India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో హెల్త్ అసిస్టెంట్ మృతి చెందాడు. రొంపల్లి ఆదినారాయణ(37) పాచిపెంట మండలం జిఎన్ పేట పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై వస్తుండగా ముచ్చర్లవలస సమీపంలో లారీ ఢీకొట్టింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీరాములు తెలిపారు.
విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. మోటార్ వెహికల్ నిబంధనలను అతిక్రమించిన వారిపై మొత్తం రూ.48,015 ఈ చలనా రూపంలో విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 8 కేసులు నమోదు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 21 కేసులు నమోదు చేశామన్నారు.
కొత్తవలస మండలం అడ్డూరివానిపాలెం వద్ద శనివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎల్.కోట మండలం మళ్లీవీడు గ్రామానికి చెందిన లంక జయమ్మ (60) తలకి తీవ్ర గాయమై మరణించింది. ప్రమాదం జరిగిన వెంటనే కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. పెద్దిరెడ్డి లక్ష్మి, వీ.నిర్మల, కర్రీ సత్యనారాయణ, కర్రీ మంగమ్మ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బొబ్బిలి మండలం పారాది కాజ్వే పై వరద నీరు చేరడంతో దెబ్బతిన్నదని రాయగడ, పార్వతీపురం నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు పట్టణ సీఐ కృష్ణారావు తెలిపారు. రాయగడ నుంచి వచ్చే వాహనాలు పాలకొండ రాజాం మీదుగా విజయనగరం వెళ్తాయని ఆయన తెలిపారు. పార్వతీపురం ఫ్లైఓవర్‌పైన దారి మళ్లింపునకు సంబంధించి బారికేడ్లు వేశారు.
వైసీపీ పాలనలో శాఖలన్నీ భ్రష్టుపట్టాయని మంత్రి సంధ్యారాణి దుయ్యబట్టారు. సాలూరులోని తన నివాసం వద్ద శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తన బాధ్యత పెరిగిందన్నారు. గిరిజన గర్భిణులు రోడ్లపై ప్రసవించడం, డోలి మోతలతో తిప్పలు, తాగు నీటికి 5KM నడవడం చూసి కన్నీరు పెట్టుకున్నానన్నారు. ఐటీడీఏ పాలకవర్గంతో సమావేశం నిర్వహించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.
విజయనగరం జిల్లాలో ఈనెల 19 నుంచి 26 వరకు ఐటీఐ కౌన్సిలింగ్ ఉంటుందని జిల్లా ఐటీఐ కన్వీనర్ టీ.వీ.గిరి ఆదివారం తెలిపారు. కౌన్సెలింగ్‌కు అప్లై చేసుకొన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను పట్టుకొని విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ కలశాలకు హాజరు కావలసిందిగా కోరారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ర్యాంక్, హాజరుకావాల్సిన తేదీని మెసేజ్ రూపంలో పంపిస్తామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా, మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రిసల్ సిస్టమ్‌గా పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. పేరు మార్పు చేసినా కార్యక్రమం తీరు అదే. అధికారులు ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై వినతులు స్వీకరిస్తారు.
మక్కువ మం. వెంకట భైరిపురానికి చెందిన ఓ వ్యక్తి భార్య డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈశ్వరరావు (37) మద్యానికి బానిసై భార్యను తరచూ డబ్బులు అడిగేవాడు. ఇవ్వకుంటే సూసైడ్ చేసుకుంటానని బెదిరించేవాడు. ఈ నెల 8న భార్యను డబ్బులు అడగగా.. ఆమె లేవని చెప్పింది. దీంతో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందాడు.
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని రైల్వే ఎస్.ఐ రవివర్మ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయనకు వచ్చిన సమాచారం మేరకు కొత్తవలస మండలం నిమ్మలపాలెం వద్ద రైల్వే బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహన్ని పరిశీలించామన్నారు. రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెంది ఉండవచ్చు అన్నారు. మృతదేహం పక్కన తాపీలు ఉన్నాయని, వ్యక్తి సమాచారం తెలిసిన వాళ్లు జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఉదయం జిల్లాకు రానున్నారు. మంత్రి పదవి చేపట్టిన తరువాత జిల్లాకు తొలిసారిగా వస్తున్న శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. మంత్రి ఆదివారం విశాఖపట్నంలో 9 గంటలకు బయలుదేరి 10 గంటలకు జిల్లాకు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.