India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ రవివర్మ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం అందిన సమాచారం మేరకు గజపతినగరం సమీపంలో పట్టాలపై వున్న మృతదేహాన్ని పరిశీలించామన్నారు. రైలు నుంచి జారీ పడటంతో వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని ఎస్ఐ తెలిపారు. సమాచారం తెలిసిన వారు విజయనగరం, బొబ్బిలి జీఆర్పీ స్టేషనుకు తెలపాలని కోరారు.
కేంద్ర మాజీమంత్రి పి.అశోక్ గజపతి రాజును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో ఉన్న అశోక్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. మంచి మంత్రిత్వ శాఖ ఇచ్చారని బాగా పనిచేసి పేరు తీసుకురావాలని రామ్మోహన్ నాయుడును కోరారు. విమానయాన రంగంపై అశోక్ తన అనుభవాలను వివరించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా అశోక్‌ను కలిశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా ఈనెల 24 నుంచి సమస్యలపై వినతులు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ జిల్లా నాయకులు మంగళవారం భేటీ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితరులు జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.
సాలూరులో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. టౌన్ సీఐ వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ థియేటర్, చిన్ని లాడ్జి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని మంగళవారం సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహం గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోయిందని సీఐ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై సీతారం చెప్పారు.
హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు గంజాయి రవాణా నిరోధానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామని డీసీపీ సత్తిబాబు తెలిపారు. విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు యాక్షన్ టీమ్ పని చేస్తుందన్నారు. ఇప్పటికే గంజాయి వినియోగిస్తున్న కొన్ని ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.
ఇంటర్మీడియెట్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,709 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,443 మంది ఉత్తీర్ణత సాధించారు. 84 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో 6,685 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,570 మంది ఉత్తీర్ణత సాధించారు. 68 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పేరిట జాయినింగ్ ఆర్డర్‌లు ఇస్తూ అమాయకులను మోసం చేస్తున్న అంశంపై పార్వతీపురం మన్యం జిల్లా డీఈవో పగడాలమ్మ స్పందించారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఈ అంశంపై తక్షణమే వివరణ ఇవ్వాలన్నారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ఏఎన్ఎంల నియామకం ఫైల్‌పై తొలి సంతకం చేశారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తానని, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తానన్నారు. మాతాశిశు మరణాలు నియంత్రణ చేస్తానని, కక్ష సాధించనని , త్రికరణ శుద్ధితో ప్రజల కోసం పని చేస్తానన్నారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు నేడు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం జరుగుతుందన్నారు. ఈ కారణంగా దర్శనాలు 6 గంటల తర్వాత లభించవని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.