Vizianagaram

News May 1, 2024

విశాఖలో ఎస్.కోట వాసి దారుణ హత్య

image

డుంబ్రిగుడలో దారుణ హత్య జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయంలో ప్లాస్టిక్ వినియోగ పరికరాలు సేకరించే ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. అరకు సీఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడు ఎస్.కోట మండలం రాజిపేట గ్రామానికి చెందిన బత్తిన శివ శ్రీనివాస్‌గా గుర్తింమన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

image

పోక్సో కేసులో రామభద్రపురం మండలంలోని కోటశిర్లాం గ్రామానికి చెందిన నిందితుడు గర్బాపు వినయ్ కుమార్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. బొబ్బిలి రూరల్ సీఐ తిరుమలరావు మాట్లాడుతూ.. 2020లో బాలికను మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. నేరం రుజువు కావడంతో జడ్జి నాగమణి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.

News May 1, 2024

విజయనగరంలో రేపు బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

image

సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విజయనగరంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకి విజయనగరంలోని ముఖ్య కూడలి గంటస్తంభం వద్ద బాలకృష్ణ రోడ్ షో నిర్వహించి, అక్కడ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News May 1, 2024

పార్వతీపురం మన్యం జిల్లాకు నూతన DMHO

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డా.కే.విజయపార్వతీ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వహించిన డా.బగాది జగన్నాథరావు మంగళవారం పదవీ విరమణ చేసిన సంగతి అందరికీ విదితమే.

News May 1, 2024

స్టార్ క్యాంపెయినర్‌‌‌గా కిమిడి నాగార్జున

image

సార్వత్రిక ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా పలు నియోజకవర్గాలకు టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను పార్టీ అధిష్టానం నియమించింది. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకుంటూ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార భాద్యతలను టీడీపీ అధినాయకత్వం అప్పగించింది.

News May 1, 2024

బొబ్బిలిలో సీఎం సభ.. రక్షణ కల్పించాలని ఫిర్యాదు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్ బొబ్బిలిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట బొబ్బిలి మొయిన్ రోడ్డులో సభ పెట్టేందుకు సన్నాహాలు చేయగా.. బొబ్బిలి కోట ఉత్తర ద్వారం ఎదురుగా సభ పెట్టేందుకు మంగళవారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. కూటమి అభ్యర్థి బేబినాయన ఇంటికి సమీపంలో సభ నిర్వహించడంపట్ల అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది గంట శర్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

News May 1, 2024

నేడు బొబ్బిలిలో సీఎం జగన్ పర్యటన

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బొబ్బిలిలో జరిగే సభలో ఈరోజు పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు బొబ్బిలి మొయిన్ రోడ్డు సెంటర్లో జరిగే ప్రచార సభలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. బొబ్బిలి సభ అనంతరం ఆయన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బయలుదేరి వెళ్తారు.

News May 1, 2024

ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించాలి: మన్యం ఎస్పీ

image

సాధారణ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం పార్వతీపురంలో మన్యం జిల్లా డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాలు, వ్యక్తులపై నిరంతర నిఘా ఉండాలని, ఎన్నికల నిబంధనలు ప్రకారం పని చేయాలన్నారు. అనంతరం మార్చి నెల సంబంధించిన నేర సమీక్ష చేపట్టారు.

News April 30, 2024

ప్రచారం మధ్యలో సొమ్మసిల్లి పడిపోయిన సంధ్యారాణి

image

మక్కువ మండలంలోని పెద్ద ఊటగడ్డ గ్రామంలో సాలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం మధ్యాహ్నం ప్రచారం చేశారు. ఎండ ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పార్టీ శ్రేణులు అర్ధాంతరంగా ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. అనంతరం సంధ్యారాణిని సాలూరుకు తరలించారు.

News April 30, 2024

ఉమ్మడి విజయనగరంలో 99 మంది పోటీ

image

ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఎంతమంది పోటీలో ఉంటారన్నది లెక్క తేలింది. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం మొత్తంగా 99 మంది బరిలో ఉన్నారు. అయితే అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలో 15 మంది పోటీచేస్తుండగా..అత్యల్పంగా చీపురుపల్లి, కురుపాం, సాలూరులో 7గురు చొప్పున బరిలో ఉన్నారు. ఎస్.కోట-12, నెల్లిమర్ల-12, గజపతినగరం-13, బొబ్బిలి-8, పార్వతీపురం-8 మంది చొప్పున పోటీ చేస్తున్నారు.