి పాఠశాలలను నాశనం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయని, ఉపాధ్యాయులు ఫ్రెండ్లీగా ఉండాలని ఆకాక్షించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 117 జీవోను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందన్నారు.

News June 20, 2024

గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

విజయనగరం జిల్లాలో గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది పక్కాగా విధులు నిర్వహించాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. గంజాయితో ఎవరైనా పట్టుబడితే.. కేసులు పెట్టి వదిలేయకుండా మూలాల్లోకి వెళ్ళాలని సూచించారు. వారికి ఎక్కడి నుంచి సరుకు వచ్చింది? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వారి వెనుక ఉన్నదెవరు? కొనుగోలుదారులు వారితో సంబంధాలు ఉన్నవారు తదితర వివరాలు సేకరించాలన్నారు.

News June 20, 2024

VZM: 40 శాతం రాయితీతో వేరుశెనగ విత్తనాలు

image

ఉమ్మడి జిల్లాకు 1132 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ గుర్తించింది. 40 శాతం రాయితీతో రైతులకు అందించనున్నారు. విజయనగరం జిల్లాకు కె-6 రకం 600 క్వింటాళ్లు, మన్యంకు 188 క్వింటాళ్లు, గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై 10 క్వింటాళ్లు కేటాయించారు. లేపాక్షి రకం 300, 18, 16 క్వింటాళ్ల చొప్పున ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటికే 433 క్వింటాళ్ల సరకు మండల కేంద్రాలకు చేరింది.