India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఉదయం జిల్లాకు రానున్నారు. మంత్రి పదవి చేపట్టిన తరువాత జిల్లాకు తొలిసారిగా వస్తున్న శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. మంత్రి ఆదివారం విశాఖపట్నంలో 9 గంటలకు బయలుదేరి 10 గంటలకు జిల్లాకు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
తోటపాలెం జంక్షన్ సమీపంలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని మెడలో కేబుల్ వైర్లు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుని శరీరంపై రెండు చోట్ల కుమారీ, గంగా పేర్లతో పచ్చబొట్లు ఉన్నట్లు వారు తెలిపారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలన్నారు.
పార్వతీపురం నుంచి రాజమండ్రికి వెళ్లే ప్రయాణికుల కోసం కొత్తగా రెండు అదనపు బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ డీఎం కనకదుర్గ తెలిపారు. ఇప్పటివరకు పార్వతీపురం నుంచి విజయవాడకు మూడు అల్ట్రా డీలక్స్ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
భావితరాలకు గుర్తుండిపోయేలా రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం రణస్థలంలోని ఎంపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి రామోజీ నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు కలిశెట్టి సన్నద్ధం చేశారు.
జిల్లాలోని తాటిపూడిలో ఉన్న ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్(పీజీటీ)గా నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జె.ఎన్.సంధ్యాభార్గవి తెలిపారు. జూన్ 19 లోగా అర్హులైన మహిళా అభ్యర్థులు ఇంగ్లీషు, గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టుల్లో పోస్టులకు అప్లై చేసుకోవాలన్నారు. PG, BED విద్యార్హత కలిగి బోధనలో అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ల కాలం నుంచి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బకాయిలు పెరిగిపోతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లా కలెక్టర్ కార్యాలయం రూ.2.80 కోట్లు, హౌసింగ్ డీఈ కార్యాలయం రూ.2.10 కోట్లు, తపాలా శాఖ కార్యాలయం రూ.1.13 కోట్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం రూ.62.95 లక్షలు, జిల్లా కోర్టు రూ.3.93 కోట్లు రావాల్సి ఉంది. వడ్డీతో కలిపితే రెట్టింపు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి జరిగిన వాహనాల తనిఖీల్లో 201 మందిపై రూ43,450లను ఈ చలానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 5 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 26 కేసులు నమోదు చేశామని తెలిపారు.
నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామ పంచాయతీలో కెల్ల అప్పలనాయుడు (65) శనివారం ఉదయం విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. ఉదయం ఆవులకు పాలు తీసేందుకు బయలుదేరిన అప్పలనాయుడు చీకట్లో వైర్లను గమనించలేదు. ఈ క్రమంలో ఒక వైర్ అతని ఛాతిని తాకడంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై ఎస్సై గణేశ్ కేసు నమోదుచేసుకున్నారు.
హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ బి.జగన్మోహన్‌రావు అన్నారు. జోగంపేట ఎస్ఓఈ వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. వసతి గృహం పరిసరాలను పరిశీలించి వాడుక నీరు, వర్షం నీరు నిల్వలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలన్నారు.
ఆగస్టులో జరగనున్న టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జూలై ఒకటో తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. ఆలస్యమైతే రూ.50 అపరాధ రుసుముతో జూలై ఆరో తేదీలోగా చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు గమనించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.