Vizianagaram

News November 2, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం

image

పార్వతీపురంలోని రైలు పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. జీఆర్పీ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో ఒకరు మృతి చెందగా, కూత వేటు దూరంలో మరొకరు మృతి చెందారు. ఒకే ప్రాంతంలో ఇద్దరు మృతి చెందడంపై పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 2, 2024

VZM: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పై ఉత్కంఠ

image

విజయనగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు పడడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందులో మెజారిటీ స్థానాల్లో వైసీపీ సభ్యులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీలో నిలుస్తుందో లేదో చూడాలి. కాగా అభ్యర్థులు ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

News November 2, 2024

పార్వతీపురం: గదబవలస సమీపంలో ఏనుగుల బీభత్సం

image

పార్వతీపురం మండలం గదబవలస గ్రామ సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రహదారిపై వెళ్తున్న ఆటోను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఏనుగులు వస్తున్న సమయంలో ఆటోలో ఉన్న కార్మికులు గమనించి పరుగులు తీశారు. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News November 2, 2024

విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన రద్దు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా పర్యటన వాయిదా పడింది. గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామానికి సీఎం చంద్రబాబు శనివారం రావల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల కారణంగా పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ధ్రువీకరించారు. రాష్ట్రంలోని R&B రహదారుల పునఃనిర్మాణానికి ఇక్కడ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టాల్సి ఉండగా కార్యక్రమం వాయిదా పడింది.

News November 1, 2024

విశాఖ-విజయవాడ మధ్య జన్ సాధారణ్ రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ- విజయవాడ-విశాఖ మధ్య జన్ సాధారణ్ రైళ్లను(అన్ రిజర్వుడు) శుక్రవారం నుంచి నడుపుతున్నారు. విశాఖ -విజయవాడ-విశాఖ మధ్య 1,3,4,6,8,10,11,13 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, స్టేషన్ల మీదుగా నడుస్తాయన్నారు.

News November 1, 2024

VZM: ఈనెల 10న డీఎస్సీ ఉచిత శిక్షణకు స్కీనింగ్ పరీక్ష

image

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నవంబర్ 3న జరగాల్సిన స్క్రీనింగ్ పరీక్షను నవంబర్ 10న నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఉప సంచాలకులు బి.రామనందం శుక్రవారం తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ నమోదు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి 3 నెలల పాటు ఉచిత భోజన, వసతులు కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.

News November 1, 2024

VZM: టీచంగ్, నాన్ టీచింగ్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల

image

KGBVలో టీచింగ్, నాన్-టీచింగ్ (అకౌంటెంట్, వార్డెన్) పోస్టుల్లో అన్ని కేటగిరీలకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను తయారు చేసినట్లు జిల్లా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. Vizianagaram.ap.gov.in వెబ్సైట్‌లో ఈ మెరిట్ లిస్ట్‌‌ను పొందుపరిచామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సమగ్ర శిక్షణా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News November 1, 2024

విజయగనరంలో సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఇదే

image

నవంబర్ 2న విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం ఉ.11:10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో గంగచోళ్లపెంటలో ల్యాండ్ అవుతారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధుల, అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12:05 గంటల నుంచి 12:25 గంటల వరకు రోడ్ల గుంతల పూడ్చివేత ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:45 వరకు మీడియాతో మాట్లాడి.. అనంతరం విశాఖ వెళతారు.

News October 31, 2024

IPL: విశాఖ ప్లేయర్‌కు రూ.6కోట్లు

image

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. విశాఖకు చెందిన ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడి ధర కేవలం రూ.20 లక్షలు మాత్రమే.

News October 31, 2024

VZM: సీఎం సభావేదిక ఫిక్స్.. 

image

నవంబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో పర్యటించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గంగచోళ్ల పెంట వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పురిటిపెంట వద్ద రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చే పనుల్లో ఆయన స్వయంగా పాల్గొననున్నట్లు వివరాలు వెల్లడించారు.