Vizianagaram

News May 5, 2024

సంబల్పూర్-కాచిగూడ ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 13 నుంచి 24 వరకు ప్రతి సోమవారం రాత్రి 9 గంటలకు సంబల్పూర్‌లో బయలుదేరి దువ్వాడ మీదుగా కాచిగూడ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి 25 వరకు ప్రతి మంగళవారం కాచిగూడలో రాత్రి 11 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా సంబల్పూర్ చేరుకుంటుందన్నారు.

News May 5, 2024

VZM: ఇక్కడ నోటాకు అత్యధిక ఓట్లు.. దేశంలోనే 2nd

image

అరకు లోక్‌సభ 2019 ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019లో బిహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, ఆ తర్వాతి స్థానంలో అరకులో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘జనరల్ ఎలక్షన్స్ 2019: యాన్ అట్లాస్’లో పేర్కొంది.

News May 5, 2024

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌కు మ‌రో అవ‌కాశం: ముఖేశ్ కుమార్ మీనా

image

ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మ‌రో అవ‌కాశాన్ని ఇస్తున్న‌ట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ప్ర‌క‌టించారు. ఆయ‌న ఆదివారం విజయనగరం జిల్లాలో ప‌ర్య‌టించారు. జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ గుర‌జాడ విశ్వ‌విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్ట‌ల్ బ్యాలెట్ ఫెసిలిటేష‌న్ సెంట‌ర్‌ను సంద‌ర్శించారు.

News May 5, 2024

చీపురుపల్లిలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

చీపురుపల్లి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. గరివిడి ఎస్ డీ ఎస్ డిగ్రీ కాలేజీలో ఓటింగ్ కొనసాగుతోంది . నాలుగు మండలాల వారీగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. RO నాగలక్ష్మి పర్యవేక్షణలో ఎలక్షన్ మొత్తం ప్రశాంతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. 

News May 5, 2024

RK బీచ్‌లో వాలీబాల్ ఆడిన బాలయ్య కుమార్తె

image

విశాఖలోని RK బీచ్ నుంచి YMCA వరకు వాక్ చేస్తూ శ్రీభరత్, తేజస్విని, వెలగపూడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ MP అభ్యర్థిగా శ్రీభరత్ ను గెలిపించాలని కోరారు. అనంతరం వారు RK బీచ్‌లో వాలీ బాల్ ఆడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఏపీ భవిష్యత్ బాగుపడాలంటే కూటమిని గెలిపించాలని కోరారు.

News May 5, 2024

విశాఖ: రోడ్డులో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు జీపు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పాడేరు వస్తుండగా… మైదాన ప్రాంతం వెళ్తున్న ప్రైవేట్ జీపు డైమండ్ పార్క్ జంక్షన్ సమీప మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ముడువ సింహాచలం మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News May 5, 2024

విజయనగరంలో నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా నేడు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం కానుంది. ఆ మేరకు ఫెసిలిటేషన్ సెంటర్లను శనివారం కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు.హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి, ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. జేసీ కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఆర్వో అనిత , డీఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

News May 5, 2024

ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్ నిశాంత్ కుమార్

image

జిల్లాలో ఓటు కలిగి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వారి స్వంత నియోజకవర్గాలలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు మే 5, 6 తేదీల్లో శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలన్నారు.

News May 4, 2024

VZM: నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలుఇవే

image

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు ఫెసిలిటేషన్ కేంద్రాలను అధికారులు కేటాయించారు. రాజాం- (ప్రభుత్వ ఉన్నత పాఠశాల, RTC కాంప్లెక్స్ దరి), బొబ్బిలి-(మున్సిపల్ పాఠశాల గొల్లపల్లి), చీపురుపల్లి-( శ్రీరామ్ జూనియర్ కాలేజ్, SDS కాలేజ్), గజపతినగరం-(బాలికల ఉన్నత పాఠశాల, పురిటిపెంట), నెల్లిమర్ల-(CKMకాలేజ్, MIMS పక్కన), విజయనగరం-(JNTU), శృంగవరపుకోట -(ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఎస్ కోట)లో ఏర్పాటు చేశారు.

News May 4, 2024

VZM: జిల్లాలో 18,631 పోస్టల్ బ్యాలెట్లు

image

జిల్లాలో 18,631 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. బొబ్బిలి నియోజక వర్గంలో 2105 మంది , చీపురుపల్లి‌లో 1405 మంది, గజపతినగరం లో 1665 మంది, నెల్లిమర్ల లో 1525 మంది , విజయనగరంలో 3975 మంది, శృంగవరపుకోట (అసెంబ్లీ)లో 1776, రాజాంలో 1741 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.