India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇందుకూరి రఘురాజు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రఘురాజు గతంలోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ డిగ్రీ మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్, మూడో సెమిస్టర్, 4వ సెమిస్టర్, 5వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షల విభాగం అధికారులు పేర్కొన్నారు. జూన్ నెలలో జరిగిన ఈ పరీక్షలకు రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ మార్కుల వివరాలను AU వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఇందుకూరి రఘురాజు ఎన్నికయ్యారు. సొంత పార్టీలో పొసగలేని రఘురాజు.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు అప్పటిలో వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల ముందు రఘురాజు సతీమణి సుధారాణి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక సంస్థల MLC స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో, జిల్లాలో శనివారం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయరాదన్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించడం లేదని దీన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. దూరప్రాంతాల నుంచి అనవసరంగా వ్యయ ప్రయాసలకు ఓర్చి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో నైపుణ్య గణన 2024ను పక్కాగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నైపుణ్య గణన 2024పై ఎంపిడిఓలతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 15 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సుగల వారి పూర్తి వివరాలను నైపుణ్య గణనలో నమోదుచేయించాలని అన్నారు.
ఈ నెల 4వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గ్రీవెన్స్ రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని ఆయన కోరారు.
పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటే క్రమంలో వ్యక్తి మృతి చెందాడు. రాయపూర్ పాసింజర్ రైలు ఢీకొని బలిజిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఇప్పలి అప్పలరాజు (64) మృతి చెందారు. కూనేరు సంతకు వెళ్లేందుకు రైలు ఎక్కేందుకు వస్తుండగా రైలు ఢీకొని ఉంటుందని బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. తూడి గ్రామానికి చెందిన కొనిశ శివ(27) తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిందని రైల్వే HC దేశాబత్తుల రత్నకుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పార్వతీపురం జిల్లాలో కంటి వెలుగు కింద చేపడుతున్న దృష్టి లోపం నిర్దారణ పరీక్షలను ఈ నెల 6 నుంచి నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇందుకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ రూపొందించిన ముందస్తు ప్రణాళికను ఎంపీడీఓలకు వివరించారు. ముందుగా సీతంపేట, గుమలక్ష్మిపురం, సాలూరు, పాచిపెంట, జియమ్మవలస, కొమరాడ మండలాల్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయాల్లో నవంబర్ 6 నుంచి నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.