India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి విజయనగరం ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.
రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ లేని విధంగా విజయనగరం జిల్లా కోర్టుకు ఆధునిక వసతులతో కూడిన నూతన భవన సమూహం మంజూరయ్యాయని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కృతజ్ఞతా పూర్వక అభినందన సభ నిర్వహించారు. ముఖ్యంగా యువ న్యాయవాదులే ఈ భవనాల్లో న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేయనున్నందున వారిపైనే భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యత అధికంగా ఉంటుందన్నారు.
విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లా ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
కార్తీక మాసం పురష్కరించుకుని భక్తులు ఒకే రోజు ఐదు పంచారామ క్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు విజయనగరం ఆర్టీసీ డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వచ్చేవారం వెళ్లాలనుకునేవారు తమను సంప్రదించాలని కోరారు.
కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల రెండో జాబితాలోనూ విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు చోటు దక్కలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కష్టపడ్డారు. 2024 ఎన్నికల్లో టికెట్ట్ దక్కకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంతో కిమిడి అభిమానులు నిరాశ చెందుతున్నారు.
LIC ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకి వినతిపత్రం అందజేశారు. తగ్గించిన పాలసీ కమిషన్ పెంచి గతంలో మాదిరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. క్లా బ్లాక్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. వారి సమస్యలను పై స్థాయికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ వారికి హామీ ఇచ్చారు.
విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో పోలీస్ అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా శనివారం విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. ముఖ్య కూడళ్ల వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో ఎంవీ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు ఈ-చలానాలు విధించారు. రికార్డులు సక్రమంగా లేని 531 వాహనాలను సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు కీలక పదవి వరించింది. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో ఆయనకు సముచిత స్థానం కల్పించింది. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రంగారావును నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
గుంతలు లేని రహదారుల నిర్మాణంలో భాగంగా విజయనగరం జిల్లాలో చేపడుతున్న 68 రహదారి మరమ్మతుల పనులన్నిటినీ సోమవారంలోగా ప్రారంభించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో 932 కిలో మీటర్ల రహదారి మరమ్మతుల పనులను జనవరి నాటికి పూర్తి చేయవలసి ఉన్నందున వెంటనే పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం R&B అధికారులతో రహదారి మరమ్మతుల పనులపై ఆయన ఛాంబర్లో సమీక్షించారు.
గుంతలు లేని రహదారుల నిర్మాణంలో భాగంగా విజయనగరం జిల్లాలో చేపడుతున్న 68 రహదారి మరమ్మతుల పనులన్నిటినీ సోమవారంలోగా ప్రారంభించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో 932 కిలో మీటర్ల రహదారి మరమ్మత్తుల పనులను జనవరి నాటికి పూర్తి చేయవలసి ఉన్నందున వెంటనే పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం R&B అధికారులతో రహదారి మరమ్మత్తుల పనులపై ఆయన ఛాంబర్లో సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.