Vizianagaram

News June 14, 2024

నాడు కళా వెంకట్రావు.. నేడు అనిత

image

పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు హోంశాఖ కేటాయించి ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఈ ప్రాంతంవారికి హోంశాఖ రావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్ కేబినేట్‌లో ప్రస్తుత చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా పనిచేశారు. నాడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నేడు రాజాం నియోజకవర్గంలో భాగమైంది.

News June 14, 2024

ప్రజా సమస్యలపై పోరాడాలి: జడ్పీ ఛైర్మన్

image

సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు గ్రామాల్లో ప్రజా సమస్యలపై పోరాడాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో శుక్రవారం తన నివాసంలో మెంటాడ మండల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు.

News June 14, 2024

పార్వతీపురం మన్యం జిల్లాకే వరుసగా మూడోసారి

image

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019లో కొత్తగా ప్రవేశ పెట్టిన గిరిజన సంక్షేమశాఖ వరుసగా మూడోసారి మన్యం జిల్లాకి వరించింది. YCP హయాంలో కురుపాం MLA పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఈ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో జిల్లాలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News June 14, 2024

సంధ్యారాణికి మహిళా శిశుసంక్షేమ, గిరిజనశాఖ.. శ్రీనివాస్‌కు MSME, సెర్ప్

image

సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి మహిళా శిశుసంక్షేమ, గిరిజనశాఖ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాలూరు నియోజవర్గం నుంచి మొదటి మహిళా మంత్రి సంధ్యారాణే కావడం గమనార్హం. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌కు శ్రీనివాస్‌కు MSME, సెర్ప్, ఎన్ఆర్‌ఐ వ్యవహారాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

News June 14, 2024

ఎల్.కోట: పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడు

image

ఎల్.కోట పోలీస్ స్టేషన్ పరిదిలోని కొనమసివానిపాలెం గ్రామనికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేసినట్లు యువతి చెప్పింది. యువకుని తల్లిదండ్రులను సంప్రదిస్తే కులాంతర వివాహం అంటూ నిరాకరించడంతో గురువారం పోలీసులను ఆశ్రయించింది.

News June 14, 2024

సస్పెండ్ చేయడం అన్యాయం: మాజీ ఎమ్మెల్సీ రాఘురాజు

image

ఎటువంటి తప్పు లేకుండా కేవలం తన భార్య పార్టీ మారిందని ఎమ్మెల్సీ పదవి నుంచి నన్ను సస్పెండ్ చేయడం అన్యాయమని, దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని మాజీ ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. శుక్రవారం విజయనగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తను వైసీపీని వీడలేదని, తన భార్య పార్టీ మారిందనే కోణంలో ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయడం సరికాదన్నారు.

News June 14, 2024

VZM: ఉమ్మడి జిల్లాలో 4.27లక్షల మందికి లబ్ధి

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 4.27 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వంతో లబ్ధి చేకూరనుంది. వృద్ధులు, వితంతువులు, మత్స్యకారులకు నెలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు చొప్పున పింఛన్ ఇక నుంచి అందనుంది. రెండు జిల్లాల్లో గత ప్రభుత్వం నెలకు 125.32 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం పెంచిన నగదుతో పాటు 3 నెలల బకాయిలు రూ. 7వేలు కలిపి జూలై నెలలో రూ.230 కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంది.

News June 14, 2024

భోగాపురం: వేటకు సిద్ధమవుతున్న మత్స్యకారులు

image

సముద్రంలో చేపల వేటకు సమయం వచ్చింది. విరామ గడువు తీరడంతో రెండు నెలల తర్వాత తిరిగి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో చేపల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఏప్రిల్ 15నుంచి ఈనెల 14 వరకు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధం విధించింది. ఇపుడు గడువు తీరడంతో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సామగ్రిని సిద్ధం చేసుకుని వేటకు వెళ్లనున్నారు.

News June 14, 2024

VZM: నాడు-నేడు రెండో విడత పనులు కొనసాగేనా?

image

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ప్రారంభించిన నాడు నేడు రెండో విడత పనులు పలు పాఠశాలల్లో నిలిచిపోయాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు రూ. 50కోట్ల నిధులతో పలు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. కాగా నిధుల లేమితో కొన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో నాడు-నేడు రెండో విడత పనులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

News June 14, 2024

నెల్లిమర్లలో బాలుడి హత్యకు కారణం ఇదే!

image

నెల్లమర్లలోని కొండపేటలో ఇటీవల జరిగిన బాలుడి హత్య కేసును ఛేదించినట్లు సీఐ రామారావు తెలిపారు. గ్రామానికి చెందిన బాలుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో ఆడేవాడు. ఆటలో గెలిచిన తర్వాత వారిని ఆటపట్టించడంతో కోపం పెంచుకున్నారు. ఈ నెల 10న మధ్యాహ్నం బాలుడిని తాటికాయల కోసం అని కొండపైకి తీసుకెళ్లారు. అక్కడే వెనుకనుంచి రాయితో కొట్టడంతో మృతిచెందాడు. నిందుతులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.