Vizianagaram

News April 30, 2024

టీడీపీ నుంచి మీసాల గీత సస్పెన్షన్

image

మాజీ MLA మీసాల గీతను TDP అధిష్ఠానం సస్పెండ్ చేసింది. విజయనగరం MLA సీటు ఆశించి భంగపడ్డ గీత ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసినప్పటికీ ఆమె ఉపసంహరించుకోకపోవడంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

News April 30, 2024

మే 1లోగా పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో జరగనున్న సాధారణ ఎన్నికల విధుల్లో భాగంగా కొత్తగా ఓ.పి.ఓలుగా నియమితులైన వారు మే 1వ తేదీలోగా తమ ప్రాంత తహశీల్దారుకు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోని ఓపిఓలు ఫారం-12 లో దరఖాస్తులు అందజేయాల్సి వుంటుందన్నారు.

News April 29, 2024

విజయనగరం: పసికందు మృతదేహం కలకలం

image

మెంటాడ మండలం ఆండ్రలో సోమవారం చంపావతి బ్రిడ్జిని ఆనుకొని ఉన్న ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన పసికందును పడేసినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దర్యాప్తు చేసి పూర్తి సమాచారం వెల్లడిస్తామని ఆండ్ర సబ్ ఇన్‌స్పెక్టర్ బొడ్డు దేవి చెప్పారు. తదుపరి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

News April 29, 2024

విజయగనరంలో 92 మంది పోటీ

image

నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. విజయనగరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 77 మంది పోటీలో ఉన్నారు. VZM అసెంబ్లీ స్థానంలో 15 మంది అభ్యర్థులు, ఎస్.కోటలో 12, నెల్లిమర్లలో 12, గజపతినగరంలో 13, చీపురుపల్లిలో 7, రాజాంలో 10, బొబ్బిలిలో 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల నుంచి 7 అభ్యర్థులు తప్పుకున్నారు.

News April 29, 2024

బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

image

విజయనగరంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 8వ తరగతి వరకు 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ జె.దయానంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో చేరేందుకు 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. ఆసక్తికలవారు 9000013640, 9440437629 నెంబర్లను సంప్రదించి పాఠశాలలో ప్రవేశంకోసం మరింత సమాచారం తెలుసుకోవచునన్నారు

News April 29, 2024

మే 13న సెలవు: కలెక్టర్‌

image

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్‌ జరిగే మే 13న జిల్లాలో స్థానిక సెలవుదినంగా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ చట్టం, 1881 ప్రకారం సెలవు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు.

News April 29, 2024

విజయనగరం : ప్రమాదానికి గురైన ఆర్మీ జవాన్

image

విజయనగరం జిల్లా సమీపంలో తగరపువలస జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఓ బాలికను తప్పించబోయి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 29, 2024

విశాఖలో సీఎం జగన్ పర్యటన … షెడ్యూల్ ఇదే..!

image

సీఎం జగన్ సోమవారం చోడవరం రానున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటలకు చోడవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభకు వస్తారు. ఉదయం 11 నుంచి 11.45 గంటల వరకు కొత్తూరులో జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట వెళ్లనున్నారు.

News April 29, 2024

తెర్లాం: చికిత్స పొందుతూ VRO మృతి

image

బాడంగి మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న రాజయ్యపేటకుగ్రామానికి చెందిన ఏవీఎస్ డీకే రాజు (58) ఆదివారం మృతి చెందారు. ఇటీవల విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖలో చికిత్స పొందుతూ , ఇతర అనారోగ్య సమస్యలతో పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు వీఆర్వోల సంఘం సంతాపం ప్రకటించింది.

News April 28, 2024

VZM: ‘పింఛన్లు సొమ్ము నేరుగా ఖాతాల్లోకే’

image

సామాజిక పింఛన్ల పంపిణీపై కలెక్టర్ నాగలక్ష్మి కీలక ప్రకటన చేశారు. మోడల్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో దివ్యాంగులు, సైనిక్ వెల్ఫేర్ పింఛన్లు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి సొమ్ము అందజేస్తారని చెప్పారు. అలాంటి వారిని ఇప్పటికే గుర్తించామని స్పష్టంచేశారు. మిగిలిన వారికి డీబీటీ విధానం ద్వారా మే 1న జమ చేస్తామని తెలిపారు.